సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2006వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాధలను తీర్చే బాబా
2. శరణాగతి నేర్పిస్తున్న బాబా

బాధలను తీర్చే బాబా

నా పేరు పుష్పలత. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైరయ్యాను, బాబాతో నాకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. సుమారు 30 సంవత్సరాల క్రితం జనవరి 1న మా పాఠశాల విద్యార్థులు బాబా ఫోటో ఉన్న గ్రీటింగ్ కార్డు నాకు ఇచ్చారు. అప్పుడు మొదలైన బాబాతో నా అనుబంధం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. నా జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. బాబా నాపై చూపిన కరుణ, దయ ఇంతని చెప్పలేను‌. కొద్దిరోజుల క్రితం నాకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది. హఠాత్తుగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం మొదలైంది. 'సాయీ' అనగానే 'ఓయ్' అని మన బాధలను తీర్చే బాబా తప్ప మనకి దిక్కు ఎవరు? ఆయన్నే తలుచుకొని 'నాకీ వయసులో ఇదేంటి బాబా?' అని నేను ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. మనసులో బాబాని తలుచుకొని ఊదీ మంచినీళ్లలో వేసుకొని, బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ తీర్థం తాగి, కొంత ఊదీ నా పొట్టకి రాసుకున్నాను. అనూహ్యంగా నాకొచ్చిన సమస్య తొలగిపోయింది.

నేను యుఎస్ఏలో ఉన్న మా పాప దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఇమ్మిగ్రేషన్‌వాళ్ళు అడిగిన ప్రశ్న నాకు అర్థంకాక నేనేమీ సమాధానం చెప్పలేకపోయాను. దాంతో వాళ్ళు నన్ను కాసేపు పక్కన ఉండమన్నారు. నాకు చాలా భయమేసి పక్కన కూర్చొని అక్కడ ఉన్నంతసేపూ, "బాబా! నన్ను ఎలాగైనా ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయండి" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఆయన నామస్మరణ చేశాను. కాసేపటికి వాళ్ళు నన్ను 'ఓకే' చేసి ఫ్లైట్ దగ్గరకి పంపించారు. బాబా దయవలన నా ప్రయాణం నిర్విఘ్నంగా సాగి క్షేమంగా ఇండియాకి వచ్చాను. ఇలా అడుగడుగునా నాకు అండగా ఉంటూ నా బాధలు, ఇక్కట్లు తొలగిస్తూ నన్ను గట్టెక్కిస్తున్న సాయినాథునికి నేను ఎంతగానో ఋణపడి ఉన్నాను. ఇలా బాబా నాపై చూపిన ప్రేమ, కరుణలను మీతో పంచుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. "బాబా! నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. ఇదేవిధంగా కరుణించి నన్ను, సాయి బంధువులందరినీ ప్రేమతో కాపాడుతూ అందరూ క్షేమంగా ఉండేలా తండ్రీ. ఎల్లవేళలా నా అండ నుండి నన్ను నడిపించు మీకు శతకోటి వందనాలు".

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు.


15 comments:

  1. తండ్రి నేను ఒక సమస్య తో బాధ పడి ప్రశాంతత లేదు.నాకు మనోధైర్యం ప్రశాంత కలిగి కాపాడు.please help in this situation.please bless my husband and children 🙏 with full aayush.Om Sai Ram

    ReplyDelete
  2. Baba ఒక రెండు నెలలు ప్రశాంతం గా ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అంటే భయం గా వుంది. మీకు తెలుసు కదా బాబా అందరు ఒకే చోట ఉండి మానసిక అశాంతి,వేదనా అనుభవించానో. దయ చేసి వాళ్ళ మాటల నించి తప్పించు. నన్ను నా భర్త ని కాకుండా చేయాలి అని చూస్తున్నారు. మా అమ్మ నాన్న ని రానీయకుండా చేసారు. వాళ్ళు ఏమి చేస్తున్నారో మీకు తెలుసు బాబా. రేపు అందరం ఒక చోట ఉన్నా దయ చేసి వాళ్ళు అందరు వాళ్ళ ఇంట్లోనే ఉండేలా చేయి బాబా. 🙏🏼🙏🏼🙏🏼

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Om Sai Ram 🙏🙏🙏

    ReplyDelete
  8. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  9. On Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  10. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  11. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  12. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  13. Sai na badhalanni neeku telusu.. na jeevitham etu prayanistondo emo.. Sai Sai Sai kapadu please.. samasyalanni nuvve solve cheyali. Asakthuralini, asahayuralini aduko prabhu apadhbandhava🙏🥲… baba na prarthana vinipistonda, niku vinipistu unte naku edo oka nidarsanam ivvu please please please 🙏 , baba baba baba baba baba baba baba baba baba baba baba baba 🥲

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo