ఈ భాగంలో అనుభవాలు:
1. అడిగిన ప్రతిదీ ప్రసాదించే బాబా
2. బాబా చూపిన కరుణ
అడిగిన ప్రతిదీ ప్రసాదించే బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు చినవెంకటలక్ష్మి. మాది కాకినాడ. 2020లో
మా చిన్నన్నయ్యకి కరోనా వచ్చింది. వాళ్లకు కామన్ బాత్రూం కాకుండా వేరే బాత్రూం లేనందున ఇంట్లోనే వేరే గదిలో క్వారంటైన్ ఉండడానికి లేకపోయింది. అందుకని JNTU వాళ్ళు వాళ్ళ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ గదుల్లో ఉండవలసి వచ్చింది. మాకు చాలా భయమేసింది. ఆ సమయంలో మాకు తిండి సహించేది కాదు, నిద్రపట్టేది కాదు. నేను, " 'బాబా.. బాబా..' అన్నయ్యని కాపాడు. తనకి కరోనా తగ్గి ఇంటికి క్షేమంగా రావాలి" అని బాబాను దృఢంగా వేడుకుంటూ ఉండేదాన్ని. అయితే ఐదు రోజులకి మా పెద్దన్నయ్యకి జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయి. కరోనా టెస్ట్ చేయిస్తే తనకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తనని కూడా క్వారంటైన్‌కి వెళ్లాలన్నారు. ఇంట్లో చూస్తే.. మా వదిన, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వాళ్లని వదిలి వెళ్లడం అన్నయ్యకి చాలా కష్టమైనప్పటికీ వేరే దారి లేక, "భగవంతుడా! ఏమిటీ పరీక్ష?" అని చాలా బాధపడి చిన్నన్నయ్య ఇంటికి రాకముందే పెద్దన్నయ్యను కూడా అదే JNTU కాలేజీలో క్వారంటైన్‌కు పంపించాము. ఆ పరిస్థితి తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. ప్రతిరోజూ నాకు వాళ్ళిద్దరి గురించి బెంగగా ఉండేది. అనుక్షణం బాబాకి మొరపెట్టుకుంటుండేదాన్ని . బాబా దయవల్ల పెద్దన్నయ్య క్వారంటైన్‌కి వెళ్లిన రెండు రోజులకి అంటే 7రోజులు క్వారంటైన్లో ఉన్నాక చిన్నన్నయ్యకి కరోనా తగ్గడంతో ఇంటికి పంపించారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. పెద్దన్నయ్యను కూడా ఏడు రోజులు క్వారంటైన్లో ఉంచి ఇంటికి పంపించారు. బాబా దయవల్ల ఇద్దరికీ కరోనా పూర్తిగా తగ్గింది. బాబా నా మొర ఆలకించి వాళ్ళకి కరోనా తగ్గించి నా బాధను పోగొట్టారు. కానీ రెండు, మూడు రోజులకి ఒరిస్సాలో ఉంటున్న మా పెద్దబ్బాయికి కరోనా వచ్చింది. అది తెలిసి వాళ్ళింటి యజమాని ఇంటికి అస్సలు రావద్దన్నారు.
అబ్బాయి అక్కడ తన భార్య, మూడు సంవత్సరాల కొడుకుతో ఉంటున్నాడు. బంధువులు కూడా ఎవరూ లేరు. అందువల్ల మాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అబ్బాయి వెళ్లి తన ఆఫీస్ గెస్ట్‌హౌస్‌లోని ఒక గదిలో ఒంటరిగా ఉండిపోయాడు. తర్వాత వాళ్ళ ఇంటి ఓనర్ మా కోడలికి కరోనా టెస్ట్ చేయిస్తే, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇంటి ఓనర్ "తెల్లవారేసరికి మీరు ఇంట్లో ఉండకూడదు. ఎక్కడికి వెళతారో మాకు తెలియదు. వెళ్లిపోండి" అని కఠినంగా మాట్లాడాడు. మా కోడలు మాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు! వాళ్ళ అమ్మగారిది, మాది కాకినాడే. ఎవరు అక్కడికి వెళదామన్నా కరోనా కారణంగా ప్రయాణ సదుపాయాలు లేవు ఆ సమయంలో. ఒకవేళ ఏదోవిధంగా ప్రయాణం మొదలుపెట్టినా రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడ ఆపేస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి స్థితిలో కరోనా వచ్చిన కోడలు ఒక్కతే చిన్నపిల్లాడితో అక్కడ ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో అని భయపడి ఆ రాత్రంతా బాబానే తలుచుకుంటూ, "బాబా! మీరే దారి చూపండి. ఇంటి ఓనర్ మనసును మర్చి వాళ్లని ఎక్కడికి పంపించకుండా చేయండి" అని వేడుకున్నాను. బాబా గొప్ప అద్భుతం చేసారు. తెల్లవారుతూనే ఇంటి ఓనర్, "మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. కానీ, బయటకు రాకండి. జాగ్రత్తగా లోపలే ఉండండి" అని చెప్పారు. కానీ అబ్బాయి గెస్ట్‌హౌస్‌లో ఉన్నందున ఇంట్లో ఉండే కోడలు, మనవడి కనీస అవసరాలు తీరే దారి లేకపోయింది, మందులు కూడా దొరికే అవకాశం లేకుండా పోయింది. కోడలు చిన్నపిల్లాడిని చూసుకోలేక, ఒంట్లో ఓపిక లేక నీరసంగా ఉన్నా బాబుకోసం వంట చేస్తూ నరకయాతన పడింది. ఇక్కడ మేము ఫోనులో వారి బాధ వినలేక, చేసేదిలేక నిస్సహాయంగా బాబాని తలుచుకుంటూ ఉండిపోయాము. బాబా దయవలన మా అబ్బాయికి, కోడలికి కరోనా తగ్గింది. బాబుకు మాత్రం కరోనా రాలేదు. అది బాబా చేసిన అద్భుతం.
మా చిన్నబ్బాయి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం చాలా ఎదురుచూశాడు. అప్పుడు నేను, "బాబా! మీ దయవలన అబ్బాయికి ఉద్యోగం రావాలి" అని అనుకున్నాను. తర్వాత మాకు తెలిసినవాళ్ళు, "ఒక కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయ"ని చెప్పి అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు. అబ్బాయి అలాగే చేసాడు. బాబా దయవల్ల వాడికి వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది.
మా చిన్నన్నయ్యకి 50 సంవత్సరాలు దాటినా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా వయసు ఎక్కువని కుదరలేదు. దాంతో మా అన్నయ్య నేనింకా పెళ్లి చేసుకోను అనేవాడు. నేను, మా అమ్మ చాలా చాలా బాధపడ్డాము. నేను బాబాని, "బాబా! మీ దయవల్ల చిన్నన్నయ్యకి పెళ్లి అవ్వాలి" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. బాబా దయవల్ల అన్నయ్యకు మంచి సంబంధం వచ్చి పెళ్లి అయింది. వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా నేను అడిగిన ప్రతిదీ బాబా నాకు ప్రసాదించారు, నా కోరికలన్నీ తీర్చారు. ఇప్పటికీ నేను ఏమి అడిగినా తప్పకుండా తీరుస్తున్నారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా చూపిన కరుణ
Om Sai Ram
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm sai ram.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sai please 🙏🙏 give peace and reduce depression and fear . please 🙏 help in this issue.Om Sai Ram
ReplyDelete