సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2064వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనస్ఫూర్తిగా కొలిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తారు బాబా
2. పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా
3. చావు అంచుల దాకా వెళ్లిన వ్యక్తిని కాపాడిన బాబా


పాపకి జ్వరం తగ్గేలా అనుగ్రహించిన బాబా

సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు మనోజ. నా జీవితంలో బాబా లీలలు ఇన్ని అని చెప్పలేను. ఎందుకంటే, నిత్యం నా వెన్నంటే ఉండి నన్ను ప్రతి విషయంలోనూ నడిపిస్తున్నారు బాబా. ఆయనకి శతకోటి నమస్కారాలు. 2026, జనవరిలో మా మూడు సంవత్సరాల పాపకి వైరల్ ఫీవర్ వచ్చింది. మందులు వాడినప్పటికీ ఆ మందుల ప్రభావం తగ్గగానే మళ్ళీ జ్వరం వస్తూ పాప బాగా ఇబ్బందిపడింది. తను చాలా నీరసించిపోయింది. నేను, మావారు పాపకి తగ్గిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. హాస్పిటల్‌కి తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదు. నాకు తెలిసిందల్లా బాబాకి చెప్పుకోవటం, ఆయన్ని వేడుకోవటం మాత్రమే. కాబట్టి ఆయన్నే ప్రార్థిస్తూ రోజూ ఊదీ పాపకి పెట్టి, కొద్దిగా ఊదీ నీటిలో కలిపి తాగిస్తుండేదాన్ని. అయితే ఐదు రోజులు దాటినా పాపకి తగ్గకపోయేసరికి ఇక అప్పుడు పాపని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ బాబా నాకెందుకు పరీక్ష పెడుతున్నారని బాధపడ్డాను. మరుసటిరోజు డాక్టర్ దగ్గరకి వెళ్తుంటే హాస్పిటల్ ఎదురుగా ఉన్న గోడ మీద బాబా ఫోటో కనపడింది. బాబాని చూసి నాకు చాలా ధైర్యంగా అనిపించింది. డాక్టరు దగ్గరకి వెళ్ళడానికి ముందు నర్సు టెంపరేచర్ చెక్ చేసి, "నార్మల్ ఉంది. జ్వరం లేదు" అని చెప్పింది. ఇంకా నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మావారు, "ఎలాగూ వచ్చాం కదా! మామూలుగా ఒకసారి చూపించినట్టు ఉంటుంది, డాక్టరుని కలుద్దాం" అన్నారు. బాబానే తిరిగి వెళ్లిపోవద్దని చెప్పినట్టు నాకు అనిపించింది. డాక్టర్ చూసి. "పాపకి సమస్యేమీ లేదు కానీ, మీరు ముందు వాడిన మందుల డోస్ సరిగ్గా వేయకపోవటం వల్ల జ్వరం తగ్గలేదు" అని వేరే మందులు ఇచ్చారు. అవి వేసాక పాపకి జ్వరం మళ్ళీ రావడం ఆగి తగ్గుముఖం పట్టింది. నిజంగా మేము డాక్టరుకి చూపించకుండా వెళ్ళిపోయి ఉంటే పాప ఇబ్బందిపడేది. అలా జరగకుండా బాబానే చూసారు. నేను చాలా  సంతోషపడి బాబాకి పరిపరి విధాల కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నమ్మిన వారి వెన్నంటే నిలిచి సదా కాపాడే సాయినాథుని చరణాలకు సాష్టాంగ ప్రణామాలు.


11 comments:

  1. Om sai ram, amma nannalani Ammamma tatayalani andarni anni velala kshamam ga kapadandi tandri pls, meede badyata, na samasya teerchandi tandri pls, meede baram badyata tandri e tension nunchi bayata padaindi tandri

    ReplyDelete
  2. Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram

    ReplyDelete
  3. https://youtu.be/-eFOss9lKbw?si=7H6lAwg6ఒహనోబెగ్డ్జ్
    సాయి పూలమ్మ గారి విశేషాలు

    ReplyDelete
  4. https://youtu.be/-eFOss9lKbw?si=7H6lAwg6ohNoBGDG

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om sri sairam 🙏🙏

    ReplyDelete
  8. Baba baba baba 🙏

    ReplyDelete
  9. Om Sri Sai Raksha 🙏🙏🙏
    Om Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo