ఈ భాగంలో అనుభవాలు:
1. ఏళ్ళ బాధను ఒక్క ప్రార్థనతో తీసేసిన బాబా
2. కోరుకున్నట్టే బిడ్డలను ప్రసాదించిన బాబా
ఏళ్ళ బాధను ఒక్క ప్రార్థనతో తీసేసిన బాబా
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీసాయి రవళి. మాది హైదరాబాద్. 2017లో నా పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా నేను నా చేతులకి మెహందీ(గోరింటాకు) పెట్టించుకున్నప్పటి నుంచి నా చేతులకి ఎలర్జీ మొదలైంది. ఏ డిటర్జెంట్ సబ్బు ముట్టుకున్నా, రకరకాల హ్యాండ్వాష్లు మార్చి
ఉపయోగించినా, గిన్నెలు తోమినా అలర్జీ ఎక్కువై నా చేతులు విపరీతమైన దురద పెడుతుండేవి. అలా అని గోకితే రక్తం వచ్చి, చర్మం మీద పెచ్చులా కట్టి నల్లగా అయ్యేది. దాన్ని చూస్తూ ఏదైనా చేతితో తినాలన్నా, తాగాలన్నా నాకు ఇబ్బందిగా ఉండేది. మా బాబుకి ఏదైనా పెట్టాలన్నా కూడా వెనకడుగు వేయాల్సి వచ్చేది. అంతేకాక, పెళ్ళిళ్ళకి, ఏవైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు నా చేతులు చూపించడానికి సిగ్గుగా అనిపించి గుప్పిట మూసి ఉంచేదాన్ని, లేదా చేతులు వెనక్కి తిప్పి ఉంచుకునేదాన్ని. ఫోటోలు తీసేటప్పుడు, తినేటప్పుడు వీలైనంతవరకూ ఆ నల్ల మచ్చలు ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడేదాన్ని. అది అలర్జీయే కానీ, అంటువ్యాధిలా ఎవరికి అంటుకునేది కానప్పటికీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలంటే, ఏమనుకుంటారో అని ఇబ్బందిగా అనిపించేది. ఎప్పుడైనా మేము ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు పనిలో ఏదైనా సాయం చేద్దామంటే కూడా ఫీల్ అయ్యేదాన్ని. గోరింటాకు పెట్టుకోవాలంటే భయపడేదాన్ని, తప్పనిసరి పరిస్థితులలో పెట్టుకున్నా ఎవరికైనా ఎలా పండిందో చూపించడానికి సిగ్గుపడేదాన్ని. అసలు 'ఎప్పటికైనా ఈ బాధ తగ్గుతుందా?' అని భయమేసేది. ఎందుకంటే, స్కిన్ స్పెషలిస్ట్కి చూపించుకొని ఎన్నో మందులు వాడినప్పటికీ ఫలితం కనిపించలేదు. అసలు డాక్టర్ చెప్పిన ఆయింట్మెంట్లు రాసుకోవడానికి ఇంట్లో పనులతో కుదిరేది కాదు. పోనీ, రాత్రి ఆయింట్మెంట్ చేతులకు రాసుకుందామంటే సంవత్సరం నిండని మా పసిపాపకి పాలు పట్టడం, ఎత్తుకోవడం, డైపర్లు మార్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. అవి చేసేటప్పుడు పాపకి ఆయింట్మెంట్ అంటుకుంటుందన్న సందేహంతో ఆయింట్మెంట్ రాయడం మానుకొనేదాన్ని. డాక్టర్ చెప్పినట్లు వంకాయ, గోంగూర, కొబ్బరి తినడం తగ్గించినా కూడా విపరీతమైన దురద. ముఖ్యంగా నిద్ర మేల్కొన్న వెంటనే చాలా ఎక్కువగా దురద వచ్చేది. గోక్కోలేను, గోక్కోకుండా ఉండలేను. నాకు తెలియకుండా రక్తం వచ్చేలా గోకేస్తానని అస్తమానం గోళ్లు కట్ చేసుకొనేదాన్ని. ఇదంతా ఎవరికైనా చెప్తే, ఇది చాలా చిన్న విషయమని అనిపించవచ్చు. కానీ నేను అస్సలు భరించలేకపోయేదాన్ని. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. చివరికి ఒకరోజు అర్ధరాత్రి మెలుకువ వచ్చి భరించలేక.సాయినాథునికి నమస్కారం చేసుకుని, "సాయీ! ఈ భరించలేని బాధ పోగొట్టండి, తట్టుకోలేకపోతున్నాను. నా చేతులకి ఈ సమస్య తగ్గిపోయి మళ్ళీ మామూలుగా అయ్యేలా అనుగ్రహించండి" అని విన్నవించుకున్నాను. సాయి తన కృపను అపారంగా నా మీద వర్షించారు. కొన్నిరోజులకి దురద తగ్గడాన్ని నేను గమనించాను. సాయి నా బాధను నెమ్మదిగా పూర్తిగా పోగొట్టారు. నా చేతులు మామూలుగా తెల్లగా మారాయి. "నా బాధను పూర్తిగా పోగొట్టినందుకు చాలా చాలా ధన్యవాదములు సాయి. అన్ని విషయాలలోనూ, అన్ని సందర్భాల్లోనూ, అన్ని కాలాలలోనూ మాకు, మా కుటుంబానికి రక్షణను ఇవ్వండి. మా అందరికీ ఆయురారోగ్యాలను, మా పిల్లలకు విద్యాబుద్ధులు ఇవ్వండి. మాకు ఎప్పుడూ తోడు-నీడగా నిలిచి మార్గనిర్దేశం చేయండి సాయీ. ఇప్పటివరకు మాకు మీరు ఇచ్చిన అన్నింటికీ అనేక కృతజ్ఞతలు".
ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
కోరుకున్నట్టే బిడ్డలను ప్రసాదించిన బాబా
నేను ఒక బాబా భక్తురాలిని. బాబా ఎప్పుడూ నాతోనే ఉంటారనడానికి నాకు చాలా అనుభవాలున్నాయి. నేను ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞతతో ఉంటాను. నాకు పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడూ నాకు మొదట పాపే పుట్టాలని అనుకునేదాన్ని. బాబా అలాగే నాకు మొదట పాపని ప్రసాదించారు. నేను చాలా సంతోషించాను. తరువాత నా భర్త రెండో బిడ్డ కావాలని చాలాసార్లు అన్నప్పుడు నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మళ్ళీ ఎక్కడ పాప పుడుతుందో అని. నాకు, నా భర్తకి ఎవరైనా 'ఓకే' కానీ, మా ఇంట్లోవాళ్ళకి మాత్రం బాబే పుట్టాలని కోరిక. అదీకాక మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా నాకు భయంగా ఉండేది. అందుకే నా భర్త ఎప్పుడు రెండో బిడ్డ గురించి అన్నా నేను 'వద్దు' అనేదాన్ని. ఇంట్లో పెద్దవాళ్లు కూడా మళ్ళీ ఎక్కడ పాప పుడుతుందోనని "రెండో బిడ్డ వద్దు" అనేవారు, మళ్ళీ "మీ ఇష్టం" అని కూడా అనేవారు. నాకు ఏమీ అర్థం అయ్యేది కాదు. అలా కొన్నిరోజులు గడిచాక బాబా దయవల్ల నా భర్తకు విదేశాలకు వెళ్లే అవకాశం రావడంతో మేము ఆర్థికంగా కొంచం స్థిరపడ్డాం. ఆ తర్వాత నా భర్త రెండో బిడ్డ విషయంగా "ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు కదా!" అంటే, నేను ;సరేన'న్నాను. కొంచం ఎక్కడో భయంగా ఉండేది గానీ బాబా మీద నాకు పూర్తి విశ్వాసం ఉండేది. ఆయన నా కోరిక తీర్చారు. మాకు బాబు పుట్టాడు. బాబా దయవల్ల మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. "ధన్యవాదాలు బాబా. మీ కృప ఎప్పుడూ మాపై ఇలానే ఉండాలి తండ్రీ. ఎప్పుడూ మాతో ఉండి మమ్మల్ని మంచి దారిలో నడిపించండి".

Om Sai ram
ReplyDeleteOm Sai ram Baba please 🙏 give blessings to my family members. Om Sai ram please 🙏 be with us.
ReplyDeleteOm sai ram, ofce lo unna na problems ni teerchi e project lo kakunda nannu oka sonta project lo vese la chayandi pls baba, amma nannalani na kutumbanni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi tandri vaalla purti badyata meede tandri. Nenu yedi aina telisi teliyaka tappu cheste nannu kshaminchandi baba pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOmsairam
ReplyDeleteOm Sai Ram 🙏🙏
ReplyDeleteBaba.. entha chakkati anubhavalu.. ee Prema , karuna baba biddalandaripaina undali 🙏
ReplyDeleteBaba.. neevichina vatanninntiki Dhanyavadalu 🙏.. ilane na samasyani part shoaristavani nammutunnanu.. neevu tappa naku vere dikku ledu.. Saranusaranu baba saranu 🙏😭
ReplyDeleteOM SAI RAM
ReplyDeleteOm Sri Sai Ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete