ఈ భాగంలో అనుభవాలు:
1. అడిగితే ఇంతలా ఏర్పాటు చేస్తారా బాబా!
2. బాబా దయతో అడ్డుంకులు తొలగి ప్రాజెక్ట్ పూర్తి
అడిగితే ఇంతలా ఏర్పాటు చేస్తారా బాబా!
నేనొక సాయి భక్తురాలిని. నా చిన్నప్పుడు బాబా మందిరంలోని పూజారి మా అమ్మకి ఒక బాబా విగ్రహాన్ని ఇచ్చారు. అలా బాబా మా ఇంటికి వచ్చారు. నాకు చిన్నప్పటి నుండి బాబా అంటే చాలా ఇష్టం. నాకు సంబంధించిన ఆనందమైనా, బాధైనా ప్రతి విషయాన్నీ బాబాతో మాట్లాడుతున్నట్లు పెద్దగా చెప్పేసుకోవడం అలవాటు. మా నాన్న మా నుండి దూరంగా ఉంటారు. మా అమ్మ టైలరింగ్ చేస్తుంది. నాకు, మా తమ్ముడికి అన్నీ మా అమ్మే. నాకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే వాడు లేకుండా నాకు అసలు తోచదు. తనకి చిన్న వయస్సులోనే చెడు స్నేహాల వలన డ్రగ్స్, డ్రింకింగ్, డబ్బుల కోసం దొంగతనం చేయడం మొదలైన
చెడు అలవాట్లన్నీ అలవడ్డాయి(తనకి సంబంధించిన ప్రతిదీ బాబాతో పెద్దగా చెప్పుకుంటాను). తన వలన మేము చాలా ఇళ్ళులు మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు ఇళ్ళు మారినా, "బాబా మీకు దగ్గరగా నన్ను ఉంచండి" అని వేడుకుంటాను. అలానే బాబా ఇచ్చారు కూడా. ప్రస్తుతం మేము ఉంటున్న ఇంటికి కూడా బాబా మందిరం చాలా దగ్గరలో ఉంది. ఎంత దగ్గర అంటే బాబా ఆరతులు చక్కగా వినిపిస్తుంటాయి. అమ్మ పొద్దున్నే షాపుకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇంట్లో పనులన్నీ నేనే చేస్తూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా మధ్యాహ్న ఆరతి, శేజారతికి హాజరవుతుంటాను. రాత్రి శేజారతి ముందు నేనే బాబాకి డ్రెస్ మార్చి తెల్లని వస్త్రాలు వేస్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
మా తమ్ముడుకి అయ్యప్పస్వామి అంటే చాలా ఇష్టం. 2024లో తను అయ్యప్ప మాల ధరించాడు. కానీ దీక్షలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేసాడు. అందువల్ల మేము తన చేత మాల తీయించేసి స్వామికి క్షమాపణ చెప్పుకున్నాము. 2025లో తమ్ముడు మరల మాల వేసాడు. అప్పటినుండి నేను బాబాని, "తమ్ముడు ఏ తప్పులు చేయకుండా చూడండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగి శబరిమలకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే మా తమ్ముడి కారణంగా మాతో ఎవరూ సరిగా ఉండరు. అందువల్ల శబరిమల వెళ్ళడానికి తనకి తోడు ఎవరూ లేరు. అదికాక ఆర్థికంగా కూడా మాకు మద్దతు లేదు. అందుకని శబరిమలకు బదులు ద్వారపూడి వెళ్ళడానికి మేము నిశ్చయించాము. అక్కడికి వెళ్లే ముందురోజు నేను బాబా దగ్గరకు వెళ్లి మందిరంలో ఎవరూ లేనప్పుడు బాబాతో పెద్దగా, "రేపు ఇరుముడితో శబరిమల వెళ్ళడానికి తమ్ముడికి తోడు ఎవరూ లేరు బాబా. అందుకని ద్వారపూడి వెళ్తున్నాడు. వాడి తప్పులు క్షమించి మీ అనుగ్రహం ఎప్పుడూ మా తమ్ముడికి ఉండేలా దయ చూపండి, వాడు హ్యాపీగా ఉండేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. మరునాడు పొద్దున్నే అమ్మ, అమ్ముమ్మ, నేను అయ్యప్ప గుడికి వెళ్ళాము. తమ్ముడు ఇరుముడి వేయించుకునేటప్పుడు గురుస్వామి, "ఏ ట్రైన్‌కి వెళుతున్నారు?" అని అడిగారు. మేము విషయం చెప్పాము. అప్పుడు ఆయన మాతో చెప్పింది మీరు నమ్మలేరు. ఆయన, "ఒకతను ఈరోజు సాయంత్రం తన సొంత ఖర్చులతో 40 మందిని శబరిమల పంపుతున్నారు అమ్మా. ఆ 40 మందిలో ఒకరు రావడం లేదు. మీ తమ్ముడిని వారితో పంపుదాము, అంతా వారే చూసుకుంటారు. వనయాత్ర కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఏమీ ఆలోచించకుండా భయపడకుండా వారితో పంపండి" అని చెప్పారు. అది విన్నాక మా అందరి ఆనందం చెప్పలేము. 'బాబాని అడిగితే ఇంతలా ఏర్పాటు చేస్తారా!' అని మందిరానికి వెళ్లి బాబాని కౌగిలించుకొని ఏడుస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అసలు శబరిమల వెళ్లలేడనుకున్న మా తమ్ముడిని అన్నీ ఖర్చులు పెట్టుకొని వనయాత్ర చేయించి, స్వామి దర్శనం చేయించిన ఆ గొప్ప వ్యక్తికి కూడా ఎన్నో కృతజ్ఞతలు. "ధన్యవాదాలు బాబా. మా తప్పులు మన్నించి మీ అనుగ్రహశీస్సులు ఎప్పుడూ మాపై ఇలానే ఉండాలి. మా తమ్ముడు చెడు అలవాట్లన్నీ మానేసి మంచిగా ఉండేలా, నేను విదేశాలకు వెళ్లేలా అనుగ్రహించం డి తండ్రీ".
బాబా దయతో అడ్డుంకులు తొలగి ప్రాజెక్ట్ పూర్తి
అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తుడిని. నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగ విషయంలో బాబా మా కుటుంబాన్ని ఎంతగానో కరుణించారు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాను. 2024లో మా టీమ్‌కి ఒక డెవలప్మెంట్ వర్క్ వచ్చింది. వాళ్ళు ముందుగా కొంత సమయమిచ్చి, అంతా పరిశీలించి అంచనా చెప్పమన్నారు. మా టీమ్ పరిశీలించి ఒక మార్గం ఉందనుకున్నాక మేము ఆ ప్రాజెక్ట్ వర్క్‌కి ఆమోదం తెలిపాము. కానీ పని ప్రారంభించాక మధ్యలో టెక్నికల్ సమస్యలు రావడంతో ముందుకు వెళ్ళలేకపోయాము. మేము అనుకున్న రకంగా డెవలప్ చేయలేకపోయాము. మాపై అధికారులకు విషయం చెప్తే, చాలా పెద్ద చర్చ, సమస్య అవుతాయి. ఇలాంటి సమయంలో ఏమి చేయాలో అర్ధంకాక నేను, "బాబా! ఏదో ఒక రకంగా మాకు దారి చూపి మా డెవలప్మెంట్ పనులు ముందుకు సాగేలా కరుణించండి" అని బాబాను వేడుకున్నాను. అంతే, రెండు రోజుల్లో మా టీమ్ వాళ్ళు ఒక పరిష్కారం కనుక్కొని డెవలప్మెంట్ పని ముందుకు సాగించి అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసారు. ఇదంతా బాబా దయవల్లే జరిగిందని నా నమ్మకం. ఆయన దయవల్లే చర్చ జరగకుండా మేము ఒప్పుకున్న పని పూర్తి చేశాం. "చాలా ధన్యవాదాలు బాబా".

ఓం సాయిరామ్
ReplyDeleteఓమ్ శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDelete🕉️🌹🙏🙏🙏🌹🔯
Omsairam
ReplyDeleteOm sri sairam 🙏🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm Sree Satchithanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🙏🩷
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm Sri Sai Aarogyakshmedhaaya Namaha🙏🙏🙏