సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2098వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • 'శ్రద్ధ - సబూరీ' కలిగి ఉంటే, సరైన సమయంలో అన్నీ చక్కబెడతారు బాబా

నా పేరు మహేశ్వర. నాకు చిన్నప్పటినుంచే శిరిడీ సాయిబాబా పట్ల భక్తి ఉంది. చాలా సందర్భాల్లో నేను ఆయన సహాయ సహకారాలను అందుకున్నాను. ఒకసారి మా ఇంటి వాటర్ ప్యూరిఫైయర్‌ లీకేజ్ సమస్యతో నేను చాలా ఇబ్బందిపడ్డాను. మొదట ఒక టెక్నీషియన్ వచ్చి GKK2 భాగాన్ని మార్చాడు. కానీ అతను సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా వెళ్లిపోయినందున ఆ భాగం మార్చిన తర్వాత లీకేజ్ మరింత ఎక్కువైంది. నీరు కింద పడటం వల్ల రోజూ శుభ్రం చేయాల్సి వచ్చేది. ఫిర్యాదు చేస్తే, రెండో టెక్నీషియన్ తనకు తోచిన విధంగా చెక్ చేసి బ్యాక్ వాటర్ లీకేజ్ అని చెప్పి వెళ్లిపోయాడు. సమస్య అలాగే కొనసాగింది. డబ్బులు ఖర్చయినా సరైన పరిష్కారం దొరకక నాకు చాలా నిరాశ కలిగింది. అప్పుడు నేను బాబాను, "మీ ఆశీర్వాదంతో సమస్య త్వరగా పరిష్కారం కావాలి బాబా" అని ప్రార్థించాను. సర్వీస్ సెంటర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసాక మూడో టెక్నీషియన్ గురువారం మా ఇంటికి వచ్చాడు. అతను మొదట పైపులన్నీ, ఫిట్టింగ్లు చెక్ చేసి మునుపటి ఫిట్టింగ్ సరిగా లేదని గుర్తించి లీక్ అవుతున్న భాగాన్ని జాగ్రత్తగా సరిచేశాడు. కొన్ని కనెక్షన్లు కూడా మళ్లీ బిగించాడు. ఆ తర్వాత చాలాసేపు నీరు విడిచిపెట్టి పరీక్షించాడు. ఎక్కడా లీకేజీ కనిపించలేదు. అలా చివరికి బాబా దయవల్ల సమస్య పూర్తిగా పరిష్కారమైంది. నైపుణ్యం ఉన్న టెక్నీషియన్ ఉంటే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని నాకు అర్థమైంది. ఈ అనుభవం ద్వారా మంచి సర్వీస్, బాధ్యత, ముఖ్యంగా బాబా ఆశీర్వాదం ఎంత అవసరమో తెలుసుకున్నాను.

ఒకరోజు నేను నా కొత్త సోడెక్షో(Sodexo) కార్డు ఆక్టివేట్ చేయాలని అనుకున్నాను. అందులో భాగంగా పాస్వర్డ్ రీసెట్ చేస్తుంటే చాలా సమస్యలు వచ్చాయి. ఓటీపీ ఆలస్యంగా రావడం, యాప్లో ఎర్రర్లు రావడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. పైగా ఆఫీస్ లంచ్ టైం దగ్గర పడుతుండడంతో టెన్షన్ పెరిగింది. అప్పుడు మనసులోనే 'ఈ పని త్వరగా పూర్తైయ్యేలా చూడండి సాయిబాబా' అని అనుకున్నాను. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నిస్తే, ఈసారి ఓటీపీ వెంటనే వచ్చింది. పాస్వర్డ్ మార్చడం కూడా ఎలాంటి సమస్య లేకుండా పూర్తయింది. దాంతో కొత్త  పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాను. ఇది చిన్న విషయమే కావచ్చు కానీ, ఆ సమయంలో నాకు చాలా ఉపశమనం లభించింది. అలాగే ఇంకొకరోజు నేను ఒక ఉద్యోగ పోర్టల్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుంటే, ఆ ప్రక్రియలో భాగంగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ అవసరం అయింది. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా నా ఫోన్‌కి ఓటీపీ రాలేదు. అప్పుడు నేను మనసులో, "బాబా! ఈ అవకాశాన్ని కోల్పోకుండా నాకు సహాయం చేయండి" అని భక్తితో వేడుకున్నాను. కొద్దిసేపు బాబా నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా గడిపి తర్వాత మళ్లీ ప్రయత్నిస్తే, వెంటనే ఓటీపీ వచ్చి వెరిఫికేషన్ పూర్తై విజయవంతంగా దరఖాస్తు చేయగలిగాను. ఈ సంఘటనలు కొందరు యాదృచ్ఛికమని భావించవచ్చు కానీ, నాకు మాత్రం ఆ సమయంలో లభించిన ప్రశాంతత, పని సాఫీగా పూర్తవడం సాయిబాబా కృపగా అనిపించింది. బాబా చెప్పిన 'శ్రద్ధ', 'సబూరీ' జీవితంలో ఎంత ముఖ్యమో మరోసారి అర్థమైంది. నేటికీ ఆ రోజు గుర్తొచ్చినప్పుడల్లా బాబాపట్ల కృతజ్ఞతతో నా మనసు నిండిపోతుంది.

ఒకరోజు నేను టీవీ ఛానళ్లు కోసం రీఛార్జ్ చేస్తే, నాకు కావాల్సిన కొన్ని ఛానళ్లు యాక్టివేట్ కాలేదు. కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం రాలేదు. నేను ప్రతిరోజూ బాబాను స్మరిస్తూ ఓపికగా ఎదురుచూసి చివరికి ఒకరోజు, "బాబా! ఈ సమస్యను మీరు మాత్రమే పరిష్కరించగలరు" అని బాబాని వేడుకున్నాను. కొంత సమయం తరువాత చెక్ చేస్తే, ఆశ్చర్యకరంగా మిస్ అయిన ఛానళ్లు అన్నీ యాక్టివేట్ అయ్యాయి. ఆ క్షణం బాబా నా ప్రార్థన ఆలకించారని నాకనిపించి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అలాగే చాలారోజులు మా ల్యాండ్‌లైన్ ఫోన్‌కు ఎలాంటి కాల్స్ రాకపోతే ఒకరోజు నేను బాబాను ప్రార్థించి, ఆయన్ని స్మరిస్తూ ఉండగా కొద్దిసేపటికి ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. ఇది చిన్న విషయంగా అనిపించినా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే, బాబా తమ ఉనికిని తెలియజేస్తూ, 'నేను నీతోనే ఉన్నాను' అని చెప్పినట్లుగా అనిపించింది. ఈ రెండు సంఘటనలు నా విశ్వాసాన్ని మరింత పెంచాయి. సాయిబాబా తన భక్తులకు సంబంధించిన పెద్ద విషయాల్లోనే కాదు, చిన్న విషయాల్లో కూడా సహాయం చేస్తారని మరోసారి నాకు అనుభవమైంది. మనం శ్రద్ధ(విశ్వాసం), సబూరీ(ఓర్పు) కలిగి ఉంటే, బాబా సరైన సమయంలో అన్నీ చక్కబెడతారు. ఆయన కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. ఈ అనుభవాలను స్మరించుకుంటూ సాయిబాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబా అందరికీ శాంతి, ఆనందం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

ఒకరోజు నా ఫారం 16 పిడిఎఫ్లో 'సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్(Signature Not Verified)' అని చూసి ఆందోళన చెందాను. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సందిగ్ధంలో ఉన్న సమయంలో సాయిబాబాను ప్రార్థించాను. బాబా దయతో అనుకోకుండా సరైన మార్గదర్శనం లభించి అడోబ్ అక్రోబట్ రీడర్(Adobe Acrobat Reader) ద్వారా డిజిటల్ సిగ్నేచర్‌ను వెరిఫై చేసే విధానం తెలిసి సమస్య పరిష్కారమైంది. ఇది చిన్న విషయంగా కనిపించినా, నాకు అది బాబా కృపతో సరైన సమయంలో, సరైన సహాయం అందినట్లుగా అనిపించింది. జీవితంలో ఇలాంటి సందర్భాలు విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని నేను నమ్ముతున్నాను.


సాయి శ్రీసాయి జయజయసాయి


6 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Omsai srisai jayajayasai

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai

    ReplyDelete
  5. sai baba maa sai madava 10th class 500 above marks tho pass avvali mee daya valana

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo