ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఊదీ పరమ ఔషధం
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు రమాదేవి. ఈ బ్లాగు ఆధునిక సచ్చరిత్ర. నేను ఈరోజు బాబా దయతో కొన్ని ఊదీ మహిమలు పంచుకుంటున్నాను. ఒకరోజు మా పిల్లలిద్దరూ బాడ్మింటన్ ఆడుకుంటున్నప్పుడు బాబు కంటికి కాస్త దగ్గరగా బ్యాట్ తగిలింది. వెంటనే వాపు, నొప్పితోపాటు కన్ను ఎర్రగా మారింది. ఆఫీసులో ఉన్న నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పారు. వాళ్ళ దగ్గర ఊదీ లేనందున నేను, "బాబు కంటికి ఏం అవకూడదు" అని బాబాని వేడుకొని నా కంటి దగ్గర ఊదీ రాసుకున్నాను. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి బాబు కంటి దగ్గర వాపు, ఎర్రదనం తగ్గిపోయాయి. ఇంకోసారి స్కిప్పింగ్ వలన బాబుకి వీపు నొప్పి వచ్చింది. వాడు నొప్పికి తట్టుకోలేక బాధడ్డాడు. కానీ, చిన్న పిల్లాడికి నొప్పి మాత్రలు ఇవ్వలేని పరిస్థితి. అందుకని బాబుతో, "బాబాకి చెప్పుకో, తగ్గుతుంది" అని చెప్పి ఊదీ రాస్తూ, కొద్దిగా ఊదీ నీళ్లలో కలిపి ఇస్తుంటే ఆ నొప్పి తగ్గిపోయింది.
ఈమధ్య మా బాబుని తన స్కూలువాళ్ళు పిక్నిక్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వచ్చిన తరువాత తనకి జలుబు, జ్వరం మొదలయ్యాయి. నేను మొదట రెండు రోజుల్లో తగ్గిపోతుందని టాబ్లెట్ వేసి ఊరుకున్నాను. కానీ 3వ రోజుకి ఇంకా ఎక్కువ అయింది. డాక్టరుకి చూపిస్తే, టాబ్లెట్లు, ఇంజక్షన్ ఇచ్చారు. అయినా బాబుకి తగ్గలేదు. వాడు ఏం తినకుండా అలాగే ఉండిపోయాడు. అప్పుడు నేను, మా పాప బాబుకి తగ్గితే నామజపం చేస్తానని మొక్కుకొని ఊదీ ఇస్తే, రెండు రోజులలో తగ్గిపోయింది. అయితే తరువాత వారంలో నాకు, మా పాపకి కూడా జ్వరం, జలుబు వచ్చాయి. మందులు తీసుకోవడంతోపాటు ఊదీ వాడుతూ, బాబా నామజపం చేస్తుంటే మేమిద్దరం జ్వరం నుండి బయటపడ్డాము.
"చాలా ధన్యవాదాలు బాబా".
బాబు జ్వరంతో బాధపడుతున్న సమయంలోనే మా పాప పుట్టినరోజు వచ్చింది. నిజానికి తను ఈసారి పుట్టినరోజు బాగా చేసుకోవాలని అనుకుంది. కానీ తమ్ముడికి జ్వరమని మమ్మల్ని ఏమీ అడగలేదు. "బాబా ఏది అనుకుంటే, అదే చేయని, నాకేం బాధ లేదు" అని అంది. నాకు మాత్రం సాయంత్రం వరకు బాధగా ఉండింది. అయితే బాబా ప్లాన్ వేరేలా ఉంది. మా పాప డాన్స్ నేర్చుకుంటుంది. తనకి ఆ రోజు క్లాసు లేదు కానీ, వాళ్ళ టీచర్ ఎక్స్ట్రా క్లాస్ పెట్టింది. ఆమె, క్లాస్ పిల్లలు కేక్ తెప్పించి మా పాప బర్త్ డే చేసారు. పాప చాలా సంతోషపడింది. ఇంట్లో చేసినా నేను ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదని బాబాకి థాంక్స్ చెప్పింది. టీచర్ ఎక్స్ట్రా కాల్స్ పెట్టడం, బర్త్ డే చేయడం బాబా దయకాక మరేంటి? బాబా ఊహించని విధంగా తన బిడ్డల్ని సంతోషపెడతారు. "శతకోటి నమస్కారాలు బాబా".
ఒకసారి వారం రోజులు నా కళ్ళు దురదగా, మంటగా ఉంటుండేవి. నేను పని ఒత్తిడి వల్ల డాక్టరుని సంప్రదించలేక ఊదీ రాస్తూ ఉంటే, నెమ్మదిగా తగ్గిపోయింది. ఇంకోసారి ఎక్కువ రోజులు జలుబుతో బాధపడటం వలన ముక్కు లోపల పుండు అయి చాలా నొప్పిగా ఉండేది. అప్పుడు ఊదీ రాస్తూ, సేవిస్తూ ఉంటే క్రమంగా ఆ బాధ తగ్గిపోయింది. ఇంకోసారి నా కాళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా దురదగా మంటగా ఉంటూ మచ్చలు పడిపోయాయి. 4 నెలల కాలం ఇబ్బంది పడ్డాను. క్రీమ్ రాసిన తగ్గలేదు. అప్పుడు బాబాని వేడుకొని ఊదీ రాస్తూ ఉంటే క్రమంగా ఇన్ఫెక్షన్ తగ్గింది, మచ్చలు లేకుండా పూర్తిగా తగ్గిపోయాయి. మరొకరోజు ఆఫీసులో నా కాలికి టేబుల్ తగిలి చాలా నొప్పి పెట్టింది. ఉపశమనం కోసం ఏదో క్రీమ్ రాసినప్పటికీ వారం రోజులు నొప్పి, వాపు అలాగే ఉన్నాయి. బాబా ఊదీ మహిమ తెలిసి కూడా మాయలో పడటం అంటే అదేనేమో! ఒక్కసారి కూడా బాబా ఊదీ రాయలేదు. వారం రోజుల తర్వాత ఒకరోజు ఊదీ రాయలేదని గుర్తొచ్చి 2 రోజులు రాసాను. అంతే! నొప్పి చేత్తో తీసేసినట్టు తగ్గిపోయింది. ఒకసారి నా కాలు చీలమండల దగ్గర నొప్పి పెట్టి నడవడం ఇబ్బంది అయింది. బాబా గుడికి వెళ్ళినపుడు ఊదీ లభ్యంకాక అక్కడున్న అగరబత్తీల బూడిద రాస్తే, నొప్పి తగ్గిపోయింది. ఇంకోరోజు బరువు ఎత్తడం వలన నా మెడ, వీపు పట్టేసి నొప్పి చాలా.ఎక్కువగా ఉండింది. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. అసలు తగ్గుతుందా, ఇది ఏమైనా డిస్క్ ప్రాబ్లం అవుతుందా అని భయపడ్డాను. బాబా గుడికి వెళితే ఊదీ లభించలేదు. అక్కడున్న అగరబత్తీల బూడిద ఊదీ మంత్రం పఠిస్తూ రెండు రోజులు రాసాను. అద్భుతంగా టాబ్లెట్లకి తగ్గని నొప్పి తగ్గిపోయింది. బాబా ఊదీ పరమ ఔషధం. చిన్న, పెద్ద ఎన్ని చెప్పను ఊదీ మహిమలు. ఎన్ని చెప్పినా తక్కువే! "ధన్యవాదాలు బాబా".
నేను గత కొంతకాలంగా నెలసరి సమస్యతో బాధపడుతున్నాను. దానికోసం హార్మోన్ టాబ్లెట్ వాడాను. వాటి సైడ్ ఎఫెక్ట్స్ వలన కడుపులో నొప్పి, నాభి చుట్టు నొప్పి, వాపుతో 2 నెలలు బాధపడ్డాను. అప్పుడు బాబానే దిక్కు అని నొప్పి తగ్గిపోవాలని ప్రార్థించి మందులతోపాటు ఊదీ తీసుకున్నాక ఉపశమనం దొరికింది. కానీ నా నెలసరి సమస్య అలాగే ఉంది. అప్పుడు, "బాబా! మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏదో ఒక దారి చూపు బాబా" అని బాబాను వేడుకున్నాను. తర్వాత ఒకరోజు యూట్యూబ్లో చూస్తుంటే, హోమియోలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నా సమస్య నయమవుతుందని తెలిసింది. దగ్గరలో ఒక మంచి హోమియో డాక్టర్ ఉన్నారని తెలిసి వెళ్ళాను. ఆశ్చర్యం ఏంటంటే, ఆ క్లినిక్ పేరు 'సాయి' పేరుతో ఉంది. బాబానే నాకు ఈ మార్గం చూపెట్టారని సంతోషపడ్డాను. పిలిస్తే పలికే దైవం బాబా. సాయి బంధువులారా! సిల్లీ విషయాలన్ని చెప్పాలా అనుకోకండి. ఆ నిమిషంలో మనకి వచ్చిన సమస్య చాలా పెద్దగా అనిపించి సతమతమవుతాం. బాబా దయతో మన బాధలు తీరుస్తూ ఉంటారు. ఆ ప్రేమను పంచుకోవటానికి ఆలోచించక్కర్లేదని నా అభిప్రాయం. "శతకోటి నమస్కారాలు బాబా. మా వెన్నంటి ఉండి రక్షించండి బాబా. సదా మీ పాదాలు విడవకుండా ఉండే శక్తిని ఇవ్వండి తండ్రీ".

OM sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete