సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2050వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉనికిని తెలియజేసి ధైర్యాన్నిచ్చిన బాబా
2. బాబా ఎల్లప్పుడూ భక్తుల ప్రార్థన వింటారు - ఎన్నడూ నిరాశపరచరు

ఉనికిని తెలియజేసి ధైర్యాన్నిచ్చిన బాబా

ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు సురేష్ కుమార్. నేను నా కుటుంబంతో యుఎస్‌లో ఉంటున్నాను. నేను నా జీవితంలో ఎక్కువసార్లు చదివిన పుస్తకం 'బాబా చరిత్ర'. బాబా నా జీవితంలో ఒక భాగమైపోయాయి. ఆయన ఇప్పటివరకు నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో నుండి కొన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు మా అమ్మకి ఛాతీలో కొంచం ఇబ్బందిగా అనిపిస్తే, డాక్టర్ని సంప్రదించి అన్ని పరీక్షలు చేయించాము. అప్పుడు ఆమె హార్ట్‌లో బ్లాక్ ఉందని తెలిసి దేశం కాని దేశంలో అమ్మకి స్టెంట్ వేయించాల్సి వచ్చింది. అమ్మని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లేటప్పుడు మేము వస్తామన్నాము. ఎందుకంటే, మా అమ్మకి ఇంగ్లీష్ అస్సలు రాదు, డాక్టర్‌కి తెలుగు తెలీదు. కానీ డాక్టర్ వద్దన్నారు. దాంతో మేము గదిలో చాలా భయపడుతూ కూర్చున్నాము. నేను బాబానే ధ్యానిస్తూ, 'బాబా బాబా..' అనుకుంటూ ఏం చేయాలో తెలియక ఒకసారి గది తలుపు తీసి చూసాను. ఒక్కసారిగా నా కళ్ళు చమర్చాయి. మేమున్న గదికి ఎదురుగా ఒక తలుపు(STAIRS డోర్) ఉంది. ఆ తలుపు మీద ఉన్న STAIRS అన్న అక్షరాలలో కొన్ని అక్షరాలు రాలిపోయి కేవలం 'S  A  I' అని మాత్రమే మిగిలాయి. అది చూసిన వెంటనే నాకు ధైర్యం వచ్చి మనస్ఫూర్తిగా బాబాకి నమస్కరించుకున్నాను. బాబా దయతో ఆపరేషన్ విజయవంతమైంది.

ఒకసారి నేను కొంచం అత్యవసర పని మీద ఇండియా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు వీసా లేనందున వీసా స్టాంపింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాను. తర్వాత స్టాంపింగ్‌కి వెళ్లే ముందురోజు చూసుకుంటే, నా DS-160(టెంపరరీ వీసా) తప్పు వుంది. అప్పటికప్పుడు నేను వేరే DS-160 ఫారం నింపి తీసుకెళ్ళాను. కానీ మనసులో 'వాళ్ళు కొత్త అప్లికేషన్ తీసుకుంటారా? మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని రమ్మంటారా? అదే జరిగితే స్లాట్స్ దొరకవేమో!' ఇలా చాలా సందేహాలు. బాబాని తలుచుకొని, "నువ్వే గట్టెకించాలి బాబా?" అని అనుకుంటూ 'బాబా బాబా..' అని నామస్మరణ చేస్తూ ఉన్నాను. తర్వాత పిలిచేది నన్నే అనగా ఎందుకో పక్కకి తిరిగి చూసాను. అద్భుతం! నా పక్క వరుసలో కూర్చున్న ఒక ఆమె బాబా చరిత్ర చదువుతుంది. వెంటనే నాలో ఆనందం, ధైర్యం కలిగాయి. ఆమె దగ్గరకు వెళ్లి, బాబాకి నమస్కరించుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి సమస్యా లేకుండా వీసా పని పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. మేము ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాం బాబా".


5 comments:

  1. Om Sairam!! Happy New year Baba!!

    ReplyDelete
  2. Om sri sairam🙏🙏

    ReplyDelete
  3. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu varidaru kaladi undala cheyandi

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  5. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo