సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2037వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహ లీలలు - 38వ భాగం
2. బాబా కృప

శ్రీసాయి అనుగ్రహ లీలలు - 38వ భాగం 


నా పేరు సాయిబాబు. 2016లో ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రపోతున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు యమభటులు తమ చేతులు చాచి నన్ను పట్టుకోబోతున్నారు. నాకు భయమేసి 'బాబా' అని గట్టిగా అరిచాను. అంతే! మరుక్షణంలో ఒక పాదం ఆ యమదూతలిద్దరినీ ఒక్క తన్నుతంతే వాళ్ళు దూరంగా పడి, లేచే పారిపోయారు. అంతలో బాబా నా పక్కన నిలబడి కనిపించారు. ఆయన, "భయపడకు! వాళ్ళని తన్ని తరిమేసాను" అని నాతో చెప్పారు. ఆకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది. ఆ కలంతా నా భార్యకి చెప్పాను. అదేరోజు సాయంత్రం నా భార్య బాబా పుస్తకం చదువుతూ నన్ను పిలిచి ఒక పేజీలో వాక్యాలు చదవమని చెప్పింది. అక్కడ, "అవును నిజంగానే యమభటులు వచ్చారు. వాళ్ళని తన్ని తరిమేసాను. భయపడొద్దు!" అని ఉంది. మా ఇద్దరికీ చాలా ఆశ్చర్యమేసింది. అలా నాకొచ్చింది కల కాదు, నిజమేనని బాబా చెప్పారు.


2025. ఆగస్ట్ 18న నా భార్య శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని 19వ తేదీన హైదరాబాద్ వెళ్లి, అక్కడినుండి కైలాష్, మానస సరోవర యాత్రకి బయలుదేరింది. నేను బాబాతో, "నా భార్య చేత మంచిగా యాత్ర చేయించి సురక్షితంగా తిరిగి మా ఇంటికి చేర్చండి బాబా" అని చెప్పుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. నా భార్య ఏ ఆటంకం లేకుండా మానససరోవరం సరస్సు చూసుకొని, కైలాస పర్వత ప్రదక్షిణ చేసింది. తరువాత తిరిగి వస్తున్నప్పుడు తను దారి తప్పిపోయింది. తనకి ఎవరూ కనపడక భయమేసి 'శివ' నామం చెప్పుకుంది. తర్వాత బాబాని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోగానే ముసలి దంపతులు తన దగ్గరికొచ్చి తన చెరొక చేయి పట్టుకొని నిలబెట్టారు. నా భార్య వాళ్ళని శివపార్వతులుగా భావించి తనతో శిరిడీ నుండి తీసుకెళ్లిన మారేడు దళాలు వారి పాదాలు మీద పెట్టింది. ముఖ్య విషయమేమిటంటే, చైనావాళ్లు యాత్రికులను తనిఖీ చేసినప్పుడు అందరి దగ్గర వున్న మారేడు దళాలను తీసుకొని తిరిగి ఇవ్వలేదుగానీ నా భార్యకు మాత్రం ఇచ్చారు. సరే అసలు విషయానికి వస్తే, ఆ వృద్ధ దంపతులు నా భార్యని నడిపించుకుంటూ తీసుకొని వెళ్తున్నప్పుడు ఎదురుగా వున్న పర్వతం మీద అభయహస్తంతో బాబా నా భార్యకి దర్శనమిచ్చారు. ఇదిలా ఉండగా నా భార్య వాళ్లతోపాటు వెళ్లిన గుర్రం వాడు ఒకామె తప్పిపోయందని మిలిటరీవాళ్ళకి రిపోర్ట్ ఇచ్చాడు. దాంతో మిలిటరీవాళ్ళు నా భార్యను వెతుక్కుంటే బయలుదేరారు. ఆ క్షణానికి వృద్ధ దంపతులు నా భార్యకి తను వెళ్లాల్సిన చోటుకి దారి చూపించారు. అంతలో మిలిటరీవాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు దగ్గరకి రాగానే ఆ వృద్ధ దంపతులు మరి కనపడలేదు. అలా బాబా దయవల్ల 11 రోజుల యాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తై నా భార్య క్షేమంగా మా ఇంటికి చేరుకుంది.


2025, సెప్టెంబర్ 11న నేను ఫేస్బుక్‌లో ఒకరు తమ ఇంట్లో హనుమాన్ చాలీసా పుస్తకం ఎక్కడో పెట్టి మర్చిపోయామని, ఎంత వెతికినా కనపడలేదని, తరువాత ఒకరోజు ఆ పుస్తకం దొరికిందని సంతోషంగా ఆ పుస్తకం ఫోటోతో సహా పెట్టారు. ఆ మర్నాడు ఉదయం 10 గంటలకి బాబా నన్ను దర్శనానికి రమ్మంటున్నట్లు నాకు అనిపించింది. నిజానికి నేను ప్రతిరోజూ మధ్యాహ్నం 2గంటలకు దర్శనానికి వెళ్లి 5 గంటలకు ఇంటికి వస్తుంటాను. కానీ ఆరోజు బాబా రమ్మంటున్నట్లు అనిపించడం వల్ల ఉదయమే దర్శనానికి సమాధి మందిరంకి వెళ్ళాను. అప్పుడు బాబా పాదాల వద్ద ఉన్న బంతి పువ్వు నాకు ఇచ్చారు. తర్వాత నేను ద్వారకామాయికి వెళ్లి, దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఒకరు వచ్చి "మీరు తెలుగు చదువుతారు కదా!" అని చిన్న పుస్తకం చేతిలో పెట్టారు. అది హనుమాన్ చాలీసా పుస్తకం. అప్పుడు ముందురోజు నేను ఫేస్బుక్‌లో చదివిన అనుభవం నాకు ఒక మెసేజ్ అని అర్థమైంది. అలా బాబా భవిష్యత్తు ముందే చూపిస్తారు.

బాబా కృప

నా పేరు కామేశ్వరి. నేను ఒక సామాన్య సాయి భక్తురాలిని. నేను హైదరాబాద్‌లో నివాసముంటున్న 78 సంవత్సరాల ఒంటరి మహిళను. నాకు మరణ భయం లేదుగాని, రోగ భయం మటుకు చాలానే ఉంది. ఎందుకంటే, నేను ఆసుపత్రి పాలైతే నాకన్న నన్ను చూసుకునేవాళ్ళకి ఎక్కువ ఇబ్బంది. అందుచేత  నేనెప్పుడూ సాయినాథుని అనాయాస మరణం ప్రసాదించమని ప్రార్ధిస్తూ ఉంటాను.  నా పిల్లలిద్దరూ యుఎస్‌లో ఉంటున్నారు. నేను సంవత్సరంలో ఆరునెలలు వాళ్ళ దగ్గర, ఆరునెలలు ఇండియాలో ఉంటాను. 2025, ఆగస్టులో యుఎస్ వెళ్ళగానే నాకు సుస్తీ చేసింది. రోగ లక్షణాలను బట్టి అది క్యాన్సర్ కావచ్చన్న సందేహం కలిగింది. దాంతో నేను బాబాను శరణువేడి ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదిస్తే, స్పెషలిస్ట్ డాక్టర్ని కలవమన్నారు. అలాగే కలిస్తే, బాబా దయవల్ల అది సాధారణ రుగ్మతే అని తేలింది. ఇది బాబా కృపేనని నా నమ్మకం. ఎల్లవేళలా నన్ను కాపాడుతున్న బాబాకు శతకోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓం సాయినాథాయ నమః.

6 comments:

  1. Om Sai Ram today we are going to hospital for eye scanning.Baba be with us and bless us.please take care of me and bless me that eye no problem.It can cure by eye drops.

    ReplyDelete
  2. We are visiting Newor surgeon

    ReplyDelete
  3. Please Sai Ram give my husband 🙏🙏 and children full aayush and health.Bless me lonvity of dhegra Sumangali ga Sai.Om Sai Ram

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo