1. బాబా దయ
2. ఆపద్బాంధవుడు సాయిబాబా
బాబా దయ
నా పేరు తేజశ్రీ. మేము బెల్జియంలో వుంటాము. ఇక్కడ ఉండటానికి ఐడి కార్డు తప్పనిసరి కాగా నా ఐడెంటిటీ కార్డు ఎక్సపైర్ అయ్యింది. దానికోసం అప్లై చేసినప్పటికీ నాకు, నా భర్తకి ఉద్యోగం లేని కారణంగా కార్డు రావడానికి చాలా కష్టమైంది. నాకు వస్తుందో, రాదో అని భయమేసి, "బాబా! మీ దయవల్ల నాకు ఐడి కార్డు రావాలి" అని బాబాకి చెప్పుకున్నాను. ఆ తరువాత కొన్ని రోజులకి బాబా దయవల్ల మేము చేసిన ప్రయత్నాలు ఫలించి కార్డు వచ్చింది. అయితే అది షార్ట్ టర్మ్ ది. అదైనా వచ్చినందుకు సంతోషించాను. "థాంక్యూ వెరీ మచ్ బాబా".
ఒకసారి మేము ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తికి 'టీబీ' వచ్చిందని అందరికీ టెస్టులు చేయడానికి వచ్చి శాంపిల్స్ తీసుకున్నారు. వాళ్ళు టెస్టు చేసిన మూడురోజులకు శరీరం మీద నీటి బుడగలు వస్తే, పాజిటివ్ అని అన్నారు. వాళ్ళు చెప్పినట్లే మావారి శరీరం మీద నీటి బుడగలా వచ్చింది. పైగా ఆయనకి దగ్గు కూడా వస్తుంది ఆ సమయంలో. అందువల్ల నాకు చాలా భయమేసింది. రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టలేదు. 'మాకు ఇక్కడ ఎవరూ తెలీదు. మావారికి పాజిటివ్ వస్తే, పిల్లలతో ఎలా వుండాలని' నాకు బాధేసింది. అయితే నీటి బుడగ వచ్చినంత మాత్రాన పాజిటివ్ కాదు, ఎక్స్-రేలో కూడా నిర్ధారణ అయితేనే ప్రమాదమని అన్నారు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల నా భర్తకి ఇన్ఫెక్షన్ లేదని, అలాగే మా అందరికీ కూడా నెగిటివ్ రావాల"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల మా అందరికీ నెగెటివ్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా".
ఒకరోజు నేను ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తుంటే, హఠాత్తుగా వీడియో నెమ్మదిగా రావడం మొదలైంది. అప్పటివరకు బాగానే వస్తున్నది అకస్మాత్‌గా ఎందుకలా వస్తుందో అని లాప్టాప్ రీస్టార్ట్ చేసాను. అయినా వీడియో నెమ్మదిగా వస్తుంది. అందుకని మరల రీస్టార్ట్ చేశాను. ఈసారి లాప్టాప్ ఆన్ కూడా కాలేదు. దాంతో నా భర్త ఏమంటారోనని భయమేసి, "బాబా! మీ దయవల్ల ఇది ఆన్ అవ్వాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల వెంటనే లాప్టాప్ ఆన్ అయింది. "ధన్యవాదాలు బాబా. చాలా ధన్యవాదాలు సాయి".
మేము వుండే ఇంట్లో సింక్ తోపాటు చాలా సమస్యలు వచ్చాయి. ఆ కారణంగా 2025, మూడో వారంలో మమ్మల్ని వేరే ఇంటిలోకి ఒక వారంలోపు మారమన్నారు. కానీ మేము పంతులిని అడిగితే, "ఈ వారం అస్సలు మారకండి. వచ్చే బుధవారం మారండి" అన్నారు. ఆ విషయం చెప్పినా ఇక్కడ బెల్జియంవాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అలాంటివి నమ్మరు. మాకు ఏం చేయాలో అర్థంకాక చాలా భయం, బాధ కలిగాయి. నేను బాబాని, "మీ దయవల్ల వాళ్ళు మమ్మల్ని బుధవారం వరకు వెళ్ళమనకుండా చూడండి బాబా" అని వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు వచ్చి వెళ్ళమని మాతో చెప్పలేదు. అందువల్ల ఏ ఇబ్బంది లేకుండా బుధవారమే వేరే ఇంటికి మారాం. "చాలా ధన్యవాదాలు బాబా. ఇదంతా మీ దయవల్ల సాధ్యమైంది".
ఆపద్బాంధవుడు సాయిబాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక బాబా భక్తురాలిని. అమెరికాలో ఉంటున్న మా పాప గర్భిణిగా ఉండడం వలన నేను తన వద్దకి వెళ్లాల్సి వచ్చింది. అయితే నేను ఒక్కదాన్నే వెళ్లాల్సిన పరిస్థితి కావడంతో నాకు కొంచెం భయమేసింది. అందువల్ల బాబాకి నమస్కరించి, "సప్తాహ పారాయణం చేస్తాను" అని అనుకొని పూర్తిగా భారం ఆయనపై వేసి ప్రయాణమయ్యాను. బాబా దయవలన ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా పాప దగ్గరకి చేరుకున్నాను. తరువాత సప్తాహ పారాయణం పూర్తి చేశాను. బాబా దయవల్ల పాపకి కాన్పు అయి చక్కటి బాబు పుట్టాడు. మేము బాబుకి 'బాబా' పేరుతో కలిపి పేరు పెట్టుకున్నాము. ఇకపోతే, డాక్టర్ బాబు గుండె సవ్వడి వేరుగా వస్తుందని చెప్పారు. నాకు చాలా భయమేసి, "బాబా! మీ దయవల్ల బాబు రిపోర్టులన్నీ నార్మల్ రావాలి" అని చెప్పుకొని, ప్రతిరోజూ బాబా ఊదీ బాబు పొట్టకి రాస్తూ దణ్ణం పెట్టుకుంటుండేదాన్ని. వారం తర్వాత బాబుని చెకప్‌కి తీసుకెళ్తే, బాబా దయవల్ల "గుండె సవ్వడి నార్మల్ ఉంద"ని డాక్టర్లు చెప్పారు. వాళ్ళు మరోసారి చెకప్‌కి వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేద్దామన్నారు కానీ, అప్పుడు కూడా నార్మల్ వస్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. "శతకోటి ధన్యవాదాలు బాబా. మమ్మల్ని చల్లగా చూడు సాయినాథా".
నేను సాయిబాబా వచనాలను స్టేటస్ గా పెట్టుకుందామంటే అది రావటం లేదు ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే మమ్మల్ని అందులో ఆడ్ చేయగలరు
ReplyDeleteOm sai ram tandri amma nannalani Ammamma tatayani ayur arogyalatho anni velala kshamam ga kapadandi tandri vaalla purti badyata meede, naaku manchi arogyanni echi nenu velle parayanam lo ye ibbandi lekunda kapadandi tandri pls, ofce lo ye problem lekunda anta manashanti ga unde la chusukondi baba, neeve ma dikku tandri anni vishayalalo
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteBaba, naku tana valla, tana matareeru valla chala ibbandi ga undi, talaneppi vastondi, depression, pressure ki guravutunnanu baba.. Kashtam ga undi, tanatho nenu poradalenu.. emi cheyalekunnanu, swetcha ni kolpoyanu.. ninnu manasara sevinchukolekapotunnanu 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲neetho tappa evarithonu cheppukolenu, Ela baba ee samasya Ela parishkaramautundi, naku manashanti kavali baba🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲 kapadu 🙏🙏🙏🙏🙏saranu saranu Raksha sai
ReplyDelete