ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రార్థించినంతనే అనుగ్రహించే బాబా
2. బాబా చెప్పినట్లే 7వ రోజున తగ్గిన జ్వరం
3. బాబా రక్షణ
ప్రార్థించినంతనే అనుగ్రహించే బాబా
అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. ఈ బ్లాగులో ప్రచురితమయ్యే సాయి భక్తుల అనుభవాలు చదివి నేను ఎంతో ఆనందం పొందుతున్నాను. అలాగే నాకు జరిగిన అనుభవాలను మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను. నేను పిహెచ్డి చేస్తున్నాను. నా కోర్సు పూర్తవడానికి నేను కొన్ని పేపర్లు పబ్లిష్ చేయవలసి ఉంది. అందుకోసం నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాను. అయితే నేను పేపర్లు ఎన్ని జర్నల్స్(పత్రికలు)కి పంపినా పబ్లిష్ అవడం లేదు. అప్పుడు నేను సాయిబాబాని వేడుకున్నాను. అంతే, ఒక నెలలో ఒక పేపర్ పబ్లిష్ అయింది. అంతేకాదు,ఇంకొక పేపర్ పబ్లిష్ చేయడానికి అంగీకారం కూడా వచ్చింది. నేను చాలా సంతోషించాను. సాయిబాబా మన అందరి మీద ఇలాగే కరుణ చూపించాలని కోరుకుంటున్నాను. అలాగే, అంగీకారం వచ్చిన పేపర్ కూడా త్వరగా పబ్లిష్ అవ్వాలని సాయిబాబాని కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా నాకోసం బాబాని ప్రార్ధించండి, ప్లీజ్... ఎందుకంటే, ఇప్పుడు కనుక నా పేపర్ పబ్లిష్ అవ్వకపోతే, నేను ఆరు నెలలు ఆగాలి. సాయిబాబా మన ప్రార్ధన తప్పకుండ ఆలకిస్తారని నమ్ముతున్నాను.
ఇక ఇంకో అనుభవం విషయానికి వస్తే, హఠాత్తుగా మా నాన్నకి ప్రోస్టేట్ క్యాన్సర్ అని తెలిసింది. మేము అస్సలు జీర్ణించుకోలేకపోయాము. ఇంట్లో అందరం భయపడుతూ ఉండసాగాము. డాక్టర్లు, "ప్రస్తుతం మొదటి దశలో ఉంది. మొదటి రెండు నెలలు హార్మోన్ థెరపీ, తరువాత రేడియో థెరపీ చేయాలి. ఈ మొత్తం చేయడానికి, అలాగే మందులకు సుమారు 5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కొంచం ఖర్చు తగ్గుతుంది" అన్నారు. కానీ, నాన్న అదివరకు ఆ కార్డు చించేసానన్నారు. మాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. నేను డూప్లికేట్ కార్డు తీసుకోవడానికి గ్రామ సచివాలయానికి వెళితే, అక్కడవాళ్ళు "ఇప్పుడు ఏ కార్డులూ ఇవ్వట్లేదు" అన్నారు. దాంతో మేము ఆశలు వదిలేసుకున్నాం. కానీ నేను ప్రతిరోజూ బాబాని తలుచుకొని, "ఈ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి" అని ప్రార్ధిస్తూ ఉండేవాడిని. అలా ఉండగా ఒకరోజు మా అమ్మ ఫోన్ చేసి, "ఆరోగ్యశ్రీ కార్డు ఇంట్లోనే ఉంది. నా పేరు, నాన్న పేరు, ఫొటోలు అందులో ఉన్నాయి" అని చెప్పింది. అది విన్న నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా చాలా సంతోషంగా, 'బాబా! మిమ్మల్ని నమ్ముకున్నవాళ్ళని మీ రెప్పుడూ చల్లని దృష్టితో అనుగ్రహిస్తూనే ఉంటారు' అని అనుకున్నాను. నేను ప్రతిరోజూ నాన్న ఆరోగ్యం బాగవ్వాలని బాబాని తలుచుకుంటూ ఉన్నాను. దయచేసి మీరు కూడా మా నాన్న ఆరోగ్యం బాగవ్వాలని సాయిబాబాను ప్రార్ధిం చండి. మీరంతా సాయిబాబా అనుగ్రహంతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఓం నమో సాయినాథాయ నమః.
బాబా చెప్పినట్లే 7వ రోజున తగ్గిన జ్వరం
నా పేరు ఆనంద్ విహార్. ఒకసారి నా తమ్ముడికి జ్వరమొస్తే, డాక్టర్ని సంప్రదించాము. డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించమని సూచించారు. మేము అలాగే చేసాము. ఆ రిపోర్టులో క్యాన్సర్ని సూచించే న్యూరోఫిల్స్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని వచ్చింది. మేము చాలా భయపడిపోయాము. కానీ బాబా జ్వరం, వ్యాధి వారం లోపు తగ్గుతాయని సందేశం ఇచ్చారు. అదేరోజు శేజారతి సమయానికి నేను సాయిబాబా మందిరంకి వెళ్ళాను. అప్పుడు ఒక స్త్రీ సాయిబాబా పంచారతి కోసం ఐదు దీపాలు వెలిగిస్తుంది. అది చూసి నేను, 'బాబా! మీరు నా తమ్ముడికి క్యాన్సర్ నయం చేసేటట్లైతే, మీకివ్వబోయే పంచారతిలో ఒక దీపం వెలిగించే అవకాశం నాకివ్వండి' అని అనుకున్నాను. అంతలో అకస్మాత్తుగా పూజారి వచ్చి, పంచారతికి ఐదు దీపాలు వెలిగిస్తున్న ఆ మహిళతో 'దీపం వెలిగించేందుకు అగరబత్తీ నాకివ్వమని' అన్నారు. నేను, 'బాబా! నన్ను దీపం వెలిగించేలా అనుగ్రహించార'ని తలచి చాలా సంతోషించాను. బాబా చెప్పినట్లే ఏడవ రోజున నా తమ్ముడికి జ్వరం తగ్గింది. తనకి క్యాన్సర్, జ్వరం, మరే వ్యాధి లేదు. సాయిబాబా కృప వలన తను ఇప్పుడు చాలా బాగున్నాడు.
బాబా రక్షణ
మళ్లీ నిరూపించావు తండ్రీ".
.jpg)

ఓంసాయిరాం omsairam
ReplyDeleteOm Sai Ram i want your Rakshana to my husband and children 🙏🙏❤️. Today all Sai Leelas are very nice. Baba be with us and bless 🙏🙏💞 us.From 30thNovember to 3rd December be with me and bless 🙏💓 me to be normal.Om Sai Ram
ReplyDeleteLife long i want your Rakshana.My self and my family 🙏🙏❤️ Surrenderd to you take care of my family 🙏 give health ❤️ to us and bless 🙏🙏 my husband and children 🙏 with full aayush Om Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sri sairam🙏🙏
ReplyDeleteBaba Kalyan marriage ipoindi me daya valana.na health problem solve cheyandi pl
ReplyDeleteOm sri sai ram
ReplyDeleteOm sai sri sai Jaya Jaya sai Om sai sri sai Jaya Jaya sai Om sai sri sai Jaya Jaya sai Om sai sri sai Jaya Jaya sai om sai sri sai Jaya Jaya sai
ReplyDeleteSai please bless my family
ReplyDelete