ఈ భాగంలో అనుభవం:
- బాబా మీద నమ్మకముంచితే అంతా శుభమే!
సాయిబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. సప్తవ్యసనాలలో ఒక వ్యసనం మావారికి ఉండటం వల్ల నేను చాలా సంవత్సరాలు బాధపడ్డాను. నేను దాని నుండి బయటపడేయమని బాబాను చాలాసార్లు వేడుకున్నాను. బ్లాగులోని సాయి భక్తుల అనుభవాలలో చూసిన పరిష్కారాలను నాకు కూడా పనికి వస్తాయేమోనని ప్రయత్నం చేశాను. కానీ సమస్య తీరలేదు. ఎన్నోసార్లు బాబాపై అలిగాను, గొడవపడ్డాను. చివరకు బాబా నాపై దయతలచి పరిష్కార మార్గాన్ని చూపించారు. నాకు బాబా ఇంస్టాగ్రామ్ ద్వారా ఏమి చేయాలో, ఏమి చేయొద్దో చెప్తూ ఉంటారు. అలాగే పూజలు, వ్రతాలు, నేను దర్శించుకోవలసిన దేవుళ్ళ గురించి కూడా. అసలు నాకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉన్నదే, కేవలం బాబాకోసం. అందులో ఒకరోజు మా కులదైవానికి పూజ(16 వారాల సోమవార వ్రతం) చేయమని బాబా చెప్పారు. నేను వెంటనే ఆ పూజ మొదలుపెట్టడం, అది పూర్తవ్వక ముందే ఆ సమస్య నుండి బయటపడటం కూడా జరిగింది. ఆ సమస్య నుండి బయటపడటానికి వేరే దారులు ఎన్నో ఉన్నా కానీ, బాబా ఏం చెప్తే, అది చేయడమే నాకు ఇష్టం. బాబాకు ఇష్టం లేకపోతే ఏదీ ఫలితాన్ని ఇవ్వదని నా నమ్మకం.
2025లో మా పెద్ద తోటికోడలికి క్యాన్సర్ నాలుగవ స్టేజులో ఉందని తెలిసింది. ఆ స్టేజులో ఉన్నప్పటికీ వాళ్లు ఆపరేషన్ చేయించడానికి నిర్ణయించుకున్నారు. ఆ ఆపరేషన్ చాలా ఖర్చు, అత్యంత కష్టములతో కూడుకున్నది. అయినప్పటికీ బాబా దయతలిస్తే అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం. అందుచేత నేను ఆయనకి, "ఆపరేషన్ విజయవంతమై తను నార్మల్‌గా ఉంటే మీకు శాలువ సమర్పిస్తాన"ని మొక్కుకున్నాను. 8 గంటల ఆపరేషన్ తర్వాత 48 గంటల గడిస్తే గాని ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పినప్పటికీ బాబా దయవల్ల 24 గంటల తర్వాత నుండి తను త్వరగా కోలుకోవడం మాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొద్దిరోజులకు తను పూర్తిగా నార్మల్ అయింది కూడా.
2025లో జరిగిన మహాకుంభమేళ సమయంలో మేము ప్రయోగ వెళ్దామని టికెట్లు బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళింది మౌని అమావాస్య రోజున. ఆరోజు అక్కడ దుర్ఘటన జరిగింది. మేము ట్రైన్లో ఉన్నప్పుడు మావాళ్ళు ఫోన్ చేసి, వెనక్కి రమ్మన్నారు. కానీ బాబా దయవల్ల పోలీసువాళ్ళు మమ్మల్ని అటువైపు కాకుండా వేరే వైపు వెళ్లేలా పంపారు. మేమక్కడ ఐదు రోజుల ఉండి తిరుగు ప్రయాణమయ్యాం. బాబా మాకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకొని క్షేమంగా ఇంటికి చేర్చారు.
ఒక చిన్న సమస్య నన్ను చాలా బాధపెట్టింది. అదేమిటంటే, నేను సన్నగా ఉన్నప్పటికీ నాకు గురక వస్తుండేది. ఆ కారణంగా అందరితో కలిసి ఎక్కడికైనా బయట ఫంక్షన్లకు వెళ్లాలంటే నాకు చాలా టెన్షన్‌గా ఉండేది. హాస్పిటల్‌కి వెళ్లిన కూడా దానికి పెద్దగా మందులు ఉండవని ఒకటే భయపడేదాన్ని. అలా ఉండగా హఠాత్తుగా నాకు, 'బాబా ఊదీ పెట్టుకుంటే' అని ఆలోచన వచ్చింది. దాంతో నా గుంతుకి ఊదీ రాయడం మొదలుపెట్టాను. అప్పటినుంచి నేను ఆ సమస్య నుండి బయటపడ్డాను.
నాకు నా పిల్లలిద్దరూ ఎవరిపైన ఆధారపడకుండా బ్రతకాలని నా కోరిక. అందుకని బీటెక్ తర్వాత కూడా వాళ్ళని చదివించాలని నాకు ఉండేది. ఆ విషయం మావారితో రెండు, మూడు సార్లు చెప్పాను కానీ, ఆయన పెద్దగా స్పందించలేదు. ఇంకా నేను ఆయనని అడగడం మానేసాను. కానీ బాబాకు మాత్రం అప్పుడప్పుడు చెప్పుకుంటూండేదాన్ని. మా పిల్లలు బిటెక్ పూర్తి చేసి ఉద్యోగాలలో చేరాక ఒకరోజు మళ్ళీ వాళ్ళ పైచదువు గురించి నేను మావారితో మాట్లాడాను. బాబా దయ చూపారు. వెంటనే మావారు సరైనని క్యాట్ నోటిఫికేషన్ వెతికారు. అప్లై చేయడానికి ఇంకా సమయం ఉండడంతో మా పిల్లల చేత అప్లై చేయించాము. ఆరోజు నేను బాబాతో, "వాళ్ళకి సీటు వచ్చి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చేవరకు నేను ప్రతి వారం మీ గుడికి చెప్పులు లేకుండా వస్తాన"ని మొక్కుకున్నాను. బాబా దయవల్ల పిల్లలకు సీటు వచ్చింది. దాంతో వాళ్ళు అప్పటికే చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎంబీఏ చదువడానికి కాలేజీలో చేరారు. అయితే మా పిల్లలు కాలేజీలో జాయిన్ అయిన మర్నాడు మా అత్తగారు చనిపోయారు. అందువల్ల నేను ఆ సంవత్సరకాలం చెప్పులు లేకుండా వెళ్లి, గుడి బయటనుండే బాబా దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని వచ్చాను.
మా పెద్దమ్మాయికి ఎంబీఏ పూర్తయ్యాక కొచ్చిలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరడానికి మా అమ్మాయి వెళ్ళేటప్పుడు నేను కూడా తనతో వెళ్ళాను. మేము హోటల్లో ఉండి మా అమ్మాయి ఉండటానికి రూములు వెతికాము. కానీ ఎన్ని రూములు చూసినా మాకు నచ్చిన రూమ్ ఎంతకీ దొరకలేదు. అలా హోటల్లో 4 రోజులు గడిచిపోయాయి. చివరకు నేను, "బాబా! రేపు గురువారం కల్లా మాకు ఏదైనా రూమ్ దొరికితే, మీకు ఏదైనా స్వీట్ చేసి పెడతాన"ని బాబాకి మొక్కుకున్నాను. అదేరోజు రాత్రి మేము చూసిన వాటిలో ఒక రూమ్ మాకు బాగా నచ్చింది. మరునాడు గురువారం తెల్లవారి ఆ రూములో చేరడం కూడా జరిగింది. ఇక్కడ కొచ్చిలో అగ్రిమెంట్ లేకుండా ఎవరికీ రూము ఇవ్వరు. అలాంటిది బాబా దయవల్ల అగ్రిమెంట్ చేయకముందే, పూర్తి డబ్బు ఇవ్వకముందే ఇంట్లో ఉండటానికి అనుమతించారు ఆ ఇంటి యజమాని. అంతేకాదు, వాళ్ళు హిందువులే అయినందున ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఆటంకం లేకుండా పోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మాకు ఆ రూమ్ దొరికిన రోజు మాకు ఇంకో రూమ్ కూడా బాగా నచ్చింది. కానీ అడ్వాన్స్ ఇచ్చేలోపు వేరేవాళ్లు తీసేసుకున్నారు. మా అమ్మాయి ఆ రూమ్ మిస్ అయిందని చాలా బాధపడింది. కానీ ఒకవేళ నేను ఆ రూమ్ గనక తీసుకొని ఉంటే, మరో 13 రోజులు మేము హోటల్లో ఉండాల్సి వచ్చేది, 40 వేల రూపాయలు అదనంగా ఖర్చు అయ్యేవి. అలా కాకుండా బాబా మాకు మంచే చేసారు. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".

Om Sai Ram
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba pl
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDelete