ఈ భాగంలో అనుభవాలు:
1. బాబాకి చెప్పుకున్నాక ఆయన సమస్య తీర్చకుండా ఉంటారా!
2. ఆరోగ్య ప్రదాత సాయి
బాబాకి చెప్పుకున్నాక ఆయన సమస్య తీర్చకుండా ఉంటారా!
నా పేరు అనూష. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. 2025లో అప్రైసల్ మీటింగ్ జరగాల్సి ఉన్న సమయంలో ఒకరోజు నేను బయట ఉండగా ప్రతి సంవత్సరం అప్రైసల్ మీటింగ్ షెడ్యూల్ చేసే హెచ్ఆర్ నుండి కాకుండా వేరే హెచ్ఆర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సాధారణంగా హెచ్ఆర్లు ఉద్యోగస్తులకు ఎక్కువగా ఫోన్ కాల్స్ చేయరు. అలాంటిది హఠాత్తుగా హెచ్ఆర్ కాల్ వచ్చేసరికి నాకు ఏం అర్థం కాలేదు. ఏమైందో అని చాలా టెన్షన్‌గా అనిపించింది. తిరిగి హెచ్ఆర్కి కాల్ చేసేముందు, "బాబా! ఏ సమస్య లేకుండా అంత మంచిగా ఉండేలా చూడండి" అని బాబాను ప్రార్థించి కాల్ చేశాను. హెచ్ఆర్ కాల్ లిఫ్ట్ చేసి, "అప్రైసల్ మీటింగ్ షెడ్యూల్ చేద్దామని కాల్ చేసాను. ఇప్పుడు అందుబాటులో ఉన్నావా?" అని అడిగింది. "నేనిప్పుడు బయట ఉన్నాను. 10 నిమిషాల్లో ఇంటికి వెళ్లి కాల్ చేస్తాను" అని నేను చెప్పాను. దానికి తను 'సరే' అనింది. నేను బాబాతో, "ఏ సమస్య లేకుండా చూడమ"ని చెప్పుకొని కాసేపట్లో మళ్ళీ కాల్ చేశాను. బాబా దయవల్ల అంతా సానుకూలంగా జరిగింది. ఇది చాలా చిన్న అనుభవం అయుండొచ్చు కానీ, ఆ సమయంలో నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. నా బాబానే ఆ టెన్షన్‌ని సంతోషంగా మార్చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఇకపోతే, నాతోపాటు ఆ కంపెనీలో చేరిన నా ఫ్రెండ్ ఒకతనికి కూడా అదే సమయంలో అప్రైసల్ మీటింగ్ ఉండింది. మీటింగులో గత సంవత్సర కాలంలో మా నైపుణ్యం ఆధారంగా రివ్యూ ఇస్తారు. కానీ అతను పని చేసిన ప్రాజెక్టులో గత కొన్ని నెలలుగా ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నాయి. చాలాసార్లు ఎస్కలేషన్స్ కూడా అయ్యాయి. అందుచేత అతను అప్రైసల్ మీటింగ్ ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడ్డారు. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాకు టెన్షన్‌గా ఉన్నా, భయంగా ఉన్నా గుర్తు వచ్చేది నా బాబానే. వెంటనే, "బాబా! ఏ సమస్య లేకుండా, ఎటువంటి ప్రతికూల ఫీడ్‌బ్యాక్ లేకుండా నా ఫ్రెండ్ అప్రైసల్ మీటింగ్ మంచిగా అయ్యేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. బాబాకి చెప్పుకున్నాక ఆయన సమస్య తీర్చకుండా ఉంటారా చెప్పండి? నా ఫ్రెండ్ గురించి అప్రైసల్ మీటింగ్‌లో అతని టీమ్ లీడ్ మరీ ప్రతికూలంగా ఏం చెప్పకుండా కాస్త సానుకూలంగా, మధ్యస్థంగా, శాంతియుతంగా అభిప్రాయం వెల్లడించారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలా అన్నీ విషయాల్లో మీరు మాకు తోడుండి ముందుకు నడిపిస్తున్నారు. ఇక ముందు కూడా అలాగే కాపాడండి తండ్రి. ఆఫీసులో నన్ను, మా టీమ్ మెంబర్స్‌ని ప్రాజెక్ట్స్ మార్చుకోకుండా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్‌లోనే ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం ఇవ్వండి తండ్రి ప్లీజ్.
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్పా మీ భక్తులుగా ఉండలేము. తిక్షణం మీరు నా వెనుక ఉన్నారు కాబట్టే నా జీవితంలో నేను ఈ మాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాను. నా మనశాంతికి, నా జీవితంలో ఉన్న అన్నీ సంతోషాలకి మీరే కారణం తండ్రీ. ఇలాగే అమ్మానాన్నలని, నా కుటుంబాన్ని, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కర్ని కాపాడమని కోరుతున్నాను తండ్రి. మీరు నా జీవితంలో చేసిన, చేయబోయే ప్రతి మంచికి ధన్యవాదాలు బాబా".
ఆరోగ్య ప్రదాత సాయి
నా పేరు సౌదామిని. నాకు 25 సంవత్సరాలుగా బాబాతో అనుబంధం ఉంది. 2021లో నాకు కరోనా వచ్చిన దగ్గరనుండి నేను ఏదో ఒక అనారోగ్యంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. సరిగా అదే సంవత్సరం నాకు ఈ బ్లాగు పరిచయమైంది. అప్పటినుండి నాకు ఏ సమస్య వచ్చినా నా బాధలన్నీ బాబాకు చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే ఆరోగ్య పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉన్నాను. ఆ తండ్రి దయవల్ల నాకు ఏ ప్రమాదం జరగకుండా తిరిగి సాధారణ స్థితికి వచ్చి నా పనులు చేసుకుంటూ ఉండగా 2024 సంవత్సరాంతంలో ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళితే, బీపీ చాలా ఎక్కువగా ఉందని మళ్ళీ అన్ని టెస్టులు చేయించమన్నారు. మరుసటిరోజు "ఈసారి కూడా నాకు ఏ ఆరోగ్య సమస్య లేకుండా చూడండి" అని బాబాని ప్రార్థించి అన్ని టెస్టులు చేయించుకున్నాను. రిపోర్టులు చూసి డాక్టర్, "అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కానీ బీపీ కొంచెం ఎక్కువగా ఉంద"ని చికిత్స ప్రారంభించారు. బాబా దయతో బీపీ నార్మల్‌గా వచ్చేలా చేసి నాకు ఏ సమస్య లేకుండా అనుగ్రహించారు. "ధన్యవాదాలు సాయినాథా".
2025, మే నెలలో కోవిడ్-19 మరలా వస్తుందని వార్తలు వచ్చిన సమయంలో ఒకరోజు మధ్యాహ్నం నాకు ఉన్నట్టుండి 101 డిగ్రీల జ్వరం వచ్చింది. ఒళ్లునొప్పులు, కీళ్ళనొప్పుల, ఒళ్ళంతా వేడివల్ల ఆవిర్లతో మంచం మీద నుండి లేవలేకపోయాను. నాకు భయమేసి బాబాకి చెప్పుకొని మందులతోపాటు ఊదీ పెట్టుకొని, ఊదీ నీళ్ళు తీసుకుంటూ ఒకరోజు గడిపాను. రెండు రోజుల తర్వాత గొంతునొప్పి, శ్వాస ఆడక జ్వరం ఒళ్ళునొప్పులతో నరకం అనుభవించాను. అప్పుడు, "బాబా! దయచేసి నాపై దయ చూపండి" అని ఆర్తిగా చెప్పుకొని సాయిచరిత్ర తల కింద పెట్టుకొని పడుకున్నాను. మందులు వేసుకుంటూ బాబా మీద నమ్మకముంచి నా పనులు నేను చేసుకుంటుండగా రెండు రోజులకి జ్వరం, నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. "నా యందు మీ చల్లని చూపు ఎల్లవేళలా ఈ విధంగానే ఉండాలి సాయిదేవా".
Om Sai Ram my son 's family.is going to u.s.bless them safe take off and safe landing .I am worried about this matter.please help me in this matter.please give peace and Remove fear in me.Be with us and bless us.Do this favour to me
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me