ఈ భాగంలో అనుభవం:
- దగ్గరుండి నాన్నని కాపాడిన బాబా
సాయి బంధువులందరికీ వందనం. నేను ఒక సాయి భక్తురాలిని. 2024, డిసెంబర్ 12న పగటిపూట నాకెందుకో గుండె దడగా అనిపించింది. అదేరోజు రాత్రి 7:30కి ఎప్పటిలానే మా అమ్మతో మాట్లాడటానికి తనకి ఫోన్ చేశాను. అమ్మ ఫోన్ ఎత్తి, నాన్నకి గుండె దగ్గర నొప్పిగా ఉందని, చెకప్ కోసం హాస్పిటల్‌కి వస్తున్నామని చెప్పింది. నేను అసిడిటీ అయుంటుందిలే అనుకొని, "సరే, హాస్పిటల్ దగ్గరకి నేను వస్తానులే" అని చెప్పాను. తర్వాత నేను, మా ఆయన హాస్పిటల్‌కి వెళ్ళాము. మేము వెళ్లేసరికి డాక్టర్ ఈసీజీ తీయాలని చెప్పి, నాన్న నాలుక కింద ఏదో టాబ్లెట్ పెట్టి మాట్లాడుతున్నారు. కాసేపటికి ఈసీజీ పని చేయట్లేదని వేరే హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పారు. నాకెందుకో భయమేసింది. ఆ డాక్టర్ చెప్పిన హాస్పిటల్‌కి వెళ్తే, ఈసీజీ చేసి, సమస్య సీరియస్‌గా ఉంది, వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్లండి అని అన్నారు. నాకు ప్రపంచం ఆగిపోయినట్లనిపించింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి నాన్న నొప్పితో, వాంతులతో బాధపడుతున్నారు. డాక్టర్ ఏదో ఇంజెక్షన్ చేసి, "ఏమవుతుందో చెప్పలేము. త్వరగా పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లండ"ని చెప్పారు. నేను అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇవ్వమని వాళ్లని అభ్యర్థిస్తే, అక్కడ పనిచేసే సిబ్బంది ఒకరు అంబులెన్స్ ఏర్పాటు చేసారు. మావారు, "నేను అంతా చూసుకుంటాన"ని నాకు ధైర్యం చెప్పి అమ్మ, నాన్నని తీసుకొని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీకి బయలుదేరారు(గుండెకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ మా ఊరికి 50కి.మీ. దూరంలో ఉన్న పట్టణంలో ఉన్నాయి). నేను ఇంటికొచ్చి, "నాన్నని కాపాడమ"ని బాబాని ప్రార్థించసాగాను. కానీ నాకు ఏడుపు అస్సలు ఆగలేదు. ఎందుకంటే, మేము అప్పటికి మా అత్తగారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాము. కొంతసేపటికి నా ఫోన్లో "భయపడకు, నేను అక్కడ వుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను" అన్న బాబా మెసేజ్ కనిపించింది. నేను కళ్ళలో నీళ్లతో సాయిని తలచుకుంటూ ఉండగా మావారు దారిలో నాన్నకి CPR చేస్తూ, అంత టెన్షన్లోనూ నాన్నని మాట్లాడిస్తూ, దైర్యం చెప్తూ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే అదే సిటీలో ఉన్న మా తమ్ముడు డాక్టర్‌తో మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే డాక్టర్ నాన్నని చూసి, అత్యవసరంగా యాంజియోగ్రామ్ చేసి, హార్ట్‌లో వాల్వ్ బ్లాక్ అయిందని స్టెంట్ వేసారు. అప్పటికి రాత్రి 1:30 అయింది. డాక్టర్, "90% గండం గడిచింది. 48 గంటలు పర్యవేక్షణలో ఉంచాల"ని చెప్పారు. మర్నాడు ఉదయం నేను బయలుదేరి ఆ హాస్పిటల్‌కి వెళ్లి, ఐసీయూలో ఉన్న నాన్నను చూసి, మాట్లాడి బయటకి వచ్చాను. అక్కడున్న సిబ్బంది నన్ను కింద అంతస్థుకి వెళ్లి కూర్చుమంటే, అక్కడకి వెళ్లి కూర్చున్నాను. నాకు ఎదురుగా పెద్ద బాబా విగ్రహం ఉంది. బాబాని చూడగానే నా ప్రాణం లేచి వచ్చింది. అక్కడ బాబా, నేను తప్ప ఇంకెవరూ లేరు. ఆయన పాదాల మీద తలవంచి "నాన్నని ఆపదనుండి కాపాడమ"ని వేడుకున్నాను. తర్వాత మెట్ల మార్గంలో కిందకి దిగి వెళ్లి ఎంట్రన్స్ దగ్గర చూస్తే, అక్కడ కూడా బాబా నిలువెత్తు విగ్రహం ఉంది. బాబాకి మనసారా నమస్కరించుకున్నాను. ఇంకా నాకు బాబా నాన్నని కాపాడుతారని కొంచెం నమ్మకం కలిగింది. తర్వాత రెండు రోజులకి నాన్న కొంచెం కొంచెంగా కోలుకున్నారు. బాబా తమ మెసేజ్ ద్వారా నాకు చెప్పినట్లుగానే అక్కడుండి నాన్నని కాపాడారు. "ధన్యవాదాలు బాబా".
2025, జూలై 31న మా అమ్మానాన్న మా నాన్నగారి స్నేహితుని ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళారు. ఆ ఫంక్షన్ అయ్యాక మా ఇంటికి వస్తామని వాళ్ళు చెప్పారు. నేను వాళ్ల రాకకోసం ఎదురు చూస్తుండగా బయటకి వెళ్లిన మా ఆయన పరుగుపరుగున ఇంటికి వచ్చారు. ఆయన ఏమైందో మొదట చెప్పలేదుగానీ, నేను రెట్టించి అడిగేసరికి నాన్నకి గుండె దగ్గర నొప్పిగా ఉందని, అర్జంట్‌గా హాస్పిటల్‌కి వెళ్లాలని మా అమ్మ తనకి ఫోన్ చేసి చెప్పిందని చెప్పారు. 8 నెలలముందే గుండె సమస్య వలన స్టెంట్ వేసిన నాన్నకి మళ్ళీ ఇంతలోనే ఏమైందోనని కంగారుగా అనిపించి నాకు ఏమీ దిక్కు తోచలేదు. నేను అంతా చూసుకుంటానని మా ఆయన బయలుదేరారు. మా ఆయన వెళ్ళే లోపల అక్కడ మా నాన్నని తన స్నేహితుల బంధువులు దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అందుకని మావారు నేరుగా హాస్పిటల్‌కి వెళ్లారు. డాక్టర్ నాన్నకి నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ చేసి, గుండెకి సంబంధించిన హాస్పిటల్‌కి తీసుకెళ్లామన్నారు. మావారు అదివరకు నాన్నకి స్టెంట్ వేసిన హాస్పిటల్‌కి తీసుకెళ్తానని అన్నారు. నాకు చాలా భయమేసింది, దుఃఖం తన్నుకొచ్చింది. నాన్నని చూడాలని వెంటనే బయలుదేరాను. దారి పొడవునా బాబాని తలచుకుంటూ, 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరించుకుంటూ, "నాన్నని కాపాడమ"ని బాబాను వేడుకున్నాను. నేను వెళ్ళేసరికి నాన్నని అంబులెన్స్‌లో సిటీకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. నేను నాన్న చేయి పట్టుకుని, బాబాని కాపాడమని వేడుకున్నాను. తర్వాత నాన్నని సిటీలోని హాస్పిటల్‌కి తీసుకెళ్తే, డాక్టర్ చెక్ చేసి "రక్తం గడ్డ కట్టినట్లుంది" అని ఇంజక్షన్ చేసి పర్యవేక్షణలో ఉంచాలన్నారు. బాబా దయవల్ల కొద్దికొద్దిగా రక్తం గడ్డ కరగడం ప్రారంభించింది. మర్నాడు అంజియోగ్రామ్ చేసి, అంత చెక్ చేసి, "అంతా క్లియర్ గా ఉంది. సమయానికి తీసుకొచ్చినందువల్ల ప్రాణాపాయం తప్పింద"ని చెప్పారు. "ధన్యవాదాలు సాయీ. ఇక మీదట అమ్మ, నాన్నకి ఎటువంటి ఆపద రాకుండా నువ్వే కాపాడు బాబా. నిన్నే నమ్ముకున్నాము. నిన్నే హృదయంలో నిలుపుకొని, మీ నామస్మరణ చేస్తున్నాను. శరణు బాబా. నీ అనంతమైన ప్రేమ, దయ, జాలి మాపై కురిపించు దేవా. నిత్యం నన్ను, నా పుట్టింటివారిని, మెట్టినింటివారిని సంరక్షిస్తూ ఉండండి. మీ చల్లని చూపు మీ బిడ్డలందరిపైన ప్రసరించు తండ్రీ".
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm sai ram tandri, amma nannalani Ammamma ni ayur arogyalatho prathi kshanam kapadandi tandri vaalla purti badyata meede tandri pls, naaku manchi arogyanni prasadinchandi baba ofce lo ye problem lekunda chusukondi tandri pls. Anni velala meere ma dikku tandri.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDelete