ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు - ఆలస్యమైనా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు
2. బాబా దయ కాకపోతే పోయిన లాకెట్టు అదివరకే జిప్‌లు వేసిన బ్యాగులో ఉండటం ఏమిటి?
3. చెప్పుకున్న కాసేపటికే నొప్పిని తగ్గించిన బాబా
బాబా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు - ఆలస్యమైనా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు
సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు హరిత. నా భర్త పేరు శేఖర్. బాబా నా కష్టాల్లో, బాధల్లో తండ్రిలా ఎప్పుడూ నా వెంటే వుంటూ నన్ను కాపాడుతున్నారు. ఆయన మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసారు. నా భర్త చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తై బెంచ్ మీద వున్న సమయంలో ఎన్నో ఇంటర్వ్యూలకి హాజరైనా వేరే ప్రాజెక్ట్‌కి సెలెక్ట్ కాలేదు. ఆ సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల పరిస్థితి బాగాలేదు. ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగస్థులని ఉద్యోగం నుండి తొలగిస్తున్న రోజులవి. అందువల్ల నా భర్త తాను ఏ ప్రాజెక్ట్‌కి సెలెక్ట్ కానందుకు చాలా బాధపడుతుండేవారు. నేను ఆయన బాధ చూసి తట్టుకోలేక బాబాతో నా బాధంతా చెప్పుకొని, "బాబా! నా భర్త ప్రాజెక్ట్ లేక ఎంతో బాధపడుతున్నారు .మీరే ఏదో ఒక అద్భుతం చేసి నా భర్తకి ప్రాజెక్ట్ వచ్చేలా చేయండి తండ్రీ" అని వేడుకున్నాను. తర్వాత 'నవగురువార వ్రతం' చేయాలని నిశ్చయించుకొని, "ఈ వ్రతం పూర్తైయ్యేలోపు నా భర్తకి ప్రాజెక్ట్ కేటాయించేలా చూడు తండ్రీ" అని బాబాతో చెప్పుకొని వ్రతం మొదలుపెట్టి ప్రతి గురువారం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం ఆరతికోసం బాబా గుడికి వెళ్తుండేదాన్ని. అకస్మాత్తుగా ఒక గురువారం నా భర్తకి ఒక క్లయింట్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసారు(నిజానికి అదివరకు ఆ క్లయింట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మావారు సెలెక్ట్ కాలేదు). నా భర్త శిరిడీలోని బాబా ఫోటో చూసి ఇంటర్వ్యూలో కూర్చున్నారు. బాబా చేసిన అద్భుతం చూడండి. అదివరకు రిజెక్ట్ చేసిన అదే క్లయింట్ ఈసారి నా భర్త పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, మాకు మీరు కావాలని మావారిని ఎంపిక చేసుకున్నారు. అలా బాబా దయవల్ల నవగురువార వ్రతం మొదలుపెట్టిన 6వ గురువారం నా భర్త కొత్త ప్రాజెక్ట్‌కి సెలెక్ట్ అయ్యారు. బాబా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు, ఆలస్యమైనా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. "చాలా ధన్యవాదాలు బాబా. నేను మీ బిడ్డైనైనందుకు గర్వంగా ఉంది తండ్రీ. మీరు మా మీద చూపించే ఈ ప్రేమని మేము ఎప్పటికీ మార్చిపోలేము బాబా. నా జీవితమంతా మీకు ఋణపడి ఉంటాను బాబా".
బాబా దయ కాకపోతే పోయిన లాకెట్టు అదివరకే జిప్‌లు వేసిన బ్యాగులో ఉండటం ఏమిటి?
సాయి భక్తులకు నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి, మాది విజయవాడ. సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను. 2026, వేసవి సెలవుల్లో నేను మా ఊరు వెళ్లాక అనుకోకుండా పని పడటంతో వెంటనే విజయవాడకి బయలుదేరాను. తీరా బస్టాండుకు వచ్చాక నా మెడలో ఉన్న చైన్ లింక్ ఊడిపోయి వేలాడుతూ కనిపించింది. దానికి ఉండాల్సిన బాబా లాకెట్ కనిపించలేదు. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే, ఆ చైన్ మా బాబు పుట్టాక, మా అప్పులన్నీ తీరిన తర్వాత మొదట పొదుపు చేసిన డబ్బులతో చేయించిన చైన్ అది. రెండు రోజుల వరకు దాని గురించే ఆలోచన. ఒకరోజు పడుకొని ఆలోచిస్తూ, "ఎందుకు బాబా మా నుండి దూరమయ్యావు? మళ్ళీ మాకు ఏమైనా కష్టాలు వస్తాయా బాబా?" అని నిద్రపోయాను. 'లాకెట్ పోలేదు. వెతుకు' అని కల వచ్చింది. వెంటనే లేచి నా హ్యాండ్ బ్యాగ్, మరొక బ్యాగ్ వెతికాను. కానీ వాటిలో ఆ లాకెట్ లేదు. సరేనని బ్లాగు ఓపెన్ చేసి సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటే అందులో పోయిన బంగారం దొరికిందని వచ్చింది. వెంటనే మరో బ్యాగు తీసి, అందులోని బట్టలన్నీ కిందపడేస్తుంటే విచిత్రంగా అందులో నుంచి బాబా లాకెట్ పడింది. నిజానికి నేను చైన్ వేలాడుతూ కనపడటానికి ముందే ఆ బ్యాగ్ జిప్‌లన్నీ వేసి ఊరు నుండి బయలుదేరాను. కాబట్టి అందులో ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది
బాబా దయ కాకపోతే పోయిన లాకెట్టు అదివరకే జిప్‌లు వేసిన బ్యాగులో ఉండటం ఏమిటి? తర్వాత అనిపించింది, 'బాబా ఎప్పుడూ నన్ను వదిలిపెట్టరు' అని. "ధన్యవాదాలు బాబా. మీ దయ ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు తండ్రీ".
చెప్పుకున్న కాసేపటికే నొప్పిని తగ్గించిన బాబా
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేష్. 2026, మే 14న నా భార్య మెడలోని సూత్రం తాలూకు ఒకవైపు ముడి ఊడిపోయింది. ఏంటి ఇలా జరిగిందని తను భయపడింది. అదేరోజు నేను గ్యాస్ మరియు గుండెలో కొంచెం నొప్పితో బాధపడ్డాను. అప్పుడు నా భార్య జరిగింది చెప్పి భయపడింది. అప్పుడు నేను, "ఈ నొప్పి తగ్గిపోయేలా చేయమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి నొప్పి తగ్గి నేను నిద్రపోయాను. "ధన్యవాదాలు సాయి".

Om sai ram tandri, na badhalni teerchandi baba ofce lo nenu korukunnattu naaku antu oka manchi project vachi work pressure ni tagginchandi pls, ippudu work chesthunna project lo chala pressure ga undi tandri dheeni lo nunchi nannu marche la chudandi tandri me daya tho pls meere na nammakam tandri pls, amma nannalani na kutumbanni nannu andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me