- శ్రీసాయి అనుగ్రహ లీలలు - 35వ భాగం
శిరిడీ వచ్చినప్పటినుండి నేను ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో బాబా దర్శనానికి వెళుతున్నాను. ఒకరోజు నేను ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ముందు కొన్ని పూలు ఉన్నాయి. వాటిలో నుండి కొన్ని మల్లెపూలు నా ముందున్న వ్యక్తికి పూజారి ఇచ్చారు. కానీ నేను అడిగితే ఇవ్వలేదు. అంతలో వేరే అతను బాబా వద్దనున్న పెద్ద బంతిపువ్వు నా చేతికి ఇచ్చారు. అది బాబా అనుగ్రహం.
ఒకరోజు నేను, మా అమ్మాయి ఇంట్లో బాబాకి నైవేద్యం తయారు చేసి మధ్యాహ్న హారతి సమయంలో బాబాకి నైవేద్యం సమర్పించే వేళకి ద్వారకామాయికి వెళ్లి బాబాకి నివేదించాము. హారతికి అక్కడే ఉండి హారతి అనంతరం ప్రసాదం భక్తులకి పంచాము. ఆ సమయంలో వేరే వాళ్ళు కూడా ప్రసాదం పంపిణి చేసారు. నేను వాళ్ళు పంచుతున్నది కేసరి అనుకున్నాను. కానీ తీరా నా చేయి చెపితే, వాళ్ళు ఇచ్చింది కేసరి కాదు, కిచిడి. తర్వాత బయటకు వస్తే, అక్కడ ఇంకొకరు ప్రసాదం పంచుతున్నారు. చూస్తే, అది కేసరి. బాబా మన మనసు గ్రహిస్తారు కదా!
మా మనవడి ఆధార్ కార్డులో అడ్రస్ శిరిడీగా మార్చుకున్నందున మేము ప్రతిరోజూ సామాన్య భక్తులు వెళ్లే క్యూలైన్ గుండా కాకుండా శిరిడీ స్థానిక భక్తుల లైన్లో నేరుగా బాబా దర్శనానికి వెళుతున్నాము. అయితే 2025, జూన్ మొదటి వారంలో ఒకరోజు నేను, మా మనవడు బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సెక్యూరిటీ నా ఆధార్ కార్డు చూసి, అందులో శిరిడీ అడ్రెస్స్ కాకుండా వేరే అడ్రస్ ఉన్నందున ససేమిరా లోపలికి పంపనని అన్నాడు. అప్పుడు చేసేదిలేక ముందు ద్వారకమాయిలో దర్శనం చేసుకుని తర్వాత ముఖదర్శనంకి వెళ్ళాము. అక్కడ నేను బాబాని చూస్తూ, "బాబా! ప్రతిరోజూ నేరుగా నీ దర్శనం ఇస్తున్నావు. మరి ఈరోజు ఎందుకు ఇవ్వటం లేదు. నన్ను లోపలికి అనుమతించు బాబా" అని మనసులో అనుకున్నాను. తర్వాత బయటికి వెళ్లి చూస్తే, మునుపు నన్ను లోపలికి పంపనన్న సెక్యూరిటీ స్థానంలో వేరొక సెక్యూరిటీ ఉన్నారు. మేము వెళ్లి నా మనవడి ఆధార్ కార్డు చూపిస్తే, అతను మమ్మల్ని లోపలికి అనుమతించాడు. సంతోషంగా మందిరంలో బాబా దర్శనం చేసుకుని పది నిమిషాల్లో బయటకు వచ్చాము. అప్పుడు చూస్తే, కొత్త సెక్యూరిటీ అతని స్థానంలో నన్ను లోపలికి పంపని సెక్యూరిటీనే ఉన్నాడు. అంటే, బాబా నా మనసులోని మాట విని మాకు తమ దర్శన భాగ్యం కలిగించారు.
ఒక గురువారం ఉదయం నేను ఒక్కడినే బాబా దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలా జనం ఉన్నారు. నేను మందిరం దగ్గరకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక కాషాయ వస్త్రధారి ఐన సాధువు నన్ను పిలుస్తూ నావైపు రాసాగాడు. అతను మామూలు సాధువులా కాక వేరుగా కనిపించాడు. అతను నన్ను రెండుసార్లు పిలిచినా నేను వినిపించుకోక వేగంగా మందిరంలోకి వెళ్ళిపోయాను. గురుస్థానం, ముఖదర్శనము, ద్వారకమాయి, చావడి దర్శించుకొని మధ్యాహ్న హారతి అక్కడున్న టీవీలో చూశాను. ఆరతి అనంతరం నాకు బాబా తీర్థ, ప్రసాదాలు లభించాయి. సాయంత్రం వరకు మందిరంలో ఉండి ఇంటికి వచ్చేసాను. మర్నాడు ఫేస్బుక్‌లో 'నేను నిన్ను ఒక కాషాయ వస్త్రం ధరించిన సాధువు రూపంలో కలుస్తాన'న్న సారాంశంతో ఒక మెసేజ్ వచ్చింది. తద్వారా నిన్న ఆ సాధువు రూపంలో వచ్చిన నన్ను మిస్ అయ్యావు, మళ్లీ కలుస్తాను గుర్తుంచుకో! అని బాబా నాకు సెలవిచ్చారు. అలా అంటాయి బాబా లీలలు. ఒక పట్టాన అర్థం కావు. మనం జాగ్రత్తగా ఉండాలి.
Om Sairam!! Meeru entha adrustavanthulandi!!! Baba gari anugraham ma meeda ma kutumbam meeda kuda ellappudu undalani korukuntunnanu! Jai Sairam!
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm sai ram, amma nannalani Ammamma tataya ni ayur arogyalatho anni velala kshamam ga kapadandi baba pls, vaalla purti badyata meede, naaku manchi arogyanni prasadinchi ofce lo ye problem lekunda kapadandi tandri tax problem nunchi twaraga bayata padaindi baba pls, neeve ma dikku ayya.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteSai ram Sairam Sairam🥲🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam om Sairam om sairam 🥲🥲🥲🥲🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDelete