ఈ భాగంలో అనుభవం:
- ఏం ఉన్నా లేకున్నా బాబా ఉంటే చాలు
సాయిదేవుడికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. ఈ బ్లాగు ఆధునిక సచ్చరిత్ర అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు నేను నా జీవితంలో వచ్చిన కొన్ని సమస్యలను బాబా ఎలా పరిష్కరించారో వివరిస్తాను. 2025, జూన్ మొదటివారంలో శనివారంనాడు మావారు శ్రీశైలం వెళదామన్నారు. అయితే రూమ్స్, దర్శనం బుక్ చేయలేదు. అదికాక నా నెలసరి సమయం దగ్గర్లో ఉండటం వల్ల నాకు భయమేసింది. కానీ అదివరకు చాలాసార్లు అనుకొని వెళ్ళకపోవడం వలన మావారు ఈసారి వెళ్ళాలని పట్టుదలగా ఉన్నారు. అందువల్ల నేను, "బాబా! అంతా సవ్యంగా జరిగేలా మీరు చూసుకోండి" అని బాబాతో చెప్పుకొని ఆయన మీద భారమేసి బయలుదేరాను. సాయంత్రం 5 గంటలకి అక్కడికి చేరుకున్నాము. శ్రీశైలంలో కుల సత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ ఉంటే వేరే కులస్తులకు కూడా ఇస్తారు. కానీ వారాంతం కావడం వలన ఏ సత్రంలోనూ గదులు అందుబాటులో లేవు. అక్కడికి చేరినప్పటినుంచి బాబాను వేడుకుంటూ మేము ఎంత వెతికినా రాత్రి 9 గంటల వరకు రూమ్ దొరకలేదు. చివరికి షాపుల్లో కూడా అడిగాం, ఎవరైనా ఎక్కడైనా రూమ్ చూపిస్తారేమోనని. కానీ రూమ్ దొరకలేదు. నాకు ఒకపక్క పిల్లలతో ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని బాధ, మరోపక్క పిల్లలు ఆకలి అంటున్నారు. అప్పటికి రాత్రి 10 గంటలు కావొచ్చింది. ఆ సమయంలో పక్కనే ఒక ఇస్త్రీ దుకాణం అతను దుకాణం మూసేస్తుంటే, అతన్ని "ఎక్కడైనా రూమ్ దొరుకుతుందా?" అని అడిగాము. అతను "కర్ణాటకవాళ్ళ సత్రం ఒకటి కాస్త దూరంలో ఉంది. తొందరగా వెళ్ళండి. రూమ్ దొరుకుతుంది" అని చెప్పాడు. చివరి ప్రయత్నంగా మేము బాబాను తలుచుకొని అక్కడకు వెళ్ళి అడిగాము. వాళ్ళు చాలా సౌమ్యంగా "ముందు ఇక్కడ భోజనం చేయండి. తరువాత రూమ్ ఇస్తాం" అని అన్నారు. సరేనని మేము భోజనం చేసాక చాలా తక్కువ ధరలో మంచి రూమ్ ఇచ్చారు. బాబా కరుణ చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఒకేసారి ఆకలి, రూమ్ రెండు సమస్యలు తీర్చేశారు. మరుసటిరోజు ఏ సమస్య లేకుండా దర్శనం, హోమం అంత బాగా జరిగి క్షేమంగా ఇల్లు చేరుకున్నాము. "కృతజ్ఞతలు బాబా".
నేను ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ప్రతిసారీ ఒక ఆన్లైన్ వెబ్సైటులో ఫైల్ చేస్తుంటాను. అలా ఈసారి చేస్తున్నప్పుడు ఒక 82,000 రూపాయలకు లెక్క సరిగా లేదని ప్రూఫ్స్ కావాలన్నారు. కానీ ఆ మొత్తానికి నా దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు. అలా అయితే టాక్స్ ఫైలింగ్ చేయలేమన్నారు వాళ్ళు. నాకు ఏ మార్గం కనిపించలేదు. ఆ అమౌంట్ డిజిటల్‌గా చూపెడుతున్నప్పటికీ నా దగ్గర ప్రూఫ్ లేనందున చాలా టెన్షన్ పడ్డాను. "ఎలా అయినా ఈ సమస్య తీరాలి" అని బాబాను వేడుకున్నాను. ఒక నెల రోజులు వాళ్ళకి, నాకు మధ్య ఇమెయిల్స్ నడిచిన తరువాత వాళ్ళు ఆ' 82,000 రూపాయలకు సరిపోయే టాక్స్ చెల్లించేలా' నాతో మాట్లాడి టాక్స్ ఫైల్ చేయడానికి ఒప్పుకున్నారు. అలా బాబా దయతో ఏ సమస్య లేకుండా గడువు మూగేయడానికి ఒక వారం ముందు టాక్స్ ఫైలింగ్ జరిగింది. ఇలా 2025, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నాకు చాలా టెన్షన్‌గా గడిచింది. బాబా దయతోనే ఆ సమస్యల నుండి బయటపడ్డాను. "థాంక్యూ బాబా".
ఒకరోజు నా బ్యాంకు యాప్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే అప్డేట్ అడిగింది. సరేనని అప్డేట్ చేస్తే, తర్వాత ఓటీపీ రాక అస్సలు లాగిన్ అవ్వలేకపోయాను. ఎన్ని రకాలుగా చెక్ చేసినా సమస్య ఏమిటో అర్థం కాలేదు. కస్టమర్ కేర్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. 2, 3 సార్లు యాప్ అన్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా పని చేయలేదు. 3, 4 రోజులు యాప్ ఓపెన్ చేయలేకపోయాను. యాప్ ఓపెన్ కాకపోవడం వలన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేకపోయాను. ఇక అప్పుడు "ఏదైనా మార్గం చూపు బాబా" అని బాబాను వేడుకున్నాను. కొంత సమయం తర్వాత ఇంకోసారి యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడాలనిపించింది. సరేనని అలా చేసినప్పుడు సమస్య నేను యాప్ పెర్మిషన్స్ ఇవ్వకపోవడం వలనని అర్థం అయింది. దాంతో నా సమస్య తీరిపోయింది. బాబానే పర్మిషన్స్ ఇవ్వడం లేదనే స్ఫురణ కలిగించారనడంలో ఏం సందేహం లేదు. "థాంక్స్ బాబా".
'సాయీ' అంటే 'ఓయ్' అంటారు బాబా.
నా ఆఫీసు వర్క్‌లో ఏదైనా ఇబ్బంది ఉంటే బాబాని తలుచుకోగానే ఒక మార్గం దొరుకుతుంది. ఇంట్లో కరెంటు పోయినా వెంటనే నాకు గుర్తు వచ్చేది బాబానే.నేను ఒకసారి పన్ను నొప్పితో బాధపడ్డాను. చెక్ చేస్తే, అంతా బాగానే ఉంది కానీ, నొప్పి తగ్గలేదు. అలా వారం, 10 రోజులు గడిచిపోయాయి. అప్పుడు పళ్ళ మధ్యలో ఏదో ఇరుక్కోవడం వలన నొప్పిగా ఉందని అర్థమై, "ఇంకా నొప్పి భరించడం నా వల్ల కాదు బాబా" అని అనుకున్నాను. కాసేపట్లో ఏదో చిన్న గింజ పళ్ళ సందులో నుండి బయటకు వచ్చింది. తరువాత నొప్పి తగ్గిపోయింది. ఒకరోజు నా కారు హ్యాండ్ బ్రేక్ రాక కాసేపు ఇబ్బందిపడ్డాను. బాబా నామజపం చేస్తూ ఉంటే కాసేపటికి బ్రేక్ తీయగలిగాను. ఏ సమస్యకి అయినా బాబా ఉన్నారనే భరోసా ఉన్నందుకు మనం చాలా అదృష్టంగా భావించాలి. ఏం ఉన్నా లేకున్నా బాబా ఉంటే చాలు మనకు. ఆయనే మన సర్వస్వం.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

ఓం సాయిరామ్
ReplyDeleteBaba me daya valana Kalyan marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteఓమ్ శ్రీ సాయిరామ్ 🙏🏻
ReplyDelete🌹🙏🏻🙏🏻🙏🏻🌹
Om sai ram 🙏🙏🙏...Baba ne daya valla na health bagundela chudu swamy🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me