ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా అనుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదు
2. బాబా దయతో ప్రమాదకర స్థితిలో ఉన్న బిడ్డకి ఆరోగ్యం
3. బాబా భక్తసులభుడు కదా! కాపాడకుండా ఎలా ఉంటారు?
బాబా అనుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదు
నా పేరు మహేష్ రెడ్డి. నేను నా ఉద్యోగానికి సంబంధించి ఒక సర్టిఫికేషన్ ట్రైనింగ్ పరీక్ష వ్రాయాల్సి వుంది. అందులో ఉత్తీర్ణత సాధించాలంటే 80% మార్కులు రావాలి. కేవలం రెండు అవకాశాలే ఉంటాయి. నేను ఆ పరీక్షకోసం బాగా సిద్ధమైనప్పటికీ మొదటి ప్రయత్నంలో 75% మార్కులే సాధించగలిగాను. అంటే ఉత్తీర్ణతకు 5% తక్కువ. నాకు చాలా నిరాశగా అనిపించింది. ఇంకా ఒకేఒక్క అవకాశం మిగిలి ఉన్నందుకు భయపడి, "బాబా! నేను నా శక్తిమేరకు చదివాను. ఇక మిగిలింది మీ అనుగ్రహమే. దయచేసి నన్ను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడిని చేయండి" అని మనసారా బాబాను ప్రార్థించాను. బాబా ఆశీస్సులతో నేను రెండవ ప్రయత్నంలో అద్భుతంగా వ్రాసాను. ఈసారి 88% మార్కులు సాధించాను. అంతా బాబా కరుణ. ఈ అనుభవం ద్వారా 'మనం శ్రద్ధగా కృషి చేయాలి - ఫలితం బాబా ఆశీర్వాదంపై ఆధారపడి ఉంటుందని, ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసం కోల్పోవద్దని, మనసారా పిలిస్తే బాబా తప్పకుండా కాపాడతారని' నాకు మరోసారి స్పష్టమైంది.
ఒకరోజు నా పర్స్ కనిపించలేదు. అందులో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, డబ్బులు ఉండటం వల్ల నేను చాలా టెన్షన్‌కి లోనయ్యాను. ఇంటిలో మూలమూల అనేకసార్లు వెతుకుతూ అల్మారాలు, బ్యాగులు, టేబుల్స్ మొదలు ఎక్కడ చూసినా కనబడలేదు. దాంతో నా మనసు బాగా కలతచెంది బాబాను ఒకసారి గుర్తు చేసుకొని, కళ్ళు మూసుకొని మనసారా, "బాబా! మీరు లేకుండా నేను ఏమీ చేయలేను. దయచేసి నా పర్స్ దొరకేలా చేయండి" అని ప్రార్థించాను. అంతే, అద్భుతం జరిగింది. నేను అప్పటికే చాలాసార్లు వెతికిన చోటే నా పర్స్ ఉండటం నా కంటపడింది. ఆ క్షణం నా గుండె నిండా ఆనందం, కృతజ్ఞతలు ఉప్పొంగాయి. ఈ చిన్న అనుభవం నాకు మళ్లీ ఒకసారి చెప్పింది: 'సమస్య ఎంత చిన్నదైనా, పెద్దదైనా బాబా మీద భరోసా ఉంచితే ఆయన తప్పక సహాయం చేస్తారు. ఆయన అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుంది'. "ధన్యవాదాలు బాబా".
