సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2099వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మనస్ఫూర్తిగా వేడుకుంటే అన్ని బాబానే చూసుకుంటారు
2. బాబును ప్రసాదించిన బాబా


బాబును ప్రసాదించిన బాబా 

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సందీప్. మేము గత 10 సంవత్సరాలుగా బాబాను మా ఇంటి సభ్యుడిలా భావిస్తూ, ప్రతి విషయంలో ఆయన ఆశీస్సులు తీసుకుంటూ జీవిస్తున్నాము. బాబాకు చెప్పకుండా మేము ఏ పని ప్రారంభించము. మా జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆశలు కోల్పోయిన రోజులున్నా మేమెప్పుడూ బాబాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం వదలలేదు. బాబా దయవల్ల మాకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థికంగా స్థిరపడ్డాం. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కూడా తీసుకున్నాము. మాకు ఒక పాప ఉంది. ఆమె మా జీవితానికి ఆనందం తీసుకొచ్చింది. కానీ కుటుంబసభ్యులు, బంధువులు, సమాజంలోని కొందరు "ఒక బాబు కూడా ఉంటే బాగుంటుంది" అని తరచూ అంటుండేవారు. మా కుటుంబం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నప్పటికీ అలాంటి మాటలు కొన్నిసార్లు మనసుకు బాధ కలిగించేవి. ఆ పరిస్థితుల్లో మేము బాబాపై విశ్వాసం ఉంచి, ఆయనకు మా కోరికను విన్నవించుకున్నాము. కొంత కాలం గడిచాక బాబా ఆశీస్సులతో మాకు ఒక బాబు జన్మించాడు. మా ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ రోజు మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. మా కుటుంబం పరిపూర్ణమైన భావన కలిగింది. మాకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం లభించినట్లు అనిపించింది. బంధువులు, స్నేహితులు కూడా చాలా సంతోషించారు. ఈ అనుభవం ద్వారా మేము బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే, ఆయన సరైన సమయంలో మనకు కావాల్సింది ప్రసాదిస్తారు. కొన్నిసార్లు ఆలస్యం జరిగినట్లు అనిపించినా, బాబా నిర్ణయం ఎప్పుడూ మన మంచికే అయి ఉంటుందని నేను తెలుసుకున్నాను. "బాబా! మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo