ఈ భాగంలో అనుభవం:
- నమ్మకాన్ని వృధా కానివ్వరు బాబా
సాయి బంధువులందరికీ శుభోదయం. మా బాబా ఆశీస్సులు అందరి మీద సదా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సరస్వతి. నాకు బాబాతో చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. మేము ఉండేది బళ్లారి(కర్ణాటక). నేను రోజూ రానూపోనూ రెండున్నర గంటల ప్రయాణం చేసి ఆంధ్రాలోని ఒక గ్రామ వార్డు సచివాలయంలో పని చేస్తున్నాను. మాకు ఒక్కగానొక్క పాప. తన పేరు అన్విత. తను 4వ తరగతి చదువుతుంది. తను 2026, జనవరి 24, శనివారంనాడు ఒంటిపూట బడి అని, స్కూలుకి వెళ్లానని ఇంట్లోనే ఉంది. ఎప్పటిలానే ఆఫీసుకి వెళ్ళాను నేను మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి ఫోన్ చేసి, "పాప తిన్నాదా, లేదా" అని అడిగితే, మావారు, "పాప కిందపడి దెబ్బలు తగిలించుకుంది" అని వీడియో కాల్ చేసి మరీ చూపించారు. అప్పుడు పాప మామూలుగా కంటే చాలా పెద్దగా ఏడుస్తుంది. నాకు వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించింది కానీ, ఆఫీసు నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లలేని పరిస్థితి. అందువల్ల సాయంత్రం అటెండన్స్ వేసి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్లేసరికి సుమారు 6:30 అయింది. అప్పుడు పాప నిద్రపోతుంది. మా అత్త, "ఏడ్చి ఏడ్చి పడుకుంది. ఏమీ తినలేదు" అని చెప్పారు. అర్థగంట తర్వాత పాప నిద్రలేచింది. చూస్తే, తన తలకి బాగా దెబ్బ తగిలి, వాపు వచ్చి ఉంది. నేను, "ఎలా జరిగింది?" అని అడిగితే, 'ఎవరో బైక్ మీద వచ్చి గుద్దారని, చుట్టుపక్కల వాళ్లందరూ అతన్ని పట్టుకుని గట్టిగా అడిగేసరికి అతనే పాపని దగ్గర్లో ఉన్న డాక్టరుకి చూపించి తిరిగి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపారని' మా అత్త చెప్పింది. మేము అలా మాట్లాడుతుండగానే పాప వాంతి చేసుకుంది. తలకి దెబ్బ తగిలాక వాంతి అవ్వకూడదని నాకు చాలా భయం వేసింది. వెంటనే పాపని దగ్గరలో వున్న డాక్టరుకి చూపిస్తే, "ఇంకోసారి ఇలా వాంతి అయితే వెంటనే CT స్కాన్ చేయించండి" అని మందులు వ్రాసిచ్చారు. అయితే హాస్పిటల్ నుండి బయటకు వచ్చామో, లేదో పాపకి వాంతి అయింది. ఇంకా నేను, "వెంటనే CT స్కాన్ చేయించాలి" అని మావారితో అన్నాను. అందుకాయన, "ఈ సమయం(రాత్రి 8:15)లో స్కాన్ అంటే కుదరదు. ముందుగా అప్పోయింట్మెంట్ తీసుకోవాలి" అని అన్నారు. ఆ సమయంలో నాకు ఏమీ గుర్తు రాలేదు కానీ, నా ఫ్రెండ్ ఒకామె ఏఎన్ఎంగా పని చేస్తుంది. ఆమె భర్త కూడా హాస్పిటల్లో పని చేస్తాడు. మావారు, "వాళ్లను ఒకసారి కనుక్కో" అన్నారు. నేను వెంటనే నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. తను అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. తనకి విషయం చెపితే, "ఇక్కడ 24/7 స్కానింగ్ చేస్తారు. రేషన్ కార్డు తీసుకుని వస్తే, 50% రాయితీ ఇస్తార"ని చెప్పింది. దాంతో మేము ఆ హాస్పిటల్‌కి వెళ్ళాము. వాళ్ళు స్కాన్ చేసి, "పాపకి సీరియస్‌గా ఉంది. వెంటనే అడ్మిట్ చేయాలి" అన్నారు. నేను ఆ మాటను అస్సలు ఊహించలేదు. నార్మల్‌గా ఉంది, ఇంటికి వెళ్ళవచ్చు అంటారు అనుకున్నాను. అలాంటిది అలా చెప్పేసరికి నాకు ఏడుపు ఆగలేదు. వాళ్ళు పాపని అడ్మిట్ చేసుకుని, సెలైన్ పెట్టి ఏవో ఇంజెక్షన్లు ఇవ్వసాగారు. నాకు కంటి మీద నిద్ర అనేది లేదు. "పాపకి ఏమీ కాకూడదు" అని బాబాని తలచుకుంటూ ఊదీ పాపకు పెట్టాను. అర్ధరాత్రి పాప లేచి బాత్రూమ్కి అంటే, తీసుకెళ్ళాను. అక్కడ పాప మళ్ళీ వాంతి చేసుకుంది. నేను, "బాబా! పాపకి ఏం కాకూడదు" అని గట్టిగా అరిచేసాను. వెంటనే నర్స్ వచ్చి పాపకి సెలైన్ పెట్టింది. నేను, "పాపకి తగ్గిపోయి నార్మల్ అయితే శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను బాబా" అని బాబాకి మొక్కుకున్నాను. మేము 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాక చీఫ్ డాక్టర్ వచ్చి, "పిల్లల్ని ఇలాగేనా చూసుకునేది. ఇంకొంచెం దెబ్బ తగిలితే పిల్ల ప్రాణం పోయేది. ఇది చిన్న దెబ్బ అయిన బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయింది. కానీ త్వరగా తగ్గిపోతుంది లెండి" అని రెండురోజుల తర్వాత డిశ్చార్జ్ చేసారు. కానీ మందులు వాడుతూ మధ్యలో ఎప్పుడైనా తలనొప్పి, వాంతులు, జ్వరం వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్‌కి రండి అని అన్నారు. బాబా దయవల్ల పాప పూర్తిగా కోలుకొని మళ్ళీ మామూలుగా స్కూలుకి వెళ్ళసాగింది . ఇదంతా బాబా కృపేనని నేను బలంగా నమ్ముతున్నాను. నేను చేసిన పూజల ఫలితం, మా బాబా మీద పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదు. చాలామంది, 'ఎన్ని పూజలు చేసినా ఏమీ కాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఇలా చేయాలి' అని అనుకుంటుంటారు.
కానీ మనం దైవానికి చేసే పూజలు ఎప్పటికీ వృధా కావు. ఆ పూజల ఫలితం మనల్ని, మన కుటుంబసభ్యుల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఇది నా విషయంలో ఋజువు అయింది. "ధన్యవాదాలు బాబా. నన్ను, నా కుటుంబసభ్యుల్ని ఎప్పుడూ ఇలానే కాపాడుతూ ఉండండి సాయీ".
ఇప్పుడు చెప్పబోయే అనుభవం బాబా ఊదీ మహిమకు సంబంధించినది. మా అమ్మ ఆస్తమా, బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతుంది. ఒకసారి నేను, నా భర్త, మా అమ్మ, నా అక్కాచెల్లెళ్లు(మేము ఐదుగురు అక్కచెల్లెలం) కలిసి అరుణాచలం, కంచి దైవ దర్శనానికి వెళ్ళాము. అప్పుడు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంది. లైన్లో వెళ్తున్నప్పుడు రద్దీ కారణంగా మా అమ్మ గాలి ఆడక ఇబ్బందిపడసాగింది. అందువల్ల నేను, నా సోదరి ప్రియాంక మా అమ్మతో ఉండగా నా భర్త, మిగతా సిస్టర్స్ ముందు వెళ్తున్నారు. చాలా జనం మమ్మల్ని తోసుకొని వెళ్లిపోతున్నారు. అమ్మ రెండు, మూడు సార్లు గాలి ఆడక ఇబ్బందిపడ్డాక తను ఇంక తట్టుకోలేకపోయింది. ఇక అప్పుడు నేను అమ్మని ఒక దగ్గర కూర్చోబెట్టి నాతో తెచ్చుకున్న బాబా ఊదీ తన నోట్లో వేసి, నీళ్ళు తాగించాను. నుదిటి మీద కూడా ఊదీ పెట్టి బాబాని తలచుకుని, "అమ్మకి బాగా అవ్వాల"ని కోరుకుంటూ అమ్మకి గాలి ఆడేలా ప్రయత్నించాను. కాసేపటికి అమ్మ కోలుకుని మామూలుగా అయ్యింది. బాబా దయవలన దర్శనం చాలా బాగా జరిగింది. మేము తిరిగి ఇల్లు చేరుకున్నాక అందరం అలసిపోయి పడుకుండి పోతే మా అమ్మ మాత్రం ఏ మాత్రం అలసట లేకుండా అందరికీ వంట చేసి పెట్టింది. మేము లేచి చూసేసరికి వంట చేసేసింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, తను ఎప్పుడు ఏ ప్రయాణం చేసినా అలసిపోయి పడుకునేది. అలాంటిది అమ్మ ఉత్సాహంగా ఉండడం చూసి మేము అందరం ఎంతో సంతోషించాము. అమ్మ ఉత్సాహానికి కారణం బాబా ఊదీ మహిమ కాక మరేంటి? బాబాకి మేము ఋణపడి ఉంటాం.

Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteOm Sai Ram
Om Sai Ram
Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDelete