సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీసాయిలీల పత్రిక - 1931, 4వ సంచికలోని వివరాలు


శ్రీసాయినాథుని దివ్య ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
"బాబా! మీ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ప్రారంభమై 7ఏళ్ళు పూర్తయి 8వ ఏట అడుగుడిన సందర్భంగా సదా మీ ప్రేమను ఆస్వాదిస్తూ, మీ లీలలను పంచుకుంటూ, మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి"

బాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించి, వారి అనుగ్రహానికి పాత్రుడైన భక్తుడు పూణే నివాసి శ్రీ నీలకంఠ రామచంద్ర సహస్రబుద్దే 1931, మే 9న శ్రీసాయిలీల పత్రికకు పంపిన లేఖలోని కొన్ని వివరాల తెలుగు అనువాదం:  


శ్రీసాయిలీల గ్రంథ రచయితకు నా వినమ్ర నమస్కారాలు. శ్రీవారికి(శ్రీసాయిబాబా) సంబంధించిన మరికొన్ని దివ్య లీలలు ఇటీవల నాకు స్ఫురించినందున, అవి మరింత విస్తృతంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వాటిని మీకు తెలియజేస్తున్నాను. ఇది 15 సంవత్సరాల కిందట(1916లో) జరిగింది. ఒకరోజు ఉదయం బాబా బాపుసాహెబ్ జోగ్, తదితర భక్తులతో సంభాషిస్తూ ఇలా అన్నారు, "కాకా(దీక్షిత్) తీవ్ర జ్వరంతో బాధపడుతూ చాలా అనారోగ్యంగా ఉన్నాడు. నేను లేకుండా అతను మందులు తీసుకోడు. కాబట్టి నేను పార్లే వెళ్ళాలి. కానీ బాపుసాహెబ్, నువ్వు 'అతనినే ఇక్కడికే రమ్మని' కబురు పంపు" అన్నారు. ఈ సంభాషణ జరిగిన రోజు, భావుసాహెబ్‌కు(కాకాసాహెబ్ దీక్షిత్) జ్వరం వచ్చి ఐదవరోజు. అతను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ తన సాధారణ అలవాటు ప్రకారం ఊదీ, ఊదీ తీర్థం తప్ప మరే ఇతర మందులు అసలు తీసుకోలేదు. మర్నాడు బాపుసాహెబ్ ద్వారా శ్రీసాయి పిలుపు అతని ఇంటి ముంగిట చేరింది. ఆ కబురు అందిన వెంటనే అతను మరునాడు సాయంత్రం శిరిడీకి బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా తన ప్రయాణ విషయంలో తన భార్య దివంగత శ్రీమతి బాబిబాయిసాహెబ్ ఎటువంటి ఆందోళనకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో పార్లే నుంచి శిరిడీకి తనతోపాటు నన్ను కూడా తీసుకెళ్తానని ఆమెకు తెలియజేసారు. 


మేము బయలుదేరడానికి నిర్ణయించిన రోజు ఉదయం, భావుసాహెబ్ వద్ద నుండి నాకు ఒక ఆకస్మిక పిలుపు వచ్చింది. ఆ పిలుపు అతని ఆరోగ్యానికి సంబంధించి నా మనసులో ఆందోళన కలిగించింది. దాంతో నేను వెంటనే ఆయన బంగళాకు బయలుదేరాను. నేను వెళ్ళిన సమయానికి భావుసాహెబ్ ఇంకా నిద్రలేవలేదు. అందువల్ల నేను నేరుగా బాబీని కలిసి మాట్లాడాను. ఆమె నాకు మొత్తం పరిస్థితి వివరించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి భావుసాహెబ్ నిద్రలేచారు. నేను వెంటనే ఆయనను కలిసి ఈ విధంగా సూచించాను, "నేను మీతో తోడుగా ఉన్నంతవరకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని బాబీబాయికి పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, ఆమెను, వంటమనిషిని మన వెంట తీసుకువెళ్లడం చాలా వివేకవంతమైన పని అవుతుంది. ఎందుకంటే, మనం శిరిడీ చేరుకున్న తర్వాత, బాబా మనల్ని అక్కడ ఎన్ని రోజులు ఉంచుకోవాలని నిర్ణయిస్తారో చెప్పలేము కదా!" అని. నా సూచన ఆయనకు సబబుగా అనిపించింది. అదే రోజే సాయంత్రం మేము బొంబాయి నుంచి శిరిడీకి బయలుదేరాము. మా రైలు మన్మాడ్ వద్ద ఆగినప్పుడు స్త్రీల బోగిలో కేవలం ఇద్దరు స్త్రీలు మాత్రమే ఉండడాన్ని గమనించిన కొంతమంది బ్రిటిష్ సైనికులు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో నేను అక్కడ లేకపోయి ఉంటే, నిజంగా ఒక అత్యంత భయంకరమైన సంఘటన జరిగి ఉండేది. ఎందుకంటే, ఆ సమయంలో శారీరక బలహీనత కారణంగా భావుసాహెబ్‌కు, అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం, చక్కదిద్దడం పూర్తిగా అసాధ్యమై ఉండేది. చివరగా, మేము క్షేమంగా శిరిడీ చేరుకున్నాము. మేము శిరిడీలో అడుగుపెట్టగానే పార్లేలో భావుసాహెబ్‌ను పట్టిపీడించిన జ్వరం తగ్గిపోయింది, తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు.


ఒకసారి ఒక శ్రీమంతురాలైన ముస్లిం స్త్రీ శిరిడీ వచ్చింది. ఆమె క్రమం తప్పకుండా కొంత ధనాన్ని వెంట తీసుకొని వరుసగా మూడురోజలు మసీదుకు వెళ్ళి బాబాను దర్శించింది. కానీ, బాబా ఆమెను దక్షిణ అడగలేదు. నాల్గవ రోజు ఆ మహిళ బాబాతో, "బాబా! నేను మిమ్మల్ని నా గురువుగా చేసుకోవాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. కాబట్టి దయచేసి నా దక్షిణను స్వీకరించి, నాకు ఆధ్యాత్మిక ఉపదేశం చేయండి" అని విన్నవించుకుంది. ఆమె మాటలు విన్న బాబా, "గురువును గుర్తించాలి, చేసుకోకూడదు. నువ్వు ఈ మట్టికుండని గురువుగా ఆరాధించు. నీ సంకల్పం నెరవేరుతుందో, లేదో చూడు" అని బదులిచ్చారు.

8 comments:

  1. Happy 8th anniversary to Sai Baba blog. Om Sai Ram

    ReplyDelete
  2. Please keep daily Sai 🙏🙏 Baba miracles on this blog.Om Sai Baba

    ReplyDelete
  3. Chala thanks Baba.. 🙏 Ma husband IT employee tana job poyi 5 months avtundi... 5 months nundi tanu chala serious ga job trails chestunnadu.. one day ma amma Baba ni veduko job tappakunda vastadi ani cheppindi.. ma amma cheppina next day ne nenu sai baba temple ki velli sai sacharitra book techukunnanu.. one week parayana chesanu.. Sai Baba adbutam chesadu sai sacharitra parayanam ayi poyina roje ma husband job vachindi.. memu assalu expect cheyaledu.. happynes tho edchesanu.. memu anukunna dani kante ekkuva package vachindi.. thank you so much Baba.🙏

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  5. Om sai ram tandri, amma nannalani na kutumbanni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri pls, ofce lo ye samasya lekunda anta Prashantham ga gadiche la chudandi tandri pls anta me daye

    ReplyDelete
  6. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo