ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా నాతోనే ఉన్నారన్న అనుభూతి
2. నెక్లెస్ దొరికేలా బాబా చేసిన సహాయం
బాబా నాతోనే ఉన్నారన్న అనుభూతి
నా పేరు భారతి. మా కుటుంబమంతా కర్ణాటకలో జరిగే మా బంధువుల ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి హైదరాబాద్ నుండి వెళ్లాలని మొదట అనుకున్నాము. కానీ తర్వాత పనుల ఒత్తిడి వల్ల కుదరక మావారు రానన్నారు. ఆయన రావడం లేదని, పైగా నెలసరి సమయమని హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్న మా పాప కూడా రానంది. ఇంకా నేను ఒక్కదాన్నే ప్రయాణానికి సిద్ధమయ్యాను. అప్పటినుండి తిరిగి హైదరాబాద్ చేరేవరకు బాబా నా వెంటే ఉంటూ వివిధ సందర్భాలలో రక్షణనిచ్చారు. నేను రాత్రి 10 గంటలకు లింగంపల్లిలో ట్రైన్ ఎక్కాల్సి ఉండగా ఆరోజు ఉదయం నుండి ఆ ట్రైన్ 3 నుండి 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందని మెసేజ్లు వస్తూపోయా యి. ఆ మెసేజ్ బట్టి చూస్తే, నేను రాత్రి ఒంటి గంట, రెండు గంటల మధ్య ట్రైన్ ఎక్కాలి. కానీ ఆ సమయంలో స్టేషన్‌కి ఎలా వెళ్ళాలని తర్జనభర్జన పడ్డాను. 10 గంటలకైతే మా పాప కారులో నన్ను స్టేషన్ వద్ద దింపేసేది కానీ, ఒంటిగంటకు తనని డ్రాప్ చేయమని చెప్పాలంటే మళ్ళీ తను ఒక్కతే వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఆ సమయంలో తను వద్దు అనుకున్నాం. క్యాబ్ బుక్ చేద్దామంటే, రక్షణ సమస్య. అదీకాక ఆ సమయంలో దొరుకుతాయో, లేదో కూడా తెలీదు. మా పాప "పర్లేదు, నేను డ్రాప్ చేస్తా" అంటే, ఊర్లో ఉన్న మావారు వద్దన్నారు.
సిటీలో ఉన్న కొందరు బంధువుల పిల్లలు, స్నేహితులు నన్ను స్టేషన్ వద్ద దింపగలరేమో అని ప్రయత్నాలు చేశాను కానీ, వాళ్ళకి వీలుకాలేదు. చివరికి 10 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయి స్టేషన్‌లోనే ఎలాగో ఒకలా కాలక్షేపం చేద్దామని అనుకున్నాను. కానీ ఆ సమయంలో కూడా హైదరాబాద్ రోడ్లలో ట్రాఫిక్ ఉంటుంది. మా పాప, "ఏం పర్వాలేదు" అని అంటున్నా తల్లిదండ్రులుగా మా భయాలు మాకు ఉండడంతో బాబా మీద భారం వేసి కాస్త ముందుగానే వెళ్ళాం. బాబా దయవల్ల కాస్త అటుఇటుగా 11 కల్లా మా పాప నన్ను స్టేషన్ వద్ద దింపేసి, తిరిగి తను సురక్షితంగా ఇంటికి చేరుకుంది. నేను భయపడినట్టుగా స్టేషన్‌లో నాకు బోర్ అనిపించలేదు. అది అర్ధరాత్రి సమయమైనందున ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్లో కూర్చొని, అమెరికాలో ఉన్న బంధువులతో ఫోన్(వాళ్ళకి అది పగలు) మాట్లాడుతూ కాలక్షేపం చేసి పావు తక్కువ రెండుకి ట్రైన్ ఎక్కాను.
కర్ణాటకలో చేరాల్సిన చోటుకి వెళ్లి పెళ్లి వాళ్ళింటికి వెళ్ళాను. మర్నాడు సమీప పట్టణంలో ఎంగేజ్మెంట్. రాత్రి అందరికీ ఆ పట్టణంలోని హోటల్లో రూమ్ బుక్ చేశారు. నేను మా మరిది కుటుంబంతో కలిసి కారులో అక్కడికి వెళ్ళి రిసెప్షన్‌లో రూమ్ గురించి విచారిస్తుండగా, అంతకుముందు మేము లోపలికి వెళ్తుంటే బయటకు వెళ్తున్న పెళ్ళి బృందంలోని ఒకాయన తిరిగి లోపలికి వచ్చి, చేతిలో దుమ్ముతో ఉన్న సెల్ ఫోన్ రిసెప్షన్‌వాళ్ళకి చూపిస్తూ, "ఇది ఎవరు పారేసుకున్నారో, ఏమో! కాస్త చూడండి" అంటూ చేయి చాపేసరికి అది నా ఫోన్! దాన్ని చూడగానే నా గుండె గుభేలుమంది. ఏం జరిగిందో నాకు వెంటనే అర్థమైంది. నేను కారు దిగేటప్పుడు అప్పటివరకు నా ఒళ్ళో ఉన్న సెల్ ఫోన్ జారి రోడ్ మీద పడినట్టుంది, అది నేను గమనించకుండా చేతిలో హ్యాండ్ బ్యాగుతో లోనికి వచ్చేశాను. ఫోన్ పోయిన విషయం నేను గ్రహించి ఉంటే ఎంత టెన్షన్ పడేదాన్నో కానీ, ఆ విషయం నాకు తెలియకముందే బాబా దాన్ని తిరిగి సురక్షితంగా నాకు అందించారు(రోడ్ మీద చాలా వాహనాలు తిరుగుతూ ఉంటాయి, దేని కింద కూడా పడకుండా). ఇలాగే ఇంతకుముందు ఒకసారి నా ఫోన్, క్యాష్, కార్డులు, బంగారం ఉన్న బ్యాగ్ బండికి వదిలేస్తే, బాబా ఎలా రక్షించారో నేను గతంలో ఈ బ్లాగులో పంచుకున్నాను. అప్పుడు కనీసం నేను బ్యాగ్ లేదన్న విషయం గుర్తించి ఒకసారి బాబాను తలచుకున్నాను. ఈసారి అది కూడా లేదు. నేను నిర్లక్ష్యంగా పారేసుకుంటే వెనకే బాబా నాకు తెచ్చి ఇచ్చేసారు. చిన్న టెన్షన్ కూడా నేను పడకుండా చేసారు. ఊరు కానీ ఊర్లో, మావారు పక్కన లేకుండా(చుట్టాలు ఎందరో ఉన్నారు అనుకోండి) ఫోన్ పోతే నా పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే, ఒకసారి మా పాప సరిగ్గా ఇదే విధంగా ఫోన్ పోగొట్టుకుని ఎంతో ఇబ్బందిపడింది. ఈ అనుభవం ద్వారా బాబా నాతోనే ఉన్నారని అనుభూతి చెందాను.
మెనోపాజ్ దశ దగ్గర పడుతుండటం వల్ల ఈమధ్య నాకు నెలసరి సమయానికి రావడం లేదు. ఈ ఫంక్షన్ విషయంలో ముందే వచ్చి, వెళ్లేనాటికి ఆ సమస్య అస్సలు లేకుండా ఉండాల్సింది, కానీ నెలసరి రాలేదు. ఇంకా నేను బాబా మీద భారమేసి ధైర్యంగా వెళ్ళిపోయాను. బాబా నెలసరి విషయంలో ఎప్పుడూ నాకు సహకరించినట్టే, ఈసారి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసారు. అక్కడున్న 2 రోజులలో కానీ, ట్రైన్‌లో గాని నెలసరి రాలేదు. హ్యాపీగా అన్ని ముగించుకుని ఇంటికి చేరుకున్నాను. బాబా మనతో ఉన్నారన్న భరోసా లేకపోతే ఇంత ధైర్యంగా మనం ఏ పని చేయలేము. అన్ని బాబా మీద వేసేస్తే, చాలా ధైర్యంగా ఫ్రీగా ఉంటుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మిగిలి ఉన్న ఒక పని సవ్యంగా త్వరగా మంచిగా జరిగేట్లు చూడు తండ్రీ"..
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
నెక్లెస్ దొరికేలా బాబా చేసిన సహాయం

Om Ssi Ram 🙏🙏
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu house koni pettandi baba pl
ReplyDelete