ఈ భాగంలో అనుభవం:
- అడిగిన ప్రతి విషయంలో సహాయం చేసిన బాబా
సాయినాథునికి నా నమస్కారములు. నా పేరు శ్వేత. మేము బెంగళూరులో ఉంటున్నాము. ఇటీవల బాబా నాకు చేసిన సహాయాల గురించి పంచుకుంటున్నాను. 2025, సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం వచ్చింది. ఆరోజు మావారు, నేను టూవీలర్‌పై బయటకు వెళ్లి కావలసిన సరుకులు కొనుక్కున్నాము. తర్వాత బండి ఎక్కేటప్పుడు నేను నా అరిచేతిని బండి సీటుపై బలంగా పెట్టడంతో ఆ ఒత్తిడికి నా కుడిచేతి బొటనవేలు కిందగా లటక్‌మని శబ్దమొచ్చి, వెంటనే వాపు కూడా వచ్చింది. చాలా తీవ్రంగా నొప్పేసి బాధను తట్టుకోలేకపోయాను. ఒక పక్క ఆ బాధ అయితే ఇంకోవైపు గ్రహణం తర్వాత ఇల్లు శుద్ధి చేయాలి, దేవుడి విగ్రహాలు, ఫోటోలు కడగాలి. ఆ పనులు చేయడానికి ఇంటిలో ఇంకెవరూ లేరు. అందుచేత, "ఆ పనులన్నీ దెబ్బ తగిలిన చేతితో ఎలా చేయాలి?" అని బాబా ముందర ఏడ్చేసాను. "ఏదేమైనా నా చేత పనులు చేయించాల్సిన బాధ్యత మీదే" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంట్లో అందరూ వాపు చాలా ఎక్కువగా ఉన్నందున హాస్పిటల్‌కి వెళదామన్నారు. కానీ నేను వాళ్ళకి ఏదో విధంగా నచ్చజెప్పి హాస్పిటల్‌కి వెళ్ళలేదు. కారణం, నాకు బాబా మీద ఉన్న నమ్మకం. ఆరోజు రాత్రి పడుకునేముందు నీటిలో ఊదీ కలిపి తాగి, కొంత ఊదీ వేలికి రాసుకొని పడుకున్నాను. కానీ పొద్దున్న లేచేసరికి నొప్పి అలానే ఉండటంతో, 'బాబా! ఇలా చేశారేంటి? పనులన్నీ ఎలా చేయాలి?' అని మనసులో అనుకున్నాను. అయితే, కాసేపట్లో ఒక అద్భుతం జరిగింది. నేను స్నానం చేసి బయటకు వచ్చేసరికి వేలు నొప్పి 50 శాతం తగ్గిపోయింది. ఇదెలా సాధ్యమని నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, కనీసం వేలు కదపలేనంత నొప్పిగా ఉండింది. రానురానూ నొప్పి 80% తగ్గింది. ఎలాగో అలా పని అంతా పూర్తి చేశాను. నాలుగైదు రోజుల్లో నొప్పి, వాపు అన్నీ తగ్గిపోయాయి. నిజం చెప్పాలంటే ఎముక విరిగితేనే వాపు, నొప్పి వస్తాయి. ఇది కేవలం బాబా దయ. నూటికి నూరు శాతం మా బాబా మిరాకిల్.
2025, సెప్టెంబర్ 20న మా రెండేళ్ల పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. తనకి చాలా ఎక్కువగా జ్వరం(104 డిగ్రీలు) వచ్చింది. జ్వరంతోపాటు ఉన్న దగ్గు, జలుబు తొందరలోనే తగ్గిపోయాయి కానీ, జ్వరం తగ్గలేదు. పాపకు అన్ని రకాల టెస్టులు చేస్తే, అన్ని నార్మల్ వచ్చాయి. అప్పుడు ఒకసారి గుండెకు సంబంధించిన టెస్ట్ చేయాలన్నారు. ఆ మాట వినగానే నా కాళ్లూ చేతులు వణికిపోయాయి. "పాపకు ఏ సమస్య లేదని రిపోర్టు రావాల"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులో ఏ సమస్య లేదని వచ్చింది. ఒక వారం తర్వాత అంటే 2025, సెప్టెంబర్ 27న పాప పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ శుభ్రం చేద్దామని జిప్ ఓపెన్ చేస్తే, అందులో నుండి ఒక ఎలుక బయటకు వచ్చి మా ఇంటిలోని ఒక గదిలోకి వెళ్లిపోయింది(అది హాస్పిటల్లో ఉన్నప్పుడు నా హ్యాండ్ బ్యాగులో చొరబడింది. నేను అది గమనించలేదు). నేను బాబాని, "ఎలుక రూపంలో ఉన్న మీరు, దయచేసి బయటకు వెళ్ళండి" అని ప్రార్థించాను. కానీ ఆ ఎలుక బయటకు వెళ్లలేదు. 'సరే బాబా! మీ ఇష్టం. మీకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్ళండి' అని ఊరుకుండిపోయాను. 2025, అక్టోబర్ 10న ఆ ఎలుక ర్యాట్ మ్యాట్‌పై పడింది. దానిని ఇంటికి దూరంగా బయట పట్టేసి వచ్చేసాము. ఎలుక అన్ని రోజులు మా ఇంట్ల ఉన్నా ఏ ఇబ్బంది పెట్టలేదు, ఏదీ కొరకలేదు.
ఒకరోజు మా ఇంటి గుమ్మంలో నాకు ఒక నల్లి కనిపించింది. తర్వాత రెండు రోజులకి తల దిండు వద్ద మళ్ళీ కనిపించింది. ఆ తర్వాత వారంలో మావారి బనీన్ లోపల కనిపించింది. ఇలా వరుసగా కనిపిస్తూ ఉండేసరికి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, అవి ఇంటిలో కనిపిస్తే దరిద్రం, కష్టాలు వస్తాయని అంటారు. అందుకని బాబాని, "దయచేసి ఈ రూపంలో ఉన్న మీరు బయటకు వెళ్లిపోండి. దయచేసి ఈ రూపంలో ఎప్పటికీ కనిపించకండి" అని వేడుకున్నాను. అలా ఎందుకంటే, సాయి ప్రతి జీవిలోనూ ఉన్నారు కదా! రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు నీటిలో బాబా ఊదీ కలిపి ఇంట్లోని అన్ని గదుల్లో, అన్ని మూలల్లో చల్లాను. అలా మూడు రోజులు చేశాక నల్లులు కనిపించలేదు. "ఆ రూపంలో వున్న మిమ్మల్ని బయటకు పొమ్మన్నందుకు నన్ను మన్నించండి బాబా. మీ దయ ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి. అందరి కష్టాలు తొలగించండి. మీ కరుణ లేని ఈ ప్రపంచాన్ని ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. దయచేసి ఈ భూమిపై మాకు ప్రాణమున్నన్ని రోజులు మీ దయ ఇలానే మాపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".

Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sai Ram 🙏🙏🙏🙏
ReplyDelete