ఈ భాగంలో అనుభవం:
- ప్రతిక్షణం తోడుగా ఉంటూ ఆందోళనలు, శారీరిక, మానసిక సమస్యలు తీర్చే బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. సాయినాథుడు పిలిస్తే పలికే దైవం. బాబానే నాకన్నీ. ఆయన నా ప్రార్థనలు విని నన్ను ఎన్నోసార్లు అనుగ్రహించారు. నేను ఒక సంవత్సరం నుండి ఒక ప్రభుత్వ పరీక్షకోసం ప్రిపేరవుతూ ఎలాగైనా కష్టపడి ఆ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని చాలా పట్టుదలగా అనుకున్నాను. కానీ అదే సమయంలో నాకు పెళ్లవడం, ఆ తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడం, కాపురానికి వెళ్ళడం, గర్భవతినవ్వడం మొదలైన వాటివల్ల నా ప్రిపరేషన్ నేను అనుకున్నంత స్థాయిలో జరగలేదు. అందువల్ల ఒకపక్క అనుకున్నట్టు ప్రిపేరవ్వలేకపోతున్నాన్న బాధ, ఇంకోపక్క ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే
నా చుట్టూ వున్న వాళ్ళు
నన్ను విమర్శిస్తారన్న భయం నన్ను వెంటాడాయి. అలా ఆందోళనతో, భయంతో నా ప్రిపరేషన్ జరిగింది. బాబా మీద భారమేసి పరీక్ష వ్రాసాను. కానీ నేను క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకోలేకపోయాను. అందువల్ల నేను నన్ను అందరూ తీవ్రంగా విమర్శిస్తారని భయంతో చాలా మదనపడ్డాను. కానీ బాబా నా రక్షకుడిగా ఉండి నన్ను ఎటువంటి విమర్శలకు గురికాకుండా చేశారు. రిజల్ట్ గురించి చెప్పినప్పుడు ఎవరూ నేను బాధపడేలా ఏమీ అనలేదు. అందరూ చాలా మామూలుగా స్పందించారు. అదివరకు అందరూ నా ప్రిపరేషన్ గురించి అడిగి, నేను ఎలాగైనా క్వాలిఫై అవ్వాలన్నట్టు మాట్లాడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇలా స్పందించడం కేవలం బాబా అనుగ్రహమే. "ధన్యవాదాలు బాబా. ఈసారైనా నేను పాసయ్యేలా అనుగ్రహించు తండ్రీ".
ఒకసారి నేను, మావారు, మా అమ్మానాన్న ఒక ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఈలోగా మావారు పని మీద వేరే ఊరు వెళ్ళారు. సరిగ్గా మావారు తిరిగి వచ్చే రోజుకి ఆ ఫంక్షన్ తేదీ మారింది. అందువల్ల మావారు నన్ను మా అమ్మానాన్నతో వచ్చేయమని, తాను నేరుగా ఫంక్షన్‌కి వస్తానని చెప్పారు. అయితే మా నాన్న మెడ నొప్పి కారణంగా కారు నడపలేని పరిస్థితి. గర్భవతినైన నేను కూడా ఎక్కువ దూరం నడిపే పరిస్థితి లేదు. అందుకని కారులో కాకుండా ట్రైన్‌లో వస్తామంటే, మావారు ఒప్పుకోలేదు. కారులో అయితే అక్కడికి సమీపంలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చన్ నది ఆయన ఆలోచన. ఇక అప్పుడు మా నాన్న కారులో కాకుండా డ్రైవర్‌ని మాట్లాడుకొని మావారి కారులో వెళదామని అనుకున్నాం. కానీ చివరి నిమిషం దాకా సరైన డ్రైవర్ దొరకలేదు. దొరికినా, వాళ్లంతా చాలా ఎక్కువ డబ్బులు అడిగారు. నాకు ఏం చేయాలో తోచక బాబాని ప్రార్ధించాను. బాబా దయవల్ల ఒక డ్రైవర్ కుదిరాడు. 'హమ్మయ్య..' అనుకున్నాను కానీ, మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఆ డ్రైవర్ మా ఇంటిదాకా రానని, మమ్మల్ని ఒక చోటుకి వస్తే అక్కడినుండి తీసుకుపోతాను అన్నాడు. అయితే మావారిది ఆటోమేటిక్ కారు. మా నాన్నకు, నాకు మామూలు కారు నడపడం వచ్చుగానీ ఆటోమేటిక్ కారు నడపడం సరిగా రాదు. ఆఖరి నిమిషంలో అటువంటి పరిస్థితి ఎదురయ్యేసరికి నాకు ఏం చేయాలో తోచలేదు. బాబాని వేడుకొని చిన్నగా కారు నడుపుతూ డ్రైవర్ రమ్మన్న చోటుకి వెళ్ళాము. బాబా అనుగ్రహం వల్ల డ్రైవర్ చెప్పిన ప్రదేశం దాకా ఏ ఇబ్బంది లేకుండా నేను నడపగలిగాను. అక్కడినుండి డ్రైవర్ మమ్మల్ని క్షేమంగా మేము వెళ్లాల్సిన ఊరికి చేర్చారు. ఆపై మావారు కారు నడుపుకున్నారు. ఇది చిన్న విషయమే అయినా బాబా నా ప్రతి ఆందోళనను తీరుస్తారనే దానికి నిదర్శనం.
అలా కష్టపడి ఫంక్షన్‌కి వెళ్తే, హఠాత్తుగా ఆ రోజు నాకు విపరీతంగా జలుబు చేసి గొంతునొప్పి వచ్చింది.
గర్బవతినవ్వడం వల్ల ఏ మందులు అంటే ఆ మందులు నేను వేసుకోకూడదు. కానీ నొప్పి ఎంతకీ తగ్గలేదు. ఆ నొప్పి వల్ల వాంతులవుతూ చాలా ఇబ్బందిపడ్డాను. ఫంక్షన్ ఎంజాయ్ చేయలేకపోయాను. ఆ విషయం అలా ఉంచితే ఫంక్షన్ తర్వాత మేము పుణ్యకేత్రాలకి వెళ్లాల్సి ఉంది. నాకు ఏం చేయాలో తెలియక బాబాని ప్రార్ధించాను. బాబా దయవల్ల నేను ప్రెగ్నెన్సీ చెకప్ చేయించుకునే డాక్టర్ ఫోన్లో అందుబాటులోకి వచ్చి ఒక మాత్ర వేసుకోమని చెప్పారు. ఆ మాత్ర వేసుకుంటే మర్నాటికల్లా గొంతునొప్పి తగ్గిపోయింది. మామూలుగా అయితే యాంటీబయాటిక్స్ వేసుకున్నా మూడు రోజుల్లో తగ్గేది. అలాంటిది చిన్న జలుబు మాత్రతో ఒక్క రాత్రిలో తగ్గిపోయింది. ఇది కేవలం బాబా కృప. ఆయన ప్రతిరోజూ, ప్రతిక్షణం నాతో ఉంటూ నా ఆందోళనలు, శారీరిక, మానసిక సమస్యలు తీరుస్తున్నారనే దానికి ఈ మూడు అనుభవాలు పెద్ద నిదర్శనాలు. బదులుగా నేను ఆయనకు ఏమీ చేయలేను. కేవలం ఆయన అడిగిన శ్రద్ధ-సబూరి అనే రెండు పైసల దక్షిణ సమర్పించడానికి ప్రయత్నించడం తప్ప.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!

Jaisairam bless eesha her lips health issues and leg pain. Bless her to study well 🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOmsairam🌹🙏🌹🙏🌹
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm sri sairam🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai sri sai Jaya Jaya sai
ReplyDelete