- బాబా అద్భుత అనుగ్రహం
నా పేరు రాజేశ్వరి. మాది విజయవాడ. నేను స్కూల్ చదివే రోజుల్లో స్టిక్కర్స్ కొనుక్కొనేటప్పుడు బాబా స్టిక్కర్స్ ఏరుకొని మరీ తెచ్చుకునేదాన్ని. ఒకసారి 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని రాసి ఉన్న స్టిక్కర్ ఒకటి తీసుకొచ్చి నా పుస్తకాల అలమారాలో ఉంచుకున్నాను. దాన్ని రోజూ స్కూలుకి వెళ్లేముందు తాకి వెళ్ళేదాన్ని. అదెందుకో, ఏమిటో తెలీదు. ఇంట్లో అందరూ శివుణ్ని, రాముడ్ని, వేంకటేశ్వరస్వామిని ఆరాధించేవారు. నేను మాత్రమే బాబాని తెచ్చుకుంటూంటే, కారణమేంటని అందరూ అడిగేవారు. కానీ కారణం నాకు తెలిస్తే కదా! వాళ్ళకి చెప్పడానికి. అందువల్ల నవ్వేసి ఊరుకునేదాన్ని. కొన్నిరోజుల తర్వాత నా 10వ తరగతి అయిపోయాక మేము బాబా గుడి పక్కకి మారాము. ఇంటి పక్కనే గుడి ఉండేటప్పటికి మా నాన్నకి, అమ్మకి బాబా హారతులు, పూజలు అలవాటైపోయాయి. అసలు ఆ ఇల్లు మా నాన్న, పెద్దనాన్న ఉమ్మడిగా కట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో మా పెద్దనాన్న "మీరు వెళ్ళి ఉండండి" అన్నారు. అది బాబా అనుగ్రహమే!
నాకు 18 సంవత్సరాలకి పెళ్లైంది. పెళ్ళైన 9 సంవత్సరాలదాకా మాకు సంతానం కలగలేదు. మొదటి మూడు సంవత్సరాలు ఏ మందులూ వాడలేదుగానీ, తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే, సమస్య మావారిలో ఉందన్నారు. కానీ ఆ విషయం తెలిస్తే, వయసుపైబడిన మా అత్తయ్య, మావయ్య బాధపడతారని వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు తమ కొడుకులోనే సమస్య ఉందని తెలియక నన్ను కొంచెం మాటలనటం, బాధపెట్టటం చేస్తుండేవారు. మావారు, "సమస్య నాలో ఉంటే, నువ్వెందుకు అనవసరంగా మాటలు పడతావు? విషయం నేనే అమ్మానాన్నకి చెప్పేస్తాన"ని చెప్పేసారు. అప్పటినుండి వాళ్ళు నన్ను మాటలనటం మానేసారు. మేము నాలుగు సంవత్సరాలు ఇంగ్లీషు మందులు వాడాము. అవి చాలా శక్తివంతమైనవైనందున మావారి ఆరోగ్యం పాడైపోయింది. కానీ, నా కడుపు పండలేదు. నేను బాబాను ఎంతోగానో పూజిస్తూ, "నాకే సమాధానం చెప్పవూ?” అని అడుగుతుండేదాన్ని. కలలో బాబా, “నీకింకా సమయముంది. నన్ను నమ్ముకో. నీకు సంతానం ఉంది, నేనిస్తాను. నా మీద భారం ఉంచు. నీకు నేను పండంటి బిడ్డల్నిస్తాను" అని చెప్తుండేవారు. అలా దగ్గర దగ్గర 9సంవత్సరాలు పూర్తి కావొచ్చింది. నేను, "బాబా! నిన్ను నేనింతలా నమ్ముకున్నాను. నాకు నువ్వు ఇదా చేసేది?" అని అడుగుతుండేదాన్ని. ఒకరోజు మా అమ్మ టివిలో 'చైతన్య హోమియోకేర్' అని స్క్రోల్ అవుతుంటే చూసి మమ్మల్ని అక్కడికి వెళ్ళమని ఫోన్ చేసి చెప్పింది. నేను అప్పటికి చాలా నిరాశచెంది ఉన్నందువల్ల అమ్మతో, "పోమ్మా! ఇన్నేళ్ళుగా శక్తివంతమైన మందులు వాడుతుంటే దిక్కూ, దివాణం లేదు కానీ, ఏదో చిన్నచిన్న మాత్రలు ఇచ్చేస్తే కడుపు వచ్చేస్తుందా?" అని తన మాట కొట్టి పారేసాను. కానీ అమ్మ, "రాజీ! బాబాకి దణ్ణం పెట్టకొని వెళ్ళండమ్మా" అంది. ఏమో! బాబాయే అమ్మ ద్వారా ఈ మాట చెప్పిస్తున్నారనిపించి వెళ్ళాము. అక్కడ హాస్పిటల్ అంతా శిరిడీ సాయిబాబా పటాలు, విగ్రహాలు ఉండటం చూసి బోలెడంత ఆశ్చర్యమేసింది నాకు. తర్వాత ఆ డాక్టరు శిరిడీ సాయిబాబాకు గొప్ప భక్తుడని, ఆయన ఏ రోగికి మందులిచ్చినా బాబాకి చెప్పి మరీ ఇస్తాడని తెలిసింది. ఇంకా నేను ఒకటే అనుకున్నాను, 'నాకు గనక గర్భం వస్తే బాబా ఇచ్చినట్లుగా భావించి, నేనీ డాక్టర్కి ఒక బంగారు ఉంగరం చేయించి ఇస్తానని' అని. అదే విషయం బాబాకి చెప్పి దణ్ణం పెట్టుకున్నాను. డాక్టర్ అంతా పరీక్షించి, "ఒక ఏడాదిపాటు మందులు వాడాల"ని చెప్పారు. సరేనని ఏడాదిపాటు మందులు వాడాం. కానీ, మాకు ఏ గుణం కనపడలేదు. డాక్టర్ని, “డాక్టర్ గారూ! మీరు ఏడాది గడువిచ్చారు. మీరిచ్చిన గడువు పూర్తి అయిపోయింది. నాకేం గుణం కనపడలేదు. ఇప్పుడు మేమేం చేయాలి?" అని అడిగితే ఆయన, "నేను బాబా మీద నమ్మకముంచాను. మీరు కూడా ఆయన మీద నమ్మకముంచండి. మరో మూడు నెలలు మందులు వాడండి. బాబా దయతలిస్తే మూడు నెలలు కూడా అవసరం లేదు, ఈ ఒక్క నెలే చాలు" అన్నారు. మేము మందులు తీసుకుని వచ్చేసాం. అవి జనవరి, ఫిబ్రవరి నెలలు. ఒకరోజు నాకు కలలో బాబా కనిపించి నా చేతికి 'పండు' ఇచ్చారు. నేనాయన్ని, "ఈ పండు కాదు. పండంటి బిడ్డనివ్వు" అని అడిగాను. అంతటితో కల ముగిసింది. మర్నాడు మేము జూన్, జూలైలలో బ్యాంకాక్ టూర్ వెళ్లదలచి పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లి అక్కడ అన్ని సబ్మిట్ చేసి ఇంటికి వచ్చి మావారు బండి పార్క్ చేస్తుంటే, నేను పక్కనే నిలబడ్డాను. అంతలో ఒకాయన చాలా వేగంగా నా దగ్గరకి వచ్చి, నా చేయి పట్టుకొని, రమ్మని తీసుకెళ్ళసాగాడు. నేను, "ఏంటండీ! నన్ను ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు?" అని అడిగితే, "అమ్మా! అక్కడ బాబా వారొచ్చారు. నువ్వు కావాలంట, రమ్మంటున్నాడాయన" అని చెప్పాడు. ఆయనెవరో, బాబా రావడం ఏమిటో! నాకేం అర్థం కాలేదు. అదే మాట నేనాయనతో అంటే, "అక్కడ ఈ వీధి చివర ఇంట్లో బాబా ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు" అని, మావారిని కూడా "మీరు కూడా రండి" అని అన్నాడు. ఇంకా నాకేసి చూసి, "బాబావారమ్మా! అరగంట నుండి వెళ్ళటం లేదు, ముందు నువ్వు రామ్మా!" అంటూ నన్ను, మావారిని తీసుకెళ్లాడు. అసలేం జరిగిందంటే, అక్కడ బాబా భజన జరుగుతుంటే బాబా ఒక అమ్మ మీదకి వచ్చి, “ఈ సందు చివర ఒక 'పండు' చెట్టు ఉంటుంది(మా ఇంటి ముందు ఒక జామ చెట్టు ఉంది). ఆ ఇంట్లో నా భక్తురాలు ‘పండ్ల’కోసం ఎదురుచూస్తోంది. ఆ భక్తురాలికా పండు ఇవ్వందే నేనెళ్ళను నేనెళ్ళను” అని అరగంట నుండి వేచి చూస్తున్నారంట. అది తలుచుకుంటే నాకిప్పటికీ కళ్ళమ్మట నీళ్ళోస్తాయి. సరే, నేను అక్కడికి వెళ్లి గుమ్మంలో ఉండగానే, ఆ అమ్మ(బాబా) లేచి నా దగ్గరకొచ్చి నా చీర కొంచెం కిందకి లాగి, నా పొట్ట అంతా ఊదీ రాసి, ఒక పండు నా చీరకొంగులో పెట్టి, ఆ కొంగుని నా నడుముకి దోపేసి, “ఇంక నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. నీకింకా తిరుగులేదు. నేనున్నాను నీకు. ధైర్యంగా వెళ్ళు" అన్నారు. మావారి నుదుటన కూడా ఊదీ పెట్టారు. ఆ అమ్మగాని, ఆ ఇంట్లోవాళ్ళుగాని నాకు అంతకుముందు తెలియదు. అసలు అక్కడ భజన జరుగుతుందని కూడా తెలియదు. నాకేం అర్థం కాలేదుగాని అదే నెల నేను బాబా అనుగ్రహంతో నెల తప్పాను.
మిగతా తరువాయి భాగంలో...
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteఅద్భుతం..
ReplyDeleteఓమ్ శ్రీ సాయిరామ్..
🌹🙏🏻🙏🏻🙏🏻🌹
Om Sai Ram
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram om Sai Ram
ReplyDelete🙏
ReplyDelete🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteChaala baagundhi mee experience, you are so blessed
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
Om Sri Sai Aarogyakshemadhaaya Namaha 🙏🙏🙏