1. పిలవగానే సహాయం చేస్తారు బాబా
2. బాబా కరుణ ఎంతో గొప్పది
బాబా కరుణ ఎంతో గొప్పది
నా పేరు మహేశ్వర. నేను చాలా సంవత్సరాలుగా కాళ్లనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి కారణంగా నేను నా దైనందిన జీవితంలో పనులు సరిగా చేయలేకపోతుండేవాడిని. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప పూర్తి ఉపశనం రాలేదు. ఇంకా అప్పుడు నేను శ్రీ శిరిడీ సాయిబాబాని ఆశ్రయించి ప్రతిరోజు సాయి నామస్మరణ చేయనారంభించి నా బాధను వారి పాదాల వద్ద సమర్పించాను. కొద్దిరోజుల్లో నొప్పి క్రమంగా తగ్గడం ప్రారంభమై పూర్తిగా తగ్గిపోయింది. మొదటిసారి ఆ నొప్పి నుండి నాకు లభించిన అద్భుతమైన ఉపశమనం అది. బాబా కృపతో నేను మళ్లీ సాధారణ జీవితం గడపగలిగాను. అయితే కొన్ని నెలల తరువాత ఆ నొప్పి మళ్ళీ వచ్చింది. ఈసారి నేను భయపడకుండా బాబాను ప్రార్థించి, ఆయన ఊదీ విశ్వాసంతో ధరించాను. ఆశ్చర్యంగా రెండోసారి కూడా నొప్పి నెమ్మదిగా తగ్గుతూ పూర్తిగా ఉపశమనం లభించింది. ఈ రెండు సందర్భాల్లోనూ నేను బాబా దయను స్పష్టంగా అనుభవించాను. నా విశ్వాసం మరింత బలపడింది. కష్టకాలంలో సాయిబాబా నామస్మరణే నాకు బలంగా నిలిచింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఈ అనుభవం ద్వారా బాబా ఎల్లప్పుడూ తన భక్తులను కాపాడుతారని గట్టి నమ్మకాన్నిచ్చింది.
2026, మార్చి 7, ఉదయం నేను నా కళ్లజోడు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇంట్లో టేబుల్ మీద, బ్యాగులో, గదిలో అన్ని చోట్లా ఎంత వెతికినా అది కనిపించలేదు. కళ్లజోడు లేకుండా నాకు ఏ పని సరిగ్గా నడవదు, చాలా కష్టం. అందుకని కొంచెం ఆందోళనగా అనిపించింది. అప్పుడు మనసులో, "బాబా! నా కళ్లజోడు ఎక్కడ ఉందో చూపించండి. మీ కృపతో అది దొరకాలి" అని బాబాను ప్రార్థించాను. కొద్దిసేపటి తర్వాత మరోసారి వెతకాలనిపించి వెతికితే, ఆశ్చర్యం! నేను అంతకుముందు చూసిన చోటే కళ్లజోడు కనిపించింది. ఆ క్షణం నా మనసు చాలా ఆనందంతో నిండిపోయింది. వెంటనే “ధన్యవాదాలు బాబా” అని కృతజ్ఞతతో నమస్కరించాను.
2026, మార్చి 30, ఉదయం నుంచి నా కడుపులో చాలా నొప్పి మొదలైంది. అది సాధారణంగా వచ్చే నొప్పి కాదనిపించింది. నేను పని మీద దృష్టి పెట్టలేకపోయాను, చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆ సమయంలో నాకు బాబా గుర్తొచ్చి మనస్ఫూర్తిగా, "బాబా! త్వరగా ఈ నొప్పిని తగ్గించండి. నేను మీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను" అని ప్రార్థించి కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని బాబాను ధ్యానించాను. అద్భుతం! కేవలం 10 నిమిషాల్లో నొప్పి తగ్గడం ప్రారంభమై కొద్దిసేపటికి పూర్తిగా మాయం అయింది. ఇది సాధారణ విషయం కాదని నాకు స్పష్టంగా అనిపించింది. బాబా కరుణ వల్లే ఇలా జరిగిందని నా హృదయం చెబుతోంది. మనం నిజమైన భక్తితో, నమ్మకంతో ప్రార్థిస్తే బాబా ఎప్పుడూ మనకు సహాయం చేస్తారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు, మన సమస్యలను పరిష్కరిస్తారు. ఈ అనుభవాల ద్వారా సమస్యలు ఎంత చిన్నవైనా బాబాకు చెప్పాలని, ఆయన ఆశీస్సులు లేకుండా ఏదీ జరగదనిపించింది. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".

Om Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteOm Sai ram please bless me in the problem in sleeping. Please Baba cure this problem. I am suffering very much
ReplyDeleteOm sai ram tandri anni velala andarni kshamam ga arogyam ga chusukondi tandri, anta bagunde la chusukondi anta meede badyata.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete