సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2061వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలు పరిష్కరించిన బాబా
2. అంతా మంచిగా చేసిన బాబా

సమస్యలు పరిష్కరించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. నా పేరు దేవి. మాది విశాఖపట్నం. బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసారు. ఎక్కడో గాలికి, ధూళికి ఎగిరిపోవాల్సిన మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచారు. బాబా దయతో మా బాబుకి ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత MS చదువుకోసం అమెరికా వెళ్లే అవకాశం నమ్మలేని రీతిన బాబా ఇచ్చారు. బాబు అక్కడ MS చేస్తుండగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకుని, కోర్టులో ప్రవేశపెట్టారు. బాబా దయవల్ల జడ్జి 2 నెలలు సమయమిచ్చి లైసెన్స్ కోర్టుకి చూపించమన్నారు. నేను, మా బాబు బాబాని "కష్టం గట్టెక్కించమ"ని వేడుకున్నాము. బాబా దయవల్ల నెల రోజుల్లో లైసెన్స్ వచ్చేయడం, కేసు కొట్టేయడం జరిగిపోయాయి. తర్వాత బాబా దయవలన బాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీవాళ్ళు బాబు ఫింగర్ ప్రింట్లు చెక్ చేసేటప్పుడు కేసు తాలూకా జడ్జిమెంట్ కాపీ అడిగారు. అప్పుడు అంత సమయం లేదు. అంత తొందరగా కోర్టువారు కాపీ ఇస్తారని మేము ఊహించలేదు. కానీ బాబా దయ. వెంటనే జడ్జిమెంట్ కాపీ మెయిల్ ద్వారా అందింది. నెలరోజులకి మరో సమస్య వచ్చింది. కోర్టు కేసు ఉన్న వాళ్ళందరూ, అది ఎటువంటి కేసు అయినా కూడా వారివారి దేశాలకి వెంటనే వెళ్లిపోవాలని అమెరికన్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. "ఇండియా వెళితే, వెంటనే ఉద్యోగం దొరుకుతుందా?" అని బాబాని పట్టుకుని ఏడ్చేసాను. ఆయన కనిపించినా, ఆయన గురించి వినిపించినా ఏడుస్తూనే ఉండేదాన్ని. "ఎలా వచ్చిన సమస్య అలానే గాలికి కొట్టుకుపోవాల"ని అడుగుతూనే ఉండేదాన్ని. బాబా దేశం కాని దేశంలో ఒక లాయర్ గురించి మాకు తెలిసేలా చేసి, కేసు ఫైల్ చేయించి సరిగ్గా నెల రోజుల్లో సమస్యను పరిష్కరించారు.

MS పూర్తి అయిన తర్వాత ప్రతి విద్యార్థికీ OPT కార్డు ఇస్తారు. ఆ కార్డు ఉంటే H1 వీసాతో సంబంధం లేకుండా 3 సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఆ డ్రైవింగ్ కేసు వల్ల ఆ కార్డు మా బాబుకి తిరస్కరించింది. ఇంకా నా దుఃఖానికి అవధులు లేవు. నేను ఎక్కడ, ఏ దేవుడు కనిపించినా ఏడుస్తూనే ఉండేదాన్ని. బాబా చేయి పట్టుకొని, ప్రవాహంలా ఏడుస్తూ "కష్టం గట్టెక్కించమ"ని అడుగుతూనే ఉండేదాన్ని. 2 నెలల్లో బాబా అద్భుతం చేసారు. చాలామందికి రాని OPT మా బాబుకి వచ్చింది. వాళ్ళకి కూడా రావాలని బాబాని అడుగుతున్నాను. నిజానికి అమెరికాలో ఉండాలన్నది నా కోరిక కాదు కానీ, జీవితంలో అన్నీ కోల్పోయాము. ఒకరిని నమ్మి ఇల్లు, కారు, బంగారం అన్నీ పోగొట్టుకున్నాము. నా పేదరికం బాబుకి రాకూడదని బాబాని అదే పనిగా అడిగాను. ఏదేమైనా బాబా తమ మహత్యం చూపించారు, బాబా నా సమస్య తీర్చారు. ఇదే కాదు, బాబా నా జీవితంలో జరగవు అనుకున్నవి, జరిగేలా చూసారు. బాబాని నమ్మండి, సహనంతో సహాయం కోసం అడగండి. ప్రేమతో అడిగితే తప్పకుండా ఆయన దిగి వస్తారు. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి బాబా.  ప్రతి చిన్న సమస్యను తీర్చి మా బాధని దూరం చేస్తూ మీపై ఇంకా ఇంకా నమ్మకం పెంచుతున్న మీకు శతకోటి నమస్కారాలు బాబా".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై


5 comments:

  1. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku 👍 vandanalu

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo