ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా లీలలు అర్థం కావు!
2. మధుర జ్ఞాపకాలు కోల్పోకుండా కాపాడిన బాబా
బాబా లీలలు అర్థం కావు!
నా పేరు జగదీశ్వర్. మా చిన్నమ్మాయికి 2026, ఏప్రిల్ 2న పెళ్లి నిశ్చయమైంది. మొదట నాకు ఆ సంబంధం విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండటం వల్ల నేను ఒప్పుకోలేదు. కానీ మా అమ్మాయి అతనితోనే తన పెళ్లి జరగాలని పట్టుబట్టింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి నేను పడుకున్నానో, మేలుకొని ఉన్నానో తెలియదు కానీ, నాకు స్పష్టంగా తెలుస్తుంది ఏమిటంటే, నేను చాలా బాధతో, "బాబా! ఏమిటి ఇలా అవుతుంది?" అని అన్నాను. అప్పుడు బాబా, "అంత మంచి జరుగుతుంది. ఇది నా నిర్ణయమే!" అన్నారు. నేను, "బాబా! మీరు అలానే అంటారు. నాకు ఏదైనా నిదర్శనం చూపించండి" అని అడిగాను. వెంటనే బాబా, "సరే పొద్దున్న నీకు గ్రీన్ కలర్ డ్రెస్‌లో దర్శనమిస్తాను" అని అన్నారు. నేను, "గ్రీన్ కలరా?" అని అడిగితే, "అవును" అని అన్నారు బాబా. మర్నాడు ఉదయం యధాలాపంగా నేను వాట్సాప్ చూస్తుంటే, 'శిరిడీ సాయి లైవ్ దర్శన్' గ్రూపులో బాబా ఉదయం గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఉన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఇది నిజమా అన్న గందరగోళంలో ఉండిపోయాను. తర్వాత నేను బాబాకు మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకొని, "బాబా! మంచి-చెడు మీకు తెలుసు కదా. మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే జరపండి" అని వేడుకున్నాను.
తర్వాత బంగారం ధర పెరుగుతుండటంతో తొందరగా హైదరాబాద్ వెళ్లి పెళ్ళికి కావలసిన బంగారం కొందామనుకొని 2026, ఫిబ్రవరి 5, గురువారం ఉదయం 7 గంటలకి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. అంతలో డ్రైవర్ కాల్ చేసి, "నాకు విరోచనాలవుతున్నాయి, నేను రాలేను" అని అన్నాడు. వేరే డ్రైవర్ కూడా కుదరలేదు. దాంతో ఆరోజు వెళ్లడం మానుకున్నాం. బాబా ఎందుకు గురువారం నాడు వెళ్లకుండా ఆపారో నాకు అర్థం కాలేదు. సరే మరుసటిరోజు శుక్రవారం వెళ్ళాము. ఆభరణాలన్నీ ఎంపిక చేసుకొని తుది నిర్ణయమయ్యేసరికి ఆరోజు బంగారం ధర రెండుసార్లు తగ్గి గ్రాముకు 9,500/- తగ్గింది. అప్పుడు ముందురోజు బాబా ఎందుకు వెళ్లనీయలేదో నాకు అర్థమైంది. ఏమైనా బాబా లీలలు మనకు అర్థం కావు. ఆయన దయవల్ల ఫిబ్రవరి 20న మా అమ్మాయి నిశ్చితార్థం ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. "ధన్యవాదాలు బాబా! అమ్మాయి పెళ్లి ఏప్రిల్ 2న. అలాగే మా అబ్బాయి నిశ్చితార్థం మార్చి 21న, పెళ్లి ఏప్రిల్ 29న, రిసెప్షన్ మే 3న. ఆ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చేసి మీ ఆశీస్సులు ఇవ్వండి".
చివరిగా మరో చిన్న అనుభవం: పోలాండ్ దేశంలో వాతావరణం చాలా చల్లగా ఉండి రోజూ మంచు కురుస్తుండటంతో అక్కడున్న మా మనుమరాలికి జ్వరం వస్తే, ఇక్కడ నేను బాబా ఊదీ పెట్టుకోని, "మా మనుమరాలికి జ్వరం తగ్గించమ"ని వేడుకున్నాను. అంతే, బాబా దయవల్ల మా మనుమరాలికి జ్వరం తగ్గింది. ఇలా చాలాసార్లు జరిగింది. అందుకే బాబా చరణం, సర్వదా శరణం శరణం. సర్వ భారభృతే నమః.
మధుర జ్ఞాపకాలు కోల్పోకుండా కాపాడిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు శ్రీసాయి రవళి. నేను హైదరాబాద్ నివాసిని. నేను సాయి వరప్రసాదమని, సాయినాథునికి మొక్కుకోవడం వలన నేను పుట్టానని, పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టానని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది. అమ్మ వలనే నాకు సాయి అంటే ఇష్టం ఏర్పడింది. నాకు పెళ్లి అవ్వడం, బాబు పుట్టడం, మావారి ఉద్యోగరీత్యా మేము పలు ప్రదేశాలు(రాష్ట్రాలు) తిరగాల్సి వస్తుంటే అన్ని ప్రదేశాలు తిరగలేక వేడుకుంటే హైదరాబాదులో మమ్మల్ని స్థిరపరచడం, హైదరాబాద్ వచ్చాక పాప పుట్టడం ఇవన్నీ సాయి అనుగ్రహమే. ఇక నా అనుభవానికి వస్తే... మా పెళ్లి వీడియోలు, హనీమూన్‌కి వెళ్ళినప్పటి ఫోటోలు, మా బాబు చిన్ననాటి ఫోటోలు, మేము అనేక ప్రదేశాలలో తీసుకున్న అనేక వీడియోలు, ఫోటోలు, అనేక చోట్ల ఉన్న చాలామంది ఫ్రెండ్స్‌తో తీసుకున్న ఫోటోలు వంటి మధుర జ్ఞాపకాలన్నీ 2014లో నేను చదువుకునే(బీటెక్ కంప్యూటర్స్) రోజుల్లో కొన్న లాప్టాప్లో భద్రపరిచాను. వాటిని మా పాప పుట్టేదాకా అప్పుడప్పుడు లాప్టాప్ ఓపెన్ చేసి చూసుకునేదాన్ని. లాప్టాప్ బాగానే పనిచేస్తుంది కదా అని కొంచెం నిర్లక్ష్యం చేశాను. అంతే! హఠాత్తుగా ఒకరోజు లాప్టాప్ ఆన్ చేద్దామని చూస్తే, అసలు ఆన్ కాలేదు. నాకు చాలా టెన్షన్ అనిపించింది. చార్జింగ్ పెట్టి అనేక రకాలుగా ప్రయత్నించినా ఎంత మాత్రమూ లాప్టాప్ ఆన్ అవ్వలేదు. దాంతో నాకు చాలా బెంగ పట్టుకుంది. అప్పుడు మా అమ్మ సలహామేరకు "లాప్టాప్లో ఉన్న మెమరీ మొత్తం తిరిగి వచ్చేలా చేయమ"ని బాబాను వేడుకున్నాను. తర్వాత కూడా చాలాకాలం అవ్వడం వల్ల లాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ తుప్పుపట్టిందేమో, మెమరీ వస్తుందో రాదోనని మెమరీ గురించి చాలా దిగులు చెంది బాబాను పదేపదే ప్రార్థించాను. బాబా అద్భుతం చేశారు. మావారి ఫ్రెండ్ మా లాప్‌టాప్‌లోని ఇంటర్నల్ హార్డ్ డిస్క్ తీసి కనెక్టర్స్ ద్వారా వేరొక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోనికి మెమరీ అంతా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోనికి మార్చిన మెమొరీని మళ్లీ మావారి ల్యాప్‌టాప్‌లో చూసుకున్నాక నాకు చాలా సంతోషంగా అనిపించి సాయినాథునికి పదేపదే ప్రణామాలు అర్పించాను. పిలిచిన వెంటనే పలికి, సమస్యను సమూలంగా పరిష్కరించిన సాయినాథునికి అనేక కృతజ్ఞతలు, నమస్కారాలు చెబుతూ.. 'ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై'.

Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteOmsrisaianadhanadhadinabhandhavayanamah
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి బందువులందరి కి నమస్కారాలు, నేను ఒక చిన్న బాబా లీల పంచుకోవలను ఇక్కడ హడవిడి గా కమెంట్స్ లో పోస్ట్ చెస్తున్న, మా పాప నాలుగో తరగతి చదువుతుంది, తను ప్రతిసారి మ్యథ్(math monthly test) టెస్ట్ లో ఫస్ట్ రావలి అని అనుకుంటుంది, ఈ సారి తను ప్రాక్టిస్ చెసెప్పుడు బాబా ని అడిగాని, తను ఈ సారి టెస్ట్ లో క్లాస్స్ ఫస్ట్ వచింది, తనుకూడ ప్రతిదీ బాబా కి చెప్పుకుంటుంది, నాకు చాలా సంతొషం గా వుంది నా పాప బాబా రక్షణలో వుంది అని, దన్యవాదాలు బాబా నన్ను, నా కుటుంబన్ని రక్షిస్తున్నరు, మీ బిడ్డలందర్ని కాపడండి సాయి, అనంత కోటి దన్యవాదాలు బాబా.
ReplyDeleteOm sai ram tandri nannu ma kutumbanni anni velala air arogyalatho anni velala kshamam ga kapadandi tandri pls, anta meede badyata ofce lo anni situations bagunde la chayandi tandri pls, alage ne biddala andarni kshamam ga kapadandi tandri pls.
ReplyDeleteOm sai ram tandri nannu ma kutumbanni anni velala ayur arogyalatho anni velala kshamam ga kapadandi tandri pls, anta meede badyata ofce lo anni situations bagunde la chayandi tandri pls, alage ne biddala andarni kshamam ga kapadandi tandri pls.
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