బాబా దయతో ప్రమాదకర స్థితిలో ఉన్న బిడ్డకి ఆరోగ్యం
నా పేరు శ్రీనివాస్. నా భార్య అక్కకి మొదట బాబు ఉండగా రెండో కాన్పులో పాప పుట్టింది. ఐతే ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. ఎందుకంటే, పాప నిద్రలో అలానే ఉండిపోతుండేది. కనీసం పాలు కూడా తాగేది కాదు. ఆ విషయం మాకు కొన్ని రోజుల వరకు తెలీదు. ఒకరోజు పాప గురించి అడిగితే, అప్పుడు చెప్పారు. హాస్పిటల్లో టెస్ట్ చేసి, '18.7-86.9 మధ్య ఉండాల్సిన అమ్మోనియా లెవెల్ 596 ఉందని, 4.5-9.8 మధ్య ఉండాల్సిన లాక్టాటే లెవల్ 40.9 ఉందని, కష్టమని, బెంగళూరు లేదా హైదరాబాద్ తీసుకొని వెళ్లిపోండని' డాక్టర్ చెప్పారు. నేను వేరే ఎవరైనా డాక్టర్ని అడుగుదామని మా రైల్వే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని అడిగాను. అతను తనకి తెలిసిన పిల్లల డాక్టరుతో మాట్లాడి, "కేసు చాలా క్లిష్టమైనది. అర్జెంట్‌గా పాపని ఐసీయూలో జాయిన్ చేయండి. లేదంటే ప్రాణానికే ప్రమాదం" అని అన్నారు. మేము చాలా టెన్షన్ పడ్డాం. అందరూ ఒకటే ఏడుపు. కిడ్నీ పేషెంట్ అయిన నా భార్య తండ్రి చాలా జాగ్రతగా ఉండాలి. అలాంటిది అతను కూడా ఏడుస్తూ ఉంటే, ఇక్కడ నా భార్య కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా నేను బాబాని, "బాబా! ఒక నెల పాప. తన తల్లి ఎన్నో కష్టాల్ని అనుభవించి తనకి జన్మనిచ్చింది. ఆ పాప ఆరోగ్యం నయమయ్యేటట్లు చూడండి తండ్రీ. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. తర్వాత పాపని హైదరాబాద్ తీసికెళ్ళి, అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బాబా దయవల్ల పాప ఆరోగ్యం నయమయ్యింది. "ఎన్ని ధన్యవాదాలు చెప్పినా మీకు తక్కువే బాబా".
బాబా భక్తసులభుడు కదా! కాపాడకుండా ఎలా ఉంటారు?
సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. ఎన్నో సందర్భాల్లో బాబా నన్ను కాపాడి నా వెనకే తామున్నామని నిరూపించారు. అటువంటి ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి మా అత్తయ్యకి, అమ్మాయికి ఒకేసారి వైరల్ ఫీవర్ వచ్చి చాలా తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడ్డారు. నేను వాళ్ళిద్దరి బాధ చూడలేక ఎంతో మధనపడి, "డాక్టర్, టెస్టులు అవసరం లేకుండా వీళ్ళిద్దరికీ తగ్గిపోయేలా చూడండి" అని బాబాకి చెప్పుకున్నాను. ఆయన భక్తసులభుడు కదా! కాపాడకుండా ఎలా ఉంటారు? అదే నమ్మకంతో రోజూ ఊదీ వాళ్ళకి పెడుతూ, "వాళ్ళకి తగ్గిపోతే శిరిడీ వస్తాన"ని మొక్కుకున్నాను. 3 రోజుల్లో ఇద్దరికీ తగ్గింది. తర్వాత అమ్మాయి దగ్గుతో బాధపడింది కానీ, మందులు వాడితే అది కూడా తగ్గింది. ఇది బాబా భక్తులపై చూపే కరుణ. "ధన్యవాదాలు బాబా. మీ దర్శనం తప్పక చేసుకుంటాను తండ్రీ. కానీ అందుకు మీ అనుమతి, అనుగ్రహం కావాలి. వాటిని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ శతకోటి ప్రణామాలు".
సర్వం శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు.
Om Sai Ram.please bless my family 🙏🙏 with full aayush and health.
ReplyDeleteOm sai ram amma nannalani ayur arogyalatho anni velala kshamam ga kapadandi tandri, nanna ki vasthunna pain ye pramadam lekunda taggi poye la chayandi tandri. Chinnadi aina peddadi aina prathi samasya ki meere ma dikku tandri.
ReplyDeleteSri sachidananda Sadguru Sainath Maharaju ki Jai 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl Kalyan drink habit manipinchu thandri pl
ReplyDeleteOmsaideva
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba na biddani cold, fever nunchi kapadu baba.sounds lekunda breathing manchiga vundali baba please
ReplyDelete