సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2043వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దృఢమైన నమ్మకం వల్ల పొందిన బాబా అనుగ్రహం
2. సొంతూరుకి ట్రాన్స్ఫర్ అనుగ్రహించిన బాబా
3. ఊదీయే పరమ ఔషధం


సొంతూరుకి ట్రాన్స్ఫర్ అనుగ్రహించిన బాబా

శ్రీసాయినాథుని పాదపద్మములకు శతకోటి నమస్కారాలు. నా పేరు ప్రభాకరరావు. మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి. నేను బాబాని నమ్ముకొని 29 సంవత్సరాలు పూర్తయింది. నాకు ప్రతిరోజూ అనకాపల్లిలో 1953లో నిర్మించిన బాబా గుడికి వెళ్ళి ఆయనను దర్శించుకొని రావడం అలవాటు. అయితే నాకు ప్రమోషన్ వచ్చి చింతపల్లికి బదిలి అయిన తరువాత బాబా గుడికి వెళ్లడం కుదరలేదు. నాకు చాలా బాధగా అనిపించి, "ఏంటి బాబా నాకు ఈ పరీక్ష? నీ దర్శనం చేసుకోకుండా నేనుండలేనని నీకు తెలుసు కదా!" అని ప్రతిరోజూ బాబాని అడుగుతూ ట్రాన్స్ఫర్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ, ట్రాన్స్ఫర్ అవ్వలేదు. చివరికి నేను, "బాబా! మీ మీదే భారమేసాను. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. నేను ప్రతిరోజూ మీ గుడికి వచ్చి మీ దర్శనం చేసుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. అంతే, బాబా నన్ను కరుణించి నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేయించారు. ఆయన మహిమ ఎంత చెప్పినా తక్కువే. పిలిస్తే పలికే దైవం సాయినాథుడు. నా చేయిపట్టి నన్ను నడిపించే దైవం నా సాయినాథుడు. నేను ఎన్ని జన్మలెత్తినా ఆయన ఋణం తీర్చుకోలేను. సదా ఆ సాయినాథుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. "బాబా! మీ ప్రేమ, కరుణాకటాక్షాలు నామీద, నా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మిమ్మల్ని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా. నా శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు చేస్తున్నాను తండ్రీ".

ఊదీయే పరమ ఔషధం

సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు కోమలవల్లి. 2025, జూన్ నెలలో నేను ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డాను. మావారికి చెపుదామంటే ఆయన రకరకాలుగా ఊహించుకొని అరుస్తూ ఉంటారు. డాక్టరు దగ్గరకు వెళదామంటే, నేను ఎప్పుడూ చూపించుకునే డాక్టరు సాయంత్రం మాత్రమే ఉంటారు. సాయంత్రం పూట వెళ్ళడానికి నాకు వీలు పడదు.  అందుకని నేను డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు. కానీ ఆ ఇన్ఫెక్షన్ బాధ భరించలేక చాలా బాధను అనుభవించాను. అప్పుడు బాబాను శరణువేడి, "బాబా! నేను డాక్టరు దగ్గరకి వెళ్ళలేను. అలాగని ఈ బాధ భరించలేకున్నాను. మీ ఊదీనే మందుగా భావిస్తున్నాను" అని చెప్పుకొని కొద్దిగా ఊదీ నా కడుపుకు పూసుకొని, మరికొంత ఊదీ నా నోట్లో వేసుకున్నాను. ఇలా ఒక 4, 5 రోజులు చేశాను. బాబా దయవల్ల క్రమేణా నా బాధ తగ్గింది. డాక్టరు దగ్గరకు వెళ్ళకుండనే పూర్తిగా నయమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

9 comments:

  1. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  3. Om sri sairam 🙏🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🙏🙏

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Omsairam🌹🙏🌹🙏🌹

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Baba.. piliste palike daivama.. na paristhithi antha niku telusu, na santhoshalu, swetcha tana pelli tho mudipadi unnayi.. nakennallu ee pareeksha.. na godu vinipistondi kada.. please tanaki twaraga pelli kudurinchi jaripinchu 🙏🥲 ma badhyatha neraverchukunela anugrahinchu.. saranu saranu saranu🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om Sai Ram I am suffering from my left eye problem . myself appalling udi to eye and praying to Baba.He will cure my eye problem.Today i spoke with out thinking some matter.Please bless me they don't blame me..Be with me and save me Baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo