ఈ భాగంలో అనుభవాలు:
1. పరీక్షల సమయంలో బాబా అనుగ్రహం
2. నిజంగా బాబా ఎంత కరుణమయుడో!
3. భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టరు బాబా
పరీక్షల సమయంలో బాబా అనుగ్రహం
నా పేరు హాసిని. నాకు ఈమధ్య పరీక్షలు జరిగాయి. తొందరగా పరీక్షా కేంద్రానికి చేరుకుంటే కొద్దిసేపు ఏదైనా చదువుకోవచ్చు. కానీ మొదటి పరీక్షకి వెళ్ళేటప్పుడు వర్షం పడింది.
వర్షం వల్ల ఆలస్యమైతే ఎలా చదువుకుంటాననిపించి వర్షంలో బండి మీద వెళ్తున్న నాకు ఈ బ్లాగులో కొంతమంది భక్తుల అనుభవాలలో 'వర్షం రాకుండా చేయండి బాబా' అని బాబాని అడగటం గుర్తొచ్చి నేను కూడా బాబా సహాయాన్ని అర్థించాను. అయినా వర్షం ఆగలేదు గాని దారిలో ఉన్న బాబా గుడి, అమ్మవారి గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకొని బయటకి వచ్చి చూస్తే, వర్షం ఆగిపోయింది. 'ఇది కదా! బాబా లీల' అని అనుకొని ఆనందంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళిపోయాను. బాబా దయవల్ల పరీక్ష బాగా రాసాను. బాబా దయవల్ల మంచి మార్కులు రావాలని ప్రార్థిస్తున్నాను.
నాకు ఒక సబ్జెక్టు పరీక్షకోసం ఎలా చదవాలో, ఏం చేయాలో తెలియదు. ఆ విషయంగా దారి చూపమని నేను బాబాతో చెప్పుకొని చాలాసార్లు ఏడ్చాను. కానీ నాకు ఏ దారి కనిపించలేదు. ఇంకా పరీక్ష దగ్గరకి వచ్చేసింది. అప్పుడు నాలో, 'ఏంటిలా? ఇక్కడితో నా జీవితం ఆగిపోతుందా ఏంటి?' అని టెన్షన్ మొదలైంది. అందరూ, 'బాబాని నమ్ముకుంటే దారి చూపిస్తారంటారు. కానీ నా విషయంలో ఎందుకు అది జరగట్లేదు?' అని ఆందోళన చెందిన రోజులు చాలా ఉన్నాయి. చివరికి పరీక్ష జరిగే రోజు రానే వచ్చింది. పరీక్ష జరిగే హాల్‌కి వెళ్ళడానికి 10 నిమిషాల ముందు కాసేపు కునుకు తీసాను. అప్పుడు బాబా ఫోటో రూపంలో స్వప్న దర్శనమిచ్చారు. దాంతో నాకు ధైర్యం వచ్చి విశ్వాసంతో పరీక్ష జరిగే గదిలోకి వెళ్ళాను. కానీ ప్రశ్నాపత్రం చూడగానే, 'నాకు ఏం రాదు. నా జీవితం అయిపోయింది. బాబా నన్ను మోసం చేసారు' అని అనుకున్నాను. బాబాకి ఒక్కటే చెప్పుకున్నాను, "పరీక్ష వ్రాసి పాస్ అవ్వాలి బాబా. అది జరిగితే మీ గుడికి వచ్చి చక్కెర, బిస్కెట్లు, చాక్లెట్లు మీకు నివేదిస్తాను" అని. తరువాత నాకు తెలిసినవి కొంచెంకొంచెంగా వ్రాస్తూ ఉంటే జవాబులు వచ్చాయి. నా పక్కనున్న వాళ్ళ సహాయం కూడా కాస్త తీసుకున్నాను. ఆ సహాయం అందిందంటే అది బాబా దయవల్లనే. "ధన్యవాదాలు బాబా. ఎలా అయినా నన్ను ఆ పరీక్షలో పాస్ చేయండి బాబా. మీరే నా ధైర్యం. బ్లాగులో చాలామందికి పరీక్షల్లో వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మార్కులు వచ్చినట్లు బాబా సహాయం చేసారని వుంది. నా జీవితంలో కూడా ఆ లీల చూపించండి బాబా".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
నిజంగా బాబా ఎంత కరుణమయుడో!
నా పేరు జగదీశ్వర్. 2025, ఏప్రిల్‌లో మా చిన్నమ్మాయి హైదరాబాద్‌కి సమీపంలో ఉన్న ఆర్‌విఎమ్ మెడికల్ కాలేజీలో ENT సీనియర్ రెసిడెంట్ డాక్టరుగా జాయిన్ అయింది. తను ప్రతి శనివారం సాయంత్రం బస్సులో కరీంనగర్ వచ్చి, సోమవారం ఉదయం తిరిగి వెళ్తుంది. అలాంటిది జూన్ 14, శనివారం సాయంత్రం తను మాకు కాల్ చేసి షేరింగ్ క్యాబ్‌లో వస్తున్నట్టు చెప్పింది. షేరింగ్ క్యాబ్, పైగా రాత్రి సమయం అవ్వడం వల్ల మాకు టెన్షన్‌తో చాలా భయమేసింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "అమ్మాయి సురక్షితంగా ఇంటికి రావాల"ని వేడుకున్నాను. బాబా ఆశీస్సులతో అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకుంది.
పోలండ్‌లో మా మనవరాలికి 2025, జూన్ రెండో వారంలో తీవ్రమైన జ్వరం వచ్చింది. డాక్టర్ చూసి 'నిమోనియా' అన్నారు. ఆ విషయం తెలిసి కరీంనగర్లో ఉన్న నేను బాబా ఊదీ పెట్టుకొని, "మా మనవరాలు జ్వరం తగ్గి మామూలుగా అయ్యేలా దయ చూపమ"ని వేడుకున్నాను. బాబా అనుగ్రహం! వెంటనే మా మనవరాలికి జ్వరం తగ్గి మామూలు అయింది. నిజంగా బాబా ఎంత కరుణమయుడో కదా! "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా సాయి చరణం| సర్వదా శరణం శరణం||
భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టరు బాబా
ప్రియమైన సాయిభక్తులారా! నా పేరు సుధీర్. సాయితో నా ప్రయాణం 1999లో ప్రారంభమైంది. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నేను విదేశాలకు వెళ్లాలని ఆశపడ్డాను. ఆ ఆశ కారణంగా నేను ఒక ఏజెంట్ మోసానికి గురై నా డబ్బు, పాస్‌పోర్ట్ పోగొట్టుకొని ముంబయిలో అడుగుపెట్టాను. అక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. వెనక్కి వెళ్లిపోదామంటే బంధువుల ముందు పరువు పోతుందని నా స్వస్థలానికి తిరిగి వెళ్ళలేకపోయాను. నాకు ఏమి చేయాలో తెలియలేదు. అటువంటి సమయంలో నేను శిరిడీ వెళ్లి బాబాను ప్రార్థించి, 3 రోజులు అక్కడే ఉన్నాను. అంతే, 15 రోజుల్లో ముంబయిలో నాకు ఉద్యోగంతోపాటు వసతి కూడా లభించింది. బాబా తమ భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టరని తెలియజేసిన నా మొదటి అనుభవమిది. నేను పిలిచిన ప్రతిసారీ బాబా నా వెనుక ఉన్నారు. ప్రతిసారీ ఆలస్యం లేకుండా ఆయన నాకు సహాయం చేసారు. నా జీవితంలో నేను నా బాబాను మరచిపోలేను. ఆయనే నా సర్వస్వం, ఆయనే నా గురువు, సఖుడు. "మీరు మాపై చూపే దయకు చాలా ధన్యవాదాలు బాబా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 💐💐🙏🙏
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi pl
ReplyDeleteSince my child hood iam truly blessed by Baba ,,,which can't be described by words , please consider my wish 🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me