ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా ఎప్పుడూ మనతో ఉన్నారు - సరైన సమయంలో సహాయం చేస్తారు!
2. శ్రీసాయి కృప
బాబా ఎప్పుడూ మనతో ఉన్నారు - సరైన సమయంలో సహాయం చేస్తారు!
సాయిబంధువులకు నమస్కారం. నేనొక సాయి భక్తుడిని. కొంతకాలం నేను ఆస్తి సంబంధిత సమస్యలో ఇరుక్కుపోయి చాలా సతమతమయ్యాను. ఆ కారణంగా నేను మానసికంగా చాలా బాధను అనుభవించాను. రోజంతా ఆ సమస్య గురించే ఆలోచిస్తూ చాలా ఆందోళన పడుతుండేవాడిని. చాలా అసహాయంగా అనిపించేది. ఏం చేయాలో అర్థంకాక భయం, నిరాశ పెరిగిపోయాయి. మొదట్లో, “ఈ సమస్య నుంచి నేను ఎప్పుడు బయటపడతాను?” అని బాబాను తరచూ అడుగుతుండేవాడిని. కానీ క్రమంగా నాకు ఒక విషయం అర్థమైంది— 'బాబా సర్వమూ తెలిసినవారు(సర్వజ్ఞుడు). ఆయన సరైన సమయంలో దయ చూపుతారు. మనం సహనంతో ఎదురుచూడాలి' అని. ఇంకా అప్పుడు “బాబా! ఈ సమస్య నుంచి నన్ను బయటపడేలా చేయండి” అని వేడుకొని పూర్తిగా ఆయనకు శరణాగతి చెంది, ప్రతిరోజూ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తూ(సాయి సచ్చరిత్ర ఒక పవిత్రమైన గురుచరిత్ర. దీనిని చదవడం ద్వారా మనలో మార్పు వస్తుంది. సహనం, భక్తి వృద్ధి చెందుతాయి), 'శ్రద్ధ-సబూరి' అనే వారి బోధను గుర్తు చేసుకుంటూ సహనంతో ఎదురుచూశాను. మధ్యలో ఒకసారి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాను, కానీ పరిస్థితులు సహకరించలేదు. అప్పుడు “ఇంకా కొంతకాలం వేచి చూడాలి” అనిపించింది. సమస్యను పూర్తిగా బాబా చేతుల్లో ఉంచి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశాను. బాబా దయవల్ల కొంతకాలం తర్వాత అనుకోకుండా పరిస్థితులు మారి ఒక్కొక్కటిగా సమస్యకు పరిష్కారం కనిపించసాగింది. చివరకు బాబా కృపతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైంది. ఆ క్షణంలో నాకు ఎంతో ఆనందం, శాంతి కలిగాయి. బాబా ఎప్పుడూ మనతోనే ఉన్నారని, సరైన సమయంలో మనకు సహాయం చేస్తారని నాకు గట్టి నమ్మకం వచ్చింది. బాబా మనకు ఇచ్చే ప్రతి అనుభవం వెనుక ఒక పాఠం ఉంటుంది. ఈ అనుభవం ద్వారా నేను నేర్చుకున్నది— 'మనము ఎంత కష్టంలో ఉన్నా భయపడకుండా బాబాపై నమ్మకం ఉంచాలి. ఆయన సమయం సరైనది, ఆయన నిర్ణయం ఉత్తమమైనది'. "ధన్యవాదాలు బాబా. దయచేసి ఇలాగే నన్ను నడిపిస్తూ, నాకు, నా కుటుంబానికి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి".
శ్రీసాయి కృప
నా పేరు జగదీశ్వర్. మా చిన్నమ్మాయికి 2026, ఏప్రిల్ 2న పెళ్లి నిశ్చయమైనది. మొదట నాకు ఆ సంబంధం విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండటం వల్ల నేను ఒప్పుకోలేదు. కానీ మా అమ్మాయి అతనితోనే తన పెళ్లి జరగాలని పట్టుబట్టింది. నాకు ఏం చేయలో అర్థం కాలేదు. కొన్నిరోజులు తర్వాత ఒకరోజు రాత్రి నేను పడుకున్నాకనో, మేలుకొని ఉన్నానో తెలియదు కానీ, నాకు తెలుస్తుంది. నేను చాలా బాధతో, "బాబా! ఏమిటి ఇలా అవుతుంది?" అని అన్నాను. అప్పుడు బాబా, "అంత మంచి జరుగుతుంది. ఇది నా నిర్ణయమే" అన్నారు. నేను, "బాబా! మీరు అలానే అంటారు. నాకు ఏదైనా నిదర్శనం చూపించండి" అని అడిగాను. వెంటనే బాబా, "సరే, పొద్దున్న నీకు గ్రీన్ కలర్ డ్రెస్లో దర్శనమిస్తాను" అని అన్నారు. నేను, "గ్రీన్ కలరా?" అని అడిగితే, "అవును" అని అన్నారు బాబా. మర్నాడు ఉదయం యధాలాపంగా వాట్సాప్ చూస్తుంటే, 'శిరిడీ సాయి లైవ్ దర్శన్' గ్రూపులో బాబా ఉదయం గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. ఇది నిజమా అన్న గందరగోళంలో ఉండిపోయాను. తర్వాత నేను బాబాకు మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకొని, "బాబా! మంచి-చెడు మీకు తెలుసు కదా. మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే జరపండి" అని వేడుకున్నాను. తర్వాత ఫిబ్రవరి 20న అమ్మాయి నిశ్చితార్థం ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. "బాబా! అమ్మాయి పెళ్లి ఏప్రిల్ 2న. మీ ఆశీస్సులు ఇవ్వండి. అలాగే మా అబ్బాయి నిశ్చితార్థం మార్చి 21న, పెళ్లి ఏప్రిల్ 29న, రిసెప్షన్ మే 3న ఏలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చేసి మీ ఆశీస్సులు ఇవ్వండి".
ఇకపోతే, రెండు పెళ్లిళ్ల నిమిత్తం మా పెద్దమ్మాయి, మనుమరాలు పోలాండ్ నుండి వచ్చారు. 2026, మార్చి నెల మొదటివారంలో మా మనుమరాలు ఆడుకుంటుంటే డోర్ కర్టెన్ తట్టుకొని బొక్కబోర్ల పడింది. నేను తనని లేపి చూస్తే, తన నోరు అంతా రక్తం కనిపించింది. నాకు చాలా భయమేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాబా ఊదీ తెచ్చి పాప నుదుటన పెట్టి, కొంచం నోట్లో వేసాను. కొద్దిసేపటి తరువాత నోరు అంత కడిగి చూస్తే, కొద్దిగా చిగురుకి దెబ్బ తగిలింది తప్ప ఇంకేమీ లేదు. నొప్పి కూడా ఏం లేదు. "ధన్యవాదాలు బాబా".
మా చిన్నమ్మాయి పెళ్లి సందర్బంగా, హైదరాబాద్లో ఉన్న అబ్బాయి వాళ్ళకి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి 2026, ఏప్రిల్ 13, శుక్రవారం తెల్లవారుజామున లేచి తయారవవుతుంటే, హఠాత్తుగా నా భార్యకు 3 సార్లు వాంతులు, నీళ్ల విరోచనాలు అయ్యాయి. ఏం చేయాలో తోచక ఒక సెస్టిల్ టాబ్లెట్ వేసి పూజ గదిలోకి వెళ్లి బాబా ఊదీ తీసుకొచ్చి నా భార్య నుదుటన పెట్టి, మరి కొంచెం ఊదీ తన నోటిలో వేసాను. విచిత్రంగా మంత్రం వేసినట్టు వాంతులు, విరోచనాలు ఆగిపోయాయాయి. మర్నాడు వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి వచ్చాము.
బాబా సాయి చరణం సర్వదా శరణం శరణం.
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram
ReplyDeleteOm Sai ram be with us and bless us.. Om Sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOmsairam
ReplyDeleteJaisairam bless amma for her health and bless supraja for her neck pain and shoulder pain and help her to get normal Jaisairam she is suffering with disk bulges and bless her to get normal Jaisairam she is suffering with nerve pain and help her to get normal Jaisairam she is suffering with kidney disease and help her to get normal Jaisairam. Bless me and be there always with me and bless me and my wife do our jobs for another 15 yrs Jaisairam
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sai ram, andarni anni velala kshamam ga chusukondi, anni situations anugunam ga maare la chusukondi baba, anta me daaya, meeru leni Memu lemu tandri anduke prathidi meede badyata.
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete