ఈ భాగంలో అనుభవాలు:
1. సమస్య లేకుండా అనుగ్రహించిన బాబా
2. బాబా దయతో పరీక్షలో ఉత్తీర్ణత - అద్దెకు ఇల్లు - 11 సార్లు పారాయణ
3. ఎప్పటిలానే అనుగ్రహించిన బాబా
సమస్య లేకుండా అనుగ్రహించిన బాబా
నా పేరు మాధవి. మా అమ్మ కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతుంటే మేము 'మాములు జలుబు, దగ్గు కదా! కొన్నాళ్లకి తగ్గుతుందని' అనుకున్నాము. కానీ ఎన్ని రోజులైనా తగ్గలేదు సరికదా, అమ్మ తీవ్రమైన తలనొప్పితో కూడా బాధపడింది. మేము మా అమ్మవాళ్ళకి దూరంగా అమెరికాలో ఉన్నాం. నాన్న తన ఆఫీస్ పనులతో పూర్తిగా బిజీ ఉండేవారు. ఒక్కరోజు కూడా సెలవు దొరికేది కాదు అమ్మని హాస్పిటల్‌కి తీసుకుపోదామంటే. చివరికి ఒకరోజు అమ్మ నొప్పి భరించలేక ఏడ్చేసింది. ఇక ఆరోజు నాన్న ఎలాగోలా వీలు చేసుకుని అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. డాక్టర్ చూసి రక్తపరీక్ష చేయించమన్నారు. రిపోర్టులో CRP పర్సెంట్ ఎక్కువగా ఉండటంతో 'బ్లడ్ ఇన్ఫెక్షన్' అని డాక్టర్ చెప్పారు. ఆ విషయం అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. అది విని నాకు చాలా భయమేసింది. 'బ్లడ్ ఇన్ఫెక్షన్' అంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అని చాలా వింటున్నందువల్ల నా వల్ల కాలేదు, చాలా భయంగా అనిపించింది. వెంటనే దేవుడు గదిలోకి వెళ్లి, "అమ్మకి ఏమీ కాకూడదు. తగ్గిపోవాలి" అని బాబాకి మొరపెట్టుకున్నాను. తర్వాత బాబా క్వశ్చన్&ఆన్సర్స్ సైట్లో చూస్తే, "దేవుడు అందరిపట్ల దయతో ఉంటాడు" అని వచ్చింది. తద్వారా బాబా 'తగ్గుతుంద'ని చెప్పినట్టుగా అనిపించి చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యాను. కాస్త మనసు కుదుటపడింది. బాబా దయవల్ల మరుసటి వారం చెక్ చేయిస్తే, అమ్మకి ఏ సమస్య లేదని వచ్చింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా. కోటికోటి ప్రణామాలు బాబా, నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. అమ్మ, నాన్నలు ఆరోగ్యంగా ఉండేలా చూడండి తండ్రీ. నా పరిస్థితులు మీకు తెలుసు, మీరు తోడుగా ఉండండి తండ్రీ".
బాబా దయతో పరీక్షలో ఉత్తీర్ణత - అద్దెకు ఇల్లు - 11 సార్లు పారాయణ
నా పేరు తేజశ్రీ. మేము బెల్జియంలో ఉంటాము. ఇక్కడ నా భర్తకి ఆరోగ్యం మరియు ఇతరత్రా సమస్యల వల్ల ఉద్యోగం లేదు. హెచ్ఆర్ రిక్రూటర్‌గా పనిచేసిన అనుభవమున్న నేను ఇక్కడ ఐటి కంపెనీలలో చేద్దామని ప్రయత్నించాను కానీ, ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడరు. ఇక్కడ ఉద్యోగం సంపాదించాలంటే ఫ్రెంచ్, డచ్ భాషలు వచ్చి ఉండాలి(డచ్ ఉచ్చారణ, మాట్లాడటం అన్నీ కొంచం కష్టంగా ఉంటాయి). ఆ కారణంగా నాకు ఉద్యోగం రాలేదు. వేరే రంగాలలో ఉద్యోగం చేద్దామన్నా అదే సమస్య అయింది. కనీసం ట్రైనింగ్ కోసమైనా ఆ భాషలు వచ్చి ఉండాలి. అందుకని నేను ఆ రెండు భాషలు చాలాకాలంగా నేర్చుకుంటున్నాను. కానీ ఎంత ప్రిపేర్ అయినా పరీక్ష ఎలా ఉంటుందో, నేను పాస్ అవుతానో, లేదో అని చాలా భయమేస్తుండేది. అప్పుడు నేను, "బాబా! ఈ పరీక్షలు పాసయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నేను ఆ పరీక్షలు పాసయ్యాను. అయితే నేను చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ నాకు ఉద్యోగం దొరకడం లేదు. అదలా ఉంటే, నాకు, నా భర్తకి ఇద్దరికీ ఉద్యోగాలు లేకపోవడం వల్ల మాకు అద్దె ఇల్లు దొరకడానికి చాలా ఇబ్బంది అయింది. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఎంతో మందితో మాటలు కూడా అనిపించుకున్నాము. ఇంకా నేను, "బాబా! మీ దయవల్ల మాకు ఇల్లు అద్దెకు దొరకాలి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల కొన్ని రోజులకి మాకు ఇల్లు దొరికింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నేను బాబా చరిత్ర 11 సార్లు పారాయణం చేయాలని అనుకున్నాను. అయితే ఇదివరకు ఒకసారి ఇలాగే 11 సార్లు పారాయణ చేయాలని మొదలుపెడితే ఆరోగ్య సమస్యల వల్ల 9 సార్లు చేసి ఆపేసాను. అందుకని ఈసారి కూడా పారాయణ మధ్యలో ఆగుతుందేమోనని భయపడ్డాను. అందువల్ల ముందుగా బాబాతో, "పారాయణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా 11 సార్లు పూర్తి చేసేలా అనుగ్రహించండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేను అనుకున్నట్లు 11 పారాయణాలు పూర్తి చేయగలిగాను. "చాలా ధన్యవాదాలు సాయి. ఇది మీ వల్ల సాధ్యమైంది".
ఎప్పటిలానే అనుగ్రహించిన బాబా
నా పేరు జగదీశ్వర్. మా పెద్దమ్మాయివాళ్ళు పోలాండ్ దేశంలోని క్రాకోలో ఉంటున్నారు. అక్కడ ఉష్ణోగ్రత '- 2' డిగ్రీలు ఉంటుంది. నిత్యం మంచు కురుస్తుంటుంది. అందువలన అక్కడవాళ్ళు సంవత్సరంలో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ రెండు డోస్‌లు తప్పనిసరిగా తీసుకుంటారు. కానీ ఈసారి ఎందుకో మా అమ్మాయి టీకా వేసుకోలేదు, మా మనుమరాలికి కూడా ఒక్క డోసే వేయంచారు. 2025, డిసెంబర్ నెలాఖరులో మా అమ్మాయికి, మనవరాలికి ఇన్ఫెక్షన్ అయి జ్వరం వచ్చింది. మా అమ్మాయికి జ్వరం అంత ఎక్కువగా లేకున్నా, మనవరాలికి మాత్రం 104 డిగ్రీల వరకు జ్వరం ఉండింది. డాక్టర్ 'వైరల్ ఇన్ఫెక్షన్' అని మందులిచ్చారు. ఇక్కడ నేను ఏ సమస్య వచ్చినా బాబాకి మొక్కుకున్నట్టుగానే ఈసారి కూడా "మా అమ్మాయికి, మనవరాలికి జ్వరం తగ్గి, మామూలు అయ్యేలా అనుగ్రహించమ"ని వేడుకొని నా నుదుటన బాబా ఊదీ పెట్టుకున్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి ఆదుకొనే బాబా, ఈసారి కూడా అనుగ్రహించి మా అమ్మాయి, మనవరాళ్లు జ్వరం తగ్గించి నార్మల్ అయ్యేలా చేసారు. 'బాబాసాయి చరణం| సర్వదా శరణం శరణం||',

Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteసాయిరాం. దయచేసి నన్ను బాబా అనుమతి ఉంటే, సాయి భావాలు, చిన్న చిన్న అనుభవాలు share చేసుకునే whatsapp గ్రూపులో నన్ను add చేయగలరు అని మనవి.. Old link active గా లేదు.
ReplyDeleteనావాట్సాప్ number 9515507396..
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me