సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2021వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీసాయి అనుగ్రహ లీలలు - 37వ భాగం

నా పేరు సాయిబాబు. 60 సంవత్సరాలుగా నేను చేస్తున్న పూజల ఫలితంగా బాబా నాకు కొన్నిరకాలుగా సహాయం చేస్తున్నారు. మాకు తెలిసిన కొంతమంది కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. అది నాకు తెలిసి నేను వాళ్ళచేత రోజూ బాబాకి పూజ చేయిస్తూ, వాళ్ళ తరఫున నేను బాబాని వాళ్ళ సమస్యలకి పరిష్కారం అడుగుతుంటాను. బాబా నా ప్రశ్నకి ఫేస్బుక్, టీవిలో వచ్చే స్క్రోలింగ్స్, ఒక్కోసారి దివ్య ప్రేరణ కలిగించడం ద్వారా ఖచ్చితమైన సమాధానం ఇస్తుంటారు. బాబా ఇచ్చే ఆ సందేశాలు ఎవరి సమస్యలకు పరిష్కారమన్నది నాకు తెలుస్తుంది. నేను వారికి ఆ మెసేజ్ పంపుతాను. తూచతప్పకుండా పాటించడం వల్ల వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఆవిధంగా బాబా వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు.


ఒకసారి ఊరిలో నాకు తెలిసిన కుటుంబం వారి ఇంట ఖాళీ స్థలంలోకి వారం రోజులు రెండు పాములు వస్తుంటే వాళ్ళకి భయమేసి ఆ విషయం నాతో చెప్పి, "ఏం చేయమంటారో చెప్పమని బాబాని అడగండి" అని అన్నారు. సరేనని నేను బాబాని అడిగాను. వాళ్ళు మొదటినుండి పొలంలో, ఇంట్లో పూజ దగ్గర బండారు(అమ్మవారి గుడిలోని పసుపు, కుంకుమ) పెట్టుకుంటారు. మర్నాడు ఆ పసుపు, కుంకుమ కలిపి ఒక బాక్స్‌లో వుంచుతారు. దాన్ని ఊదీతో కలిపి రోజూ కొద్దిగా బొట్టు పెట్టుకుంటారు. వారానికి ఒకసారి పొలంలో పంట మీద చల్లుతారు. దాన్నే పాములు వచ్చే చోట జల్లమని బాబా నాకు ప్రేరణనిచ్చారు. అదే విషయం నేను వాళ్ళకి చెపితే, వాళ్ళు వెంటనే అలా చేశారు. అంతే, ఆ రోజు నుండి పాములు రాలేదు. "బాబాకి కృతజ్ఞతలు".


ఈమధ్య నాకు తెలిసిన ఒక ఆమె ఒంటరిగా ఏదో పనిమీద గుంటూరు వెళ్ళింది. అక్కడ ఆలస్యమై తిరిగి వచ్చేపాటికి చీకటి పడసాగింది. ఆమెకి భయమేసి నాకు ఫోన్ చేసి, "బాబాని తోడు పంపరా! నాకు భయంగా ఉంద"ని చెప్పింది. నేను వెంటనే ఆ  విషయం బాబాతో విన్నవించుకున్నాను. అంతలో ఫేస్బుక్‌లో బాబాతోపాటు 25 ఏళ్ల వయసు గల ఒక స్త్రీ ఫోటో వచ్చింది. ఆ ఫొటోలో బాబా ఆశీర్వదిస్తూ, 'నేను ఉండగా భయమేలా?' అన్న వాక్యాలు ఉన్నాయి. నేను ఆ మెసేజ్ ఆమెకు పంపాను. ఆమె ఆ మెసేజ్ చూసి, "బాబాకి ధన్యవాదాలు చెప్పండి. ఇప్పుడు నాకు భయం లేదు. బాబా తోడు ఉన్నారు" అని బదులిచ్చింది. ఆమె ఇంకోసారి 10 మంది రైతులతో కలిసి తన తండ్రి పొలంలో పండిన మిర్చి బస్తాలు విక్రయించడానికి ఆంధ్ర నుండి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్తున్నారని, మిర్చి బస్తాలకు మంచి ధర పలికేలా చూడమని బాబాకి చెప్పండని నాకు మెసేజ్ పెట్టింది. నేను ఆ విషయం బాబాకి విన్నవించాను. బాబా విన్నారు. వారం తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి, "బాబాకి ధన్యవాదాలు చెప్పండి. బాబా అందరికంటే క్వింటాలకు 500 రూపాయలు ఎక్కువ ఇప్పించారు. వెళ్లిన పదిమందిలో మా నాన్నకు మాత్రమే ఆ ధర నిర్ణయించారు. ఇది బాబా చలువ" అని చెప్పింది. ఇలా బాబా అనుగ్రహం ఉంటూనే ఉంటుంది. దాన్ని పొందిన వాళ్ళు బాబా భక్తులు కాకుండా ఎలా ఉండగలరు?


మా కుటుంబమంతా శిరిడీలో ఉంటుండగా మా అల్లుడు ఒక్కడే బెంగళూరులో ఉంటున్నాడు. ఒకరోజు నేను బాబాని, దయచేసి మా అల్లుడికి ఎప్పుడూ తోడుగా ఉండండి అని ప్రార్థించాను. బాబా మా ప్రార్థనను విని కింది సందేశం పంపారు. 


🔥సాయి వచనం:- 'నా భక్తుడు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, లోపల, వెలుపల ఎప్పుడూ అతడితోనే ఉంటాను.'


2025, జూలైలో ఒకరోజు ఉదయం నేను, మా అమ్మాయి శిరిడీలో బాబా మాకు ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎప్పుడు బాబా అనుమతి ఇస్తారో, అలాగే అందుకు అవసరమైన డబ్బు సమకూరుస్తారో అని అనుకున్నాం. పది నిమిషాల తర్వాత నేను నా మొబైల్లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, "మీరు త్వరగా ఇల్లు నిర్మించండి. నేను వచ్చి అందులో ఉంటాను". "మీకు ధన సహాయం వెంటనే అందుతుంది" అని రెండు మెసేజ్లు వచ్చాయి. ఇదే నెలలో ఒకరోజు మా అమ్మాయి బాబా దర్శనం కోసం మందిరంకి వెళ్లలేదు. మర్నాడు ఉదయం, "నీవు దర్శనానికి రాలేదని చింతించవద్దు. నేనే నీ దగ్గరకు మీ ఇంటికి వస్తున్నాను" అని బాబా మెసేజ్ ఫేస్బుక్‌లో వచ్చింది. అదేరోజు మధ్యాహ్నం మా అమ్మాయి నిద్రపోతే, కలలో బాబా దర్శనమిచ్చి మాట్లాడారు. బాబా మాట తప్పరు కదా! అదే నెలలో నేను కూడా రెండు రోజులు బాబా మందిరంకి వెళ్ళలేదు. మూడోరోజు నేను ఒక్కడినే దర్శనానికి వెళ్లాను. తర్వాత బాబా "నువ్వు దర్శనానికి వచ్చావా? నేను నీకు రుణపడి ఉన్నాను. నేనే నీ వద్దకు రావాలి" అని ఫేస్బుక్‌లో మెసేజ్ వచ్చింది. అది యాదృచ్చికం కాదని సమయానికి బాబానే పంపించారని గ్రహించండి.


శిరిడీలోని మేముంటున్న ఇంటిలో నేలపై గ్లాస్ టైల్స్ ఉన్నాయి. వాటిపై 2025, జూన్ మొదటివారంలో వర్షపు జల్లు పడింది. అది తెలియని నేను ఆ తడి మీద అడుగులు వేసి కాలు జారి 'బాబా' అంటూ కిందపడ్డాను. ఆ ప్రమాదకర సంఘటనలో నా ఎముకలు ఫ్రాక్చర్ అయి ఉండాలి. కానీ బాబా దయవల్ల అటువంటిదేమీ జరగలేదు. తుంటి ఎముక మాత్రం బాగా నొప్పి పెట్టింది. నేను ప్రతిరోజూ ఆయిల్, అలోవెరా జెల్ ఒక నెలరోజులపాటు రాసినా ఆ నొప్పి తగ్గలేదు. అప్పుడొకరోజు సాయంత్రం పూజ చేసేటప్పుడు వెలిగించిన అగరబత్తీల పొడిని(ఊదీ) రాత్రి నిద్రించేముందు రాసుకోవాలన్న ప్రేరణ కలిగింది. అది బాబా ఇచ్చిన ప్రేరణగా భావించి అలాగే చేశాను. అంతే! నెలరోజులుగా తగ్గని నొప్పి 3 రోజుల్లో మటుమాయం అయింది. ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


5 comments:

  1. Om Sai Ram.If we trust n love the Baba without anydoubt.He will be always with Us to protect in any situation.

    ReplyDelete
  2. Om sai ram, me challani daya thodu yeppudu naatho kuda unchandi tandri, amma nannalani Ammamma tatayani ayur arogyalatho anni velala kshamam ga chusukondi baba vaalla purti badyata meede, naaku manchi arogyanni echi ofce lo ye problem rakunda chusukondi baba, Migilina problems kuda twaraga solve chayandi baba, neeve ma dikku tandri.

    ReplyDelete
  3. Omsrisaiaarogyaskymadayanamah

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయిరాం, బాబా నాకు త్వరగా ఆఫర్ లెటర్ ఇప్పించండి.
    ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo