ఈ భాగంలో అనుభవాలు:
1. సురక్షితంగా USA చేర్చిన బాబా
2. నమ్మిన వారి వెన్నంటే నిలిచి కాపాడే సాయినాథుడు
సురక్షితంగా USA చేర్చిన బాబా
నా పేరు మానస. ఈ బ్లాగ్ వల్ల మేము చాలా ప్రశాంతంగా ఉంటున్నాము. 2024, డిసెంబర్లో మా చెల్లెలు USA వెళ్లేందుకు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళింది. అప్పుడు నేను, "ఇంటర్వ్యూ విజయవంతమవ్వాల"ని బాబాని వేడుకున్నాను. బాబా మా చెల్లిపై దయ చూపారు. తన ఇంటర్వ్యూ విజయవంతమై స్టాంపింగ్ అయింది. ఇది నిజంగా బాబా లీల. ఎందుకంటే, చాలామందిని తిరస్కరిస్తున్న సమయమది. తర్వాత USA వెళ్ళడానికి కేవలం 10 రోజులే ఉండింది. అది చాలా తక్కువ సమయం. అంత తక్కువ వ్యవధిలో మా చెల్లెలికి USAలో సీటు వచ్చిన కాలేజీకి దగ్గరలో ఉండటానికి రూమ్ దొరకడం కష్టమైన విషయం. అందుకు కాస్త సమయం పడుతుంది. కాబట్టి నేను బాబాని, "ప్లీజ్ బాబా! మంచి రూమ్ తొందరగా దొరికేలా సహాయం చేయండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మా చెల్లి USA వెళ్ళడానికి ముందురోజు రూమ్ దొరికింది.
మామూలుగా అయితే USA చేరుకున్నాక యూనివర్శిటీవాళ్ళు మా చెల్లిని పికప్ చేసుకుంటారు. కానీ, తను కొంచెం ముందుగా USA వెళ్ళింది. అందువల్ల USAలో మా చెల్లిని స్వాగతించడానికి ఎవరూ లేరు. మా బంధువులు చాలామంది USAలో ఉన్నారు కానీ, వాళ్లంతా వేరే స్టేట్స్లో ఉన్నారు. కాబట్టి వేరే దారిలేక మా చెల్లి క్యాబ్ బుక్ చేసుకుంటానని చెప్పింది. కానీ నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, మా చెల్లి చాలా చిన్నది. తనకి కేవలం 19 సంవత్సరాలు. అందుకని నేను, "సహాయం చేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. బాబా చమత్కారం చూపించారు. మా చెల్లి బయలుదేరిన విమానం మొదట సింగపూర్లో దిగింది. అప్పుడు మా కజిన్ బ్రదర్ తనకి ఫోన్ చేసి, "నువ్వే వెళ్లే శాన్ఫ్రాన్సిస్కోలో నా స్నేహితుడు ఉన్నాడు. అతను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు. చింతించాల్సిన పనిలేదు" అని చెప్పి అతని నెంబర్ ఇచ్చాడు. అలాగే అతను ఎయిర్పోర్ట్కి వచ్చి మా చెల్లిని పికప్ చేసుకున్నాడు. అలా బాబా దయవల్ల మా చెల్లెలు సురక్షితంగా USA చేరుకుంది. "ధన్యవాదాలు బాబా".
నమ్మిన వారి వెన్నంటే నిలిచి కాపాడే సాయినాథుడు
శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు.