- సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా బాబాను నమ్మి ప్రార్థిస్తే, మనసుకు ప్రశాంతత లభిస్తుంది
నా పేరు మహేష్. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. నేను రాత్రిపూట షిఫ్ట్‌లో పని చేస్తాను. నా షిఫ్ట్ ప్రతిరోజూ రాత్రి 2:30కి ముగుస్తుంది. ఇంటికి వచ్చి పడుకునేసరికి 3:30 అవుతుంది. మళ్ళీ ఉదయం 8 లేదా 9 గంటలకి నిద్ర లేస్తే, శరీరానికి సరైన విశ్రాంతి లభించక రోజంతా అలసటగా అనిపిస్తుండేది. అందుకని నేను బాబాని, "నాకు ఉదయం 10 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర కావాల"ని కోరుకొని ఆయనపై పూర్తి నమ్మకముంచి ప్రతిరోజూ నిద్రపోయేముందు బాబాను స్మరించడం ప్రారంభించాను. బాబా కృపతో నెమ్మదిగా నా మనసు ప్రశాంతమై నాకిప్పుడు గాఢమైన నిద్రపడుతుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల వరకు సుఖంగా నిద్రపోగలుగుతున్నాను. మునుపటిలా ఇప్పుడు అలసట ఉండట్లేదు. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. నా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బాబాపై నాకు భక్తి మరింత పెరిగింది. ప్రతిరోజూ బాబాను స్మరించడం నాకు అలవాటుగా మారింది. ఆయన ఆశీర్వాదంతో నా జీవితం సుఖంగా సాగుతోంది. నా జీవితంలో వచ్చిన ఈ మంచి మార్పుకు ఆయనకి కృతజ్ఞతలు, హృదయపూర్వక నమస్కారాలు.
ఒకసారి నా ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమస్యతో నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఎంత ప్రయత్నించినా అది సరిగ్గా ఛార్జ్ అయ్యేది కాదు. దాంతో నా పనులు ఆగిపోవడంతో నేను పిర్యాదు చేశాను. కానీ రెండు రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. నాకు టెన్షన్ ఎక్కువై, “బాబా! ఈ సమస్యను మీరు తప్ప మరెవ్వరూ సరిచేయలేరు” అని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. కొంతసేపటి తర్వాత మళ్లీ ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేసి చూసాను. ఆశ్చర్యంగా, అది మామూలుగా ఛార్జ్ అవ్వడం ప్రారంభించింది. ఆ క్షణంలో నాకు బాబా ఉన్నారనే నమ్మకం మరింత పెరిగింది. ఆయన కృపతో నా సమస్య సులభంగా పరిష్కారమైంది. ఆయన దయ ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నాను.
ఒకరోజు నేను ఆఫీస్‌లో నా మొబైల్ చార్జింగ్ కేబుల్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మొదట అది పెద్ద విషయం అనిపించలేదు కానీ, అవసరం వచ్చినప్పుడు అది దొరకకపోయేసరికి కొంచెం ఆందోళన, అసౌకర్యం కలిగాయి. ఎంత ఆలోచించినా ఎక్కడ పెట్టానో గుర్తు రాలేదు. అప్పుడు మనసులో బాబాని గుర్తు చేసుకొని, “బాబా! ఇది చిన్న విషయమై అయినా నాకు ఇప్పుడు దాని అవసరం చాలా వుంది. దయచేసి అది దొరకేలా చేయండి” అని ప్రార్థించాను. కొంతసేపటి తర్వాత ఆ కేబుల్ ఆఫీస్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. చివరకు అది నాకు తిరిగి దొరికింది. మన జీవితంలో కొన్ని సంఘటనలు సాధారణంగా అనిపించినా లోతుగా గమనిస్తే, దైవ కృపలా అనిపిస్తాయి.
జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒక సాధారణ ఫోన్ కాల్ కూడా చాలా భారంగా అనిపిస్తుంది. ఒకరోజు నేను నా కొడుకుకి ఫోన్ చేస్తే, తను ఎత్తలేదు. మూడు, నాలుగు సార్లు చేసినా తన నుండి ఎలాంటి స్పందన లేకపోయింది. ఒక్కొక్క కాల్కి నా మనసులో ఆందోళన పెరిగి, 'తను బాగానే ఉన్నాడా? నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? నేను ఏదైనా తప్పు చేశానా?' అని ఆలోచనలు మొదలయ్యాయి. అంతకంటే ఎక్కువ ఆలోచించకుండా నేను కళ్ళు మూసుకుని మౌనంగా, “బాబా! దయచేసి నన్ను నా కొడుకుతో మాట్లాడేలా చేయండి” అని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే ఏం జరగకపోయినప్పటికీ నా మనసులో కొంత శాంతి చోటు చేసుకుంది. కొంతసేపటి తర్వాత తను నా కాల్ లిఫ్ట్ చేశాడు. ఆ క్షణం నాకు చాలా ఆనందం కలిగింది. అది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు – బాబా ఆశీర్వాదం అనిపించింది. ఈ అనుభవం సహనం అవసరమని, సరైన సమయంలో అన్నీ జరుగుతాయని తెలియజేసింది.
ఒకరోజు బస్సు ప్రయాణంలో అకస్మాత్తుగా యూరిన్ సమస్యతో నాకు చాలా ఇబ్బంది కలిగింది. బస్సు ఎక్కడ ఆపుతారో, అప్పటివరకు ఎలా మేనేజ్ చేయాలో అర్థంకాక మనసులో భయం, ఆందోళన కలిగి మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యంగా కొద్దిసేపట్లోనే బస్సు ఆగింది. నాకు చాలా ఉపశమనం కలిగింది. ఆ క్షణంలో బాబా నా పక్కనే ఉన్నట్టు అనిపించింది. బాబా కృప ఎంత అద్భుతంగా ఉంటుందో అనుభూతి చెందాను. ఈ అనుభవాల ద్వారా మన సమస్య చిన్నదైనా, పెద్దదైనా భక్తితో పిలిస్తే బాబా తప్పకుండా దారి చూపిస్తారు.

Om Sai Ram 🙏🙏🙏❤️❤️❤️
ReplyDeleteOm sai ram tandri anni vidaala manashanti ni echi anta manchiga korukunnattu jarige la chudandi tandri pls, amma nannalani andarni anni velala kshamam ga ayur arogyalatho kapadandi tandri pls.
ReplyDeleteOm sai ram baba naku arogyam bagundela chudu baba vertigo thaginchu baba pls 🙏🙏🙏
ReplyDeleteOm sri sai aarogya kshemadaya namaha
ReplyDeleteom sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete