ఈ భాగంలో అనుభవాలు:
1. ఆరోగ్య విషయంలో బాబా సహాయం
2. టాబ్లెట్ వేసుకోకపోయినా ఏ సమస్యా రాకుండా దయచూపిన బాబా
ఆరోగ్య విషయంలో బాబా సహాయం
నేను ఒక సాయి భక్తురాలిని. మా నాన్న షుగర్ వ్యాధిగ్రస్తులు. దానివల్ల ఆయనకి డయాబెటిక్ ఫుట్ వచ్చింది. డయాబెటిక్ ఫుట్ అంటే మధుమేహం కారణంగా పాదాలకు వచ్చే సమస్యలు. నరాలు దెబ్బతినడం, రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల పాదాలకు గాయాలైనా నొప్పి తెలియకపోవడం, చిన్న గాయాలు పెద్ద పుండ్లు లేదా ఇన్ఫెక్షన్ గా మారడం జరుగుతుంది. ఒకసారి నాన్న పాదానికి అయిన పుండు పగిలి రక్తం, చీము కారుతూ ఉండింది. అది అలానే ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుందని నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ అంతా క్లీన్ చేసి, కొన్ని మందులిచ్చి "ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బాగా ఇబ్బంది అవుతుంది" అని అన్నారు. అయితే అందరూ మా నాన్న తాగుబోతు కాబట్టి అది అంత తేలికగా తగ్గదని, తగ్గినా మధుమేహం వల్ల అది మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ అది తగ్గకుండా పెరిగితే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని భయపెట్టారు. అది నిజమే కూడా. అందువల్ల వాళ్ళు చెప్పినట్లు పుండు తగ్గకపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమని మాకు చాలా భయమేసింది. నేను బాబా మీద నమ్మకముంచి, "బాబా! ఆ గాయం ఎలాగైనా తగ్గించండి. అది మళ్ళీ రాకూడదు. ఆ గాయం పెరగకుండా తొందరగా గాయం తగ్గిపోయేలా చేయండి ప్లీజ్" అని వేడుకున్నాను. బాబా దయవల్ల నాన్న గాయం తగ్గింది. ఇదంతా జరిగి ఒక సంవత్సరంపైనే అయింది. ఇప్పటివరకు ఆ సమస్య మళ్ళీ రాలేదు. అంతా బాబా దయ.
ఈ సంవత్సరం(2025) మా తమ్ముడు హెల్త్ చెకప్ చేయించుకొని, రిపోర్టులో అన్నీ బాగానే ఉన్నాయని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 15 రోజులకి ఒకరోజు నేను మాటల్లో మా కంపెనీ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే హెల్త్ చెకప్ సౌకర్యం గురించి చెప్తుంటే, మా తమ్ముడు విని, "నేను ఇటీవల చెకప్ చేయించుకున్నాను. బావగారికి(నా భర్త డాక్టర్) రిపోర్టు పెడతాను. ఒకసారి చూసి ఎలా ఉన్నాయో చెప్పమ"ని అన్నాడు. నా భర్త ఆ రిపోర్టు చూసి, "అంతా బాగుంది" అన్నారు. కానీ ఒక్క నిమిషం అగి, "క్రియేటిన్ లెవల్ 1.1 ఉంది" అన్నారు. అది విన్న వెంటనే నాకు కంగారుగా అనిపించి భయమేసింది. ఎందుకంటే, అదివరకు మా ఆడపడుచు ఒకసారి ఇలానే హెల్త్ చెకప్ చేయించుకొని మొదటిసారి అంత నార్మల్‌గానే ఉందనుకొని తర్వాత క్రియేటిన్ లెవెల్ 1.3 ఉందని గమనించారు. జాబు అదేమంత పెద్ద సమస్య కాదని పట్టించుకోలేదు. కానీ 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే క్రియేటిన్ లెవల్ 1.7 ఉంది. అప్పటికే మోకాళ్ళ జాయింట్స్ దగ్గర నొప్పులు, కాళ్ళలో నీళ్లు రావడం మొదలైన లక్షణాలు మొదలయ్యాయి. ఇంకా బీపీ కూడా ఎక్కవగా ఉండింది. అవన్నీ చూసి డాక్టర్, 'CKD(క్రానిక్ కిడ్నీ డిసార్డర్- కిడ్నీ ఫెయిల్యూర్)' అని చెప్పారు. అప్పుడు వాళ్ళు మునపటి రిపోర్టులో క్రియేటిన్ 1.3 ఉందని చెప్తే, "1.3 ఉన్నప్పుడు సంప్రదించకుండా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసార"ని డాక్టర్ తిట్టారు. ఈ కారణాల వల్ల మా తమ్ముడికి క్రియేటిన్ లెవల్ 1.1 ఉందని భయమేసి కంగారుపడ్డాము. అదే విషయం మా తమ్ముడికి చెప్తే, తను కూడా భయపడ్డాడు. నా భర్త డీహైడ్రేషన్ వల్ల కూడా అలా చూపిస్తుంది అన్నారు. ఆయన చెప్పింది వాస్తవం. సాధారణంగా క్రియేటిన్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. చాలామంది విషయంలో అది తేలికగానే తగ్గుతుంది. మా ఆడపడుచుకి అయినట్లు CKD(కిడ్నీ ఫెయిల్యూర్) ఏం అవ్వదు. కానీ ఆవిడ పరిస్థితి దగ్గర నుండి చూసినందువల్ల మా తమ్ముడి క్రియేటిన్ లెవల్ 1.1 ఉన్నా కూడా నాకు భయమేసింది. పురుషులలో సాధారణ క్రియేటిన్ స్థాయి 1.3-1.5(బోర్డర్) అయినప్పటికీ 1 కంటే తక్కువ ఉంటే మంచిదని తెలిసి భయపడ్డాము. మా తమ్ముడు ఎలాగూ టెస్ట్ చేయించి 15 రోజులు అయింది కదా అని అదేరోజు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే, ఈసారి క్రియేటిన్ 1.3 ఉంది. మాకు ఇంకా భయమేసి అదివరకు మా ఆడపడుచు సంప్రదించిన డాక్టర్ని సంప్రదిస్తే, క్రియేటిన్ స్థాయి పెరగడం చూసి ఉప్పు లేని పదార్థాలు తినమన్నారు. అయితే అలా చేస్తున్న కూడా ఒక నెలకు క్రియేటిన్ 1.5 వరకు పెరిగింది. అప్పుడు ఇక మాకు బాబానే దిక్కు అని మా అమ్మతో 'సాయి దివ్యపూజ' మొదలుపెట్టామని చెప్పాను. మా అమ్మ సరేనని దివ్యపూజ 11 వారాలు చేస్తానని సంకల్పం చేసుకుంది. ఒక వారం పూజ అయ్యాక అదే వారంలో శనివారంనాడు నేను లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి వెళ్లి, “మా తమ్ముడు క్రియేటిన్ స్థాయి తగ్గితే, అదేరోజు మీ దర్శనం చేసుకోమని వాళ్ళకి చెప్తాన"ని అనుకున్నాను. అలా అనుకున్న 15 నిమిషాలకి మేము ఆ గుడిలో ఉండగానే మా తమ్ముడు నా భర్తకి ఫోన్ చేసి, "క్రియాటిన్ 1.3కి వచ్చింది" అని చెప్పాడు. నేను వెంటనే మా తమ్ముడికి కాల్ చేసి, 'మేము
లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉన్నాము. నేను ఇలా అనుకున్నాను. మీరు రండి' అని చెప్తే, వాళ్ళు సంతోషంగా వచ్చారు. బాబా, లక్ష్మీనరసింహస్వాముల దయవల్ల మా తమ్ముడికి క్రియాటిన్ లెవెల్ తగ్గి 1.1 దగ్గర ఉండేలా చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
టాబ్లెట్ వేసుకోకపోయినా ఏ సమస్యా రాకుండా దయచూపిన బాబా
సాయి భక్తులందరికీ ప్రణామాలు. సాయిని దృఢంగా విశ్వసించే లక్షలాదిమంది భక్తులలో నేను ఒక దానిని. నాకు పెళ్ళై 5 నెలలు అవుతుంది. కొత్తగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. మూడేళ్ళ క్రితం నాకు థైరాయిడ్ సమస్య వచ్చింది. దానికోసం నేను రోజూ తప్పనిసరిగా ఒక టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంది. లేకపోతే నిద్రపోయేటప్పుడు గురక వస్తుంది. అలాంటిది నేను టాబ్లెట్లు మా అమ్మ వాళ్ళింట్లో మార్చిపోయాను. అందువల్ల 'నేను నిద్రపోయే సమయంలో నాకు ఒకవేళ గురక వస్తే, అత్తింట్లోవాళ్ళు ఏం అనుకుంటారో!' అని చాలా భయమేసి పడుకునే ముందు బాబాకి నమస్కరించుకొని, ఊదీ పెట్టుకొని, "బాబా! నాకు గురక రాకుండా చూడు" అని బాబాను ప్రార్ధించాను. ఆయనని తలచిన మరుక్షణంలో మన చెంత ఉంటారు. బాబా దయవల్ల 5 రోజులపాటూ నేను టాబ్లెట్లు వేసుకోకపోయినా నాకు ఏ సమస్య రాలేదు. "చాలా ధన్యవాదాలు బాబా".

Om Sairam
ReplyDeleteSai always be with me
Omsairam
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDeleteBaba ma family lo andaru healthy ga undela chudu thandri 🙏🙏🙏🙏
ReplyDelete