ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా దయవల్లే చేకూరిన ఆరోగ్యం
2. బాబా దయ
బాబా దయవల్లే చేకూరిన ఆరోగ్యం
సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాధిక. ఒకరోజు మామూలుగా మా అమ్మ ఫోన్ చేసి, "కళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. తుంటి దగ్గర పట్టుకుపోయింది. నడవేలేకపోతున్నాను" అని చెప్పింది. అది విని నేను చాలా ఆందోళన చెందాను. "బాబా! అమ్మకి నొప్పులు తగ్గేలా చేయండి" అని వేడుకొని సాయిని తలుచుకుంటూ ఉన్నాను. అదేరోజు సాయంత్రం అన్నయ్య అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టరు ఎక్స్రే తీయించి, "రిపోర్టు నార్మల్ వచ్చింది కానీ, షుగరు వ్యాధి వచ్చింది. షుగర్ అదుపులోకి వస్తే, నొప్పులు తగ్గుతాయి" అని చెప్పారు. నేను వెంటనే అమ్మ దగ్గరకి వెళ్లి, "నొప్పి ఉన్న చోట బాబా ఊదీ రాసుకోమ"ని చెప్పి, కొద్దిగా ఊదీ నీళ్లలో వేసి అమ్మకి ఇచ్చాను. అక్కడే 4 రోజులు ఉండి తిరిగి వచ్చాను. ఊదీ మహామ వలన అమ్మ నిదానంగా కోలుకొని నెలరోజులకు చిన్నగా నడవడం ప్రారంభించింది. తర్వాత అమ్మ మామూలుగా నడుస్తున్నానని చెప్పినప్పుడు నేను పొందిన ఆనందం అంతాఇంతా కాదు. ఇది సాయి వల్లే జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ నా తల్లిని కనిపెట్టుకొని ఉండయ్యా. తనకి ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రీ. సదా నిన్నే స్మరిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న కోరికను తీర్చండి సాయినాథా".
ఒకరోజు నా ప్రాణస్నేహితురాలి కూతురికి అనుకోకుండా కడుపునొప్పి వచ్చింది. నా స్నేహితురాలు, 'గ్యాస్ నొప్పే తగ్గిపోతుంద'ని పాపకి టాబ్లెట్ ఇచ్చింది. కానీ ఎంతసేపటికీ పాపకి నొప్పి తగ్గలేదు. దాంతో ఇంటికి దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి పాపని తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షించి, ఆయన కూడా "గ్యాస్ నొప్పిలానే వుంది" అని తక్షణ ఉపశమనం కోసం పాపకి సెలైన్ పెట్టారు. అయినా పాపకి నొప్పి తగ్గలేదు. అప్పటికి రాత్రి 9 గంటలైంది. డాక్టరు, "పాప పొద్దుటి నుండి నొప్పి భరించలేకుండా వుంది. ఎంతసేపటికీ నొప్పి తగ్గడం లేదు కాబట్టి, పాపని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లండి" అని చెప్పారు. ఆ సంగతి నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసి చెప్పింది. తర్వాత వాళ్ళు పాపని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి నేను కూడా అక్కడికి చేరుకున్నాను. ఆ సమయమంతా నేను సాయి నామస్మరణ చేస్తూ ఉన్నాను. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చాయి. డాక్టరు, "పాప తిన్న ఆహారంలో ఏదో తనకి పడలేద"ని చెప్పారు. మర్నాటికి పాపకు నొప్పి తగ్గి నార్మల్ అయింది. ఇదంతా బాబా దయవల్లనే జరిగింది. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ మిమ్మల్ని కొలిచేవారిని కాపాడండి బాబా".
సర్వం సాయినాథార్పణమస్తు.
బాబా దయ
నేను ఒక సాయి భక్తురాలిని. నా చిన్నప్పటినుంచి బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు.
నాకు ఓసిడి('అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్', అది ఒక మానసిక రుగ్మత) సమస్య ఉంది. అలాంటి నాకు ఈమధ్య బాగా అలసటగా ఉండటం, బరువు తగ్గడం, ఆకలి ఎక్కువగా వేయడం, ఎప్పుడూ బడలికగా వుండడం వంటి సమస్యలు వచ్చాయి. అప్పుడు అదివరకు నన్ను చూసిన ఒక హోమియోపతి డాక్టర్ 'మీకు థైరియడ్ వచ్చే అవకాశముంద'ని చెప్పిన విషయం గుర్తొచ్చి, 'ఈ సమస్యలన్నీ థైరాయిడ్ వల్ల వచ్చాయేమోన'ని చాలా భయపడిపోయాను. ఆలస్యం చేయకుండా మర్నాడే థైరాయిడ్ టెస్టుకి ఇచ్చి రిపోర్టులు వచ్చేవరకు చాలా టెన్షన్ పడ్డాను, ఎంత టెన్షన్ పడ్డానో మాటల్లో చెప్పలేను. టెస్టుకు ఇచ్చినప్పటి నుంచి బాబాని తలచుకుంటూ గడిపాను. ఆశ్చర్యం! థైరాయిడ్ లేదని రిపోర్ట్ నార్మల్ వచ్చింది. దాంతో నాకు ఎంత ఉపశమనంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఇది కేవలం బాబా దయ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. "ధన్యవాదాలు బాబా! మీ మీద భక్తి పెరుగుతూ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను".
Om sai ram tandri, amma nannalani shivani yeppudu kshamam ga arogyam ga chusukondi, na manasulo unna badha ni korikani terchandi tandri pls nv tappa vere naaku ye dikku ledu.
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai 🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba Amma nanna ki ayurarogyalu prasadinchadi 🙏🥲
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteSai thalli plz na health, biddala health bagundela chudu swamy 🙏🙏🙏
ReplyDeleteOmsairam
ReplyDelete