ఈ భాగంలో అనుభవం:
- బాబా దయతో పార్ట్ టైమ్ ఉద్యోగం - కోరుకున్న చోటుకు బదిలీ
అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాసరావు. ప్రస్తుతం అన్ని దేశాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయి, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మనం వింటున్నాము. ఇటువంటి పరిస్థితిలో మా పెదబాబు విదేశంలో MS చదువు పూర్తి చేసి పిహెచ్డి లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని అనుకున్నాడు. అనుకున్నట్లే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడితే ఎన్ని ప్రయత్నాలు చేసిన తనకి ఉద్యోగం రాలేదు. చివరికి పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా రాలేదు. అప్పుడు మేము బాబాను, "మా కుమారునికి దారి చూపించు తండ్రీ. అక్కడ వాడికి ఏ ఇబ్బంది లేకుండా తోడుగా ఉండి కాపాడు తండ్రీ" అని ప్రార్థించాము. బాబా, "నేను ఉన్నాను. మీకు ఏ ఇబ్బంది లేదు. నేను చూసుకుంటాను" అని సందేశాలు ఇచ్చారు. అలాగే ఆయన దయవల్ల బాబుకి ఒక పార్ట్ టైమ్ ఉద్యోగం దొరికింది. "ధన్యవాదాలు తండ్రీ. ఇలాగే బాబుకి పర్మినెంట్ ఉద్యోగం దొరికేటట్లు అనుగ్రహిం చు తండ్రీ. మాకు నీవే దిక్కు తండ్రీ. నీవు తప్ప మాకు ఎవరు లేరు. బాబుకి ఉద్యోగం రాగానే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాము తండ్రీ ".
ఇప్పుడు 2025, మే/జూన్‌లో జరిగిన టీచర్స్ బదిలీల్లో నా భార్య పద్మావతి విషయంలో నా తండ్రి బాబా చేసిన అద్భుతమైన లీలను పంచుకుంటాను. నా భార్య చిలకలూరిపేట మండలంలోని ఒక స్కూల్లో చాలాకాలం గా పని చేస్తుండటం వలన ఈసారి తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం బదిలీలు ఆన్లైన్ ద్వారా జరుగుతాయని మొండి పట్టుపట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న దాదాపు 3000 ఖాళీ ఫోస్టులకు ఆన్లైన్లో ఆప్షన్ పెట్టడమంటే, నా భార్యకు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. అందుచేత మేము నా తండ్రి బాబాను, "బదిలీలు ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గా జరిగేటట్లు చేయమ"ని మనసారా ప్రార్థించాము. నా తండ్రి నా ప్రార్థన విని బదిలీలు మ్యాన్యూవల్గా జరిగేటట్లు గొప్ప అద్భుతం చేసారు. ఇకపోతే, మేము ఉండేది గుంటూరు కాబట్టి, అక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా గుంటూరు నుండి ఒక గంటలోపు ప్రయాణ దూరంలో ఉండే గ్రామానికి బదిలీ అయితే బాగుంటుందనుకున్నాము. కనీసం సత్తెనపల్లి గానీ, క్రోసూరు మండలంకి గానీ బదిలీ అయితే బాగుంటుందని ఆశపడ్డాము. కానీ బదిలీలు పాయింట్ల ఆధారంగా జరుగుతాయి. నా భార్య పని చేస్తున్న చిలకలూరిపేట మండలం అంతా కేటగిరీ 2 కిందకి వస్తుండటంతో నా భార్యకు బదిలీలలకు సంబంధించి పాయింట్లు తక్కువ వచ్చాయి. ఆ కారణంగా తను సీనియారిటీ జాబితాలో చాలా వెనుకబడి ఉంది. అందుచేత నిత్యం బాబాని, "కొంచం దగ్గరగా ఉండే ప్రాంతానికి బదిలీ అయ్యేటట్టు చూడమ"ని ప్రార్థిస్ తూ ఉండేవాళ్ళము. బాబా, "నేను ఉన్నాను. మీకు ఇబ్బంది కలగదు" అని ప్రతిసారీ మాకు అభయం ఇస్తుండేవారు.
క్రోసూరు మండలంలో పని చేస్తున్న నా భార్య స్నేహితులు కొందరు తనని క్రోసూరు మండలం కోరుకోమని చెప్పారు. మా ఇంటికి దగ్గరగా ఉన్న రోడ్డు మార్గం గుండా అమరావతి మీదుగా క్రోసూరుకు వెళ్లేందుకు బస్సులు ఉన్నాయి కాబట్టి, ప్రయాణానికి అంతగా ఇబ్బంది ఉండదని వాళ్ళు చెప్పారు. కానీ ర్యాంక్ ప్రకారం మూడవరోజున కౌన్సిలింగ్ కు హాజరైన నా భార్య ర్యాంక్ వరకు వస్తుండేసరికి దగ్గర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. క్రోసూరులో 1, 2 చోట్ల మాత్రమే ఖాళీ ఉండగా మిగిలినవన్నీ గురజాల, మాచర్ల, వెల్దుర్తి మొదలైన దూర ప్రాంతాల్లో ఉన్నాయి. మేము ఉన్నవాటిలో క్రోసూరు మండలంలోని 'మునుగోడు' కోరుకుందామనుకున్నాము కానీ,
నా భార్య ర్యాంకుకి ముందు 4వ స్థానంలో ఉన్న ఒకరు ఆ చోటు కోరడంతో మా ఆశ నీరుగారిపోయింది. ఇంతలో నా భార్య తమ్ముడు ఇక క్రోసూరు మండలంలో ఖాళీలు లేవని చెప్పాడు. దాంతో మేము చాలా దూర ప్రాంతంకి బదిలీ అవుతుందేమోనని చాలా భయపడ్డాము. తర్వాత నా భార్య పేరు వచ్చినప్పుడు ఒకసారి క్రోసూరు మండలంలో ఖాళీ ఉన్న చోట్లు చూపించమని అడిగాము. వాళ్ళు స్క్రీన్‌పై ఆ చోట్లు చూపిస్తే, అందులో మాకు కావలసిన ఒక చోటు ఉంది. వెంటనే మేము ఆ చోటికి బదిలీ కోరుకున్నాము. అలా మేము కోరుకున్నట్టు నా భార్యకి
దగ్గర ప్రాంతానికి బదిలీ అయింది. జూన్ 16న తను ఆ కొత్త స్కూల్లో జాయిన్ అయింది. అక్కడ స్టాఫ్ అందరూ మంచివాళ్ళు. మేము నా తండ్రి బాబాను నమ్ముకున్నాం. నా తండ్రి నమ్మినవారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. "ధన్యవాదాలు తండ్రీ. మేమెప్పుడూ నీ పాద సేవ చేసుకునే భాగ్యాన్నివ్వు తండ్రీ. అందరినీ చల్లగా చూడు తండ్రీ.
తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసుంటే క్షమించు తండ్రీ. అందరినీ చల్లగా చూడు తండ్రీ".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
Om Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba ne daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDeleteThank you 🙏 Baba my son family reached their place.Om Sai Ram.My tension reduced.by your blessings.Thank you Sai
ReplyDeleteThank you Sai you blessed my 🙏🙏 son family.Om Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram. Please provide stipend to my son.
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓంసాయిరాం
ReplyDelete