సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2123వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చేసిన అద్భుతం
2. బాబా చేసిన చిన్న సహాయం


బాబా చేసిన చిన్న సహాయం

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మి. మేము మా ఇంటికి రిపేర్లు(పెయింటింగ్, ఇంటీరియర్, కరెంట్, ఇంకా కొన్ని అవసరమైన పనులు) చేయించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము. ఆ విషయమై మా ఇంట్లో చాలాసార్లు చర్చ జరిగిన మీదట చివరికి మావారు ఒప్పుకొని, "ముఖ్యమైన పనులు మాత్రమే చేయించుకోండి. అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు?” అని అన్నారు. కానీ మేము ఉన్నంతలో కొంచెం బాగా, అందంగా చేయించుకుందామనుకున్నాము. ఇంటీరియర్ పని చేయించాలంటే ఇల్లు ఖాళీగా ఉండాలని అనడంతో మేము మా అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న రెండు, మూడు ఇల్లు అడిగాము. కానీ, అవి మాకు దొరకలేదు. చివరకు మా అపార్ట్‌మెంట్‌లోనే 5వ అంతస్తులోని ఇల్లు ఉందంటే మాట్లాడం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా బాబా దయవల్ల ఆ ఇంటిని మాకు పద్దెనిమిది రోజులకోసం ఇచ్చారు. అప్పుడు మేము ఆ ఇంటికి మారి, మా ఇంటిలో పనులు మొదలుపెట్టాము. ఆ క్రమంలో మేము ఫర్నిచర్, ఇంటీరియర్, మెటీరియల్స్ కోసం ఏ షాపుకు ముందు వెళ్లినా అది మాకు సెట్ కాలేదు కానీ, రెండోసారి వేరే చోటికి వెళ్లినప్పుడు మాత్రం అన్నీ మా బడ్జెట్‌లో, మాకు అనుకూలంగా జరిగాయి. నాకు అది బాబా చేసిన ఏర్పాటు అనిపించింది. ఇంటీరియర్ పనిచేసే వ్యక్తి మా అమ్మాయి స్నేహితుడు కావడంతో, అతను మా బడ్జెట్‌ను అర్థం చేసుకుని బడ్జెట్ లోపలే ఇల్లంతా చాలా చక్కగా ఇంటీరియర్ చేసి ఇచ్చాడు. ఇకపోతే, పెయింటింగ్ జరుగుతున్నప్పుడు గోడలు బాగా ఆరడానికి ఒకరోజు ఎండ ఉండాలని, వర్షం వస్తే పెయింటింగ్‌కు ఇబ్బంది అవుతుందని అన్నారు. అప్పుడు నేను, “బాబా! మేము అనుకున్న పనులు మీ దయతో సక్రమంగా జరుగుతున్నాయి. ఈ పెయింటింగ్ పని కూడా వర్షం రాకుండా ఎండ ఉండేలా చేసి మంచిగా పూర్తయ్యేలా అనుగ్రహించండి ప్లీజ్” అని మనసారా బాబాని ప్రార్థించి దణ్ణం పట్టుకున్నాను. నేను కోరుకున్నట్టే ఆరోజు ఎండ ఎక్కి పెయింటింగ్ అంతా బాగా ఆరిపోయింది. మరుసటిరోజు పెయింటింగ్ పని కూడా చక్కగా పూర్తైంది. ఆశ్చర్యం ఏమిటంటే, పెయింటింగ్ పూర్తయిన మరుసటి రోజు వర్షం పడింది. ఇది బాబా నాకు చేసిన చిన్న సహాయం మాత్రమే కాదు, నిజంగా ఒక మిరాకిల్ అనిపించింది. అలా బాబా దయతో ఇంటీరియర్, కరెంట్ పని, పెయింటింగ్ అన్నీ చాలా నీట్‌గా మా బడ్జెట్‌లోనే మంచిగా జరిగాయి. "మా ఇంటి పనులన్నీ చక్కగా జరగడానికి సహాయం చేసినందుకు థాంక్యూ బాబా. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే కాపాడుతూ, దారి చూపిస్తూ ఉండండి బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo