సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2017వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇబ్బందులు లేకుండా చూసిన బాబా
2. శ్రీసాయి కృప

ఇబ్బందులు లేకుండా చూసిన బాబా

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా  కోమలవల్లి. నేను తిరుమల వెళ్ళి 4 సంవత్సరాలైంది. ఎందుకంటే, మావారు ఎక్కడికీ వెళ్ళకూడదంటారు. అందుకని గొడవపడి గుడికి వెళ్ళడం ఇష్టం లేక నేను మౌనంగా ఉండేదాన్ని. నేను చాలావరకు నాకు తెలిసిన వారందరికీ తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేస్తూ ఉంటాను. అందరూ 'నువ్వు కూడా బుక్ చేసుకో. మేము చూసుకుంటాము' అని అంటుంటారు. అయినా ఎందుకు గొడవని నేను వదిలిసేదాన్ని. మనసులో మాత్రం ఎప్పుడు తిరుమల వెళ్తానో అని అనుకునేదాన్ని. ఇలా ఉండగా 2025, ఏప్రిల్ నెల టికెట్లు విడుదలైనప్పుడు మా నాన్న, 'నన్ను మా అబ్బాయిని కూడా బుక్ చేసుకోమని, అప్పుడు వీలుకాకపోతే చుద్దాం. ఇప్పుడే ఆలోచన ఎందుకు?' అని అన్నారు. నేను సరేనని మా అమ్మ, నాన్నలతోపాటు నాకు, మా అబ్బాయికి జూలై 1న తిరుమల దర్శనానికి టిక్కెట్లు బుక్ చేశాను. ప్రయాణానికి ఒక వారం ముందు మావారికి విషయం చెప్తే, ఆయన రోజూ సాయంత్రం గొడవ చేస్తుండేవారు. ప్రయాణానికి ముందురోజు కూడా కొద్దిసేపు గొడవపడి మౌనంగా నిద్రపోయారు. అప్పుడు నేను సోషల్ మీడియా చూస్తుంటే, "రేపు నీ ప్రయాణంలో తోడుగా నేను వస్తాను" అన్న బాబా మేసేజ్ కనిపించింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. మర్నాడు మావారు మా ప్రయాణానికి అంగీకరించడంతో మేము తిరుమలకు ప్రయాణమయ్యాము. మాకు రెండు గంటలలో స్వామివారి దర్శనమైంది. తర్వాత మా నాన్న, "మన తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో! తిరుచానురు వెళదాము" అని అన్నారు. సరేనని తిరుచానూరు వెళితే, అక్కడ లాకర్‌లో మా లగేజీ పెట్టె చోట పెద్ద బాబా ఫోటో దర్శనమిచ్చింది. అప్పుడు ఆరోజు బాబా ఇచ్చిన సందేశం గుర్తుకు వచ్చి 'నాకు తోడుగా బాబా వచ్చారు' అని చాలా ఆనందమేసింది. అమ్మవారిని  దర్శించుకొని మావారికి చెప్పిన సమయం కల్లా నేను ఇంటికి చేరుకున్నాను. బాబా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. "ధన్యవాదాలు బాబా".

మా అబ్బాయి మదనపల్లి దగ్గర రెడ్డమ్మ అమ్మవారి అనుగ్రహంతో పుట్టాడు. నేను తను రెడ్డమ్మ కొండకు వెళ్ళినప్పుడు తనకి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. అయితే వాడు ఒకసారి మా అమ్మాయి, అల్లుడుతో రెడ్డమ్మ గుడికి వెళ్ళాడు కానీ, గుండు చేయించుకోలేదు. ఆ కారణంగా ఏమో వాడికి మాటలు నత్తినత్తిగా వస్తుంటే, నేను మళ్ళీ వాడిని గుడికి తీసుకెళ్లి గుండు కొట్టిస్తానని అనుకున్నాను. కానీ ఒక సంవత్సరం ప్రయత్నించినా మావారు ఒప్పుకోలేదు. చివరికి 2025, జూలై నెలలో మావారితో గొడవపడి 'మధ్యాన్నం కల్లా వచ్చేస్తాను. ఇప్పుడు వాడు పదవ తరగతి చదువుతున్నాడు. మళ్ళీ వెళ్ళడానికి కుదరద'ని ఎంతో నచ్చచెప్పి నేను, మా అబ్బాయి బయలుదేరాము. అయితే సాధారణంగా వెళ్లే మార్గం కాకుండా 3 గంటల సమయం పట్టె కొత్త మార్గంలో వెళ్లాలని అనుకున్నాను. ఆ మార్గంలో బస్సులు దొరకవని అన్నా, "బాబా! మేము మధ్యాహ్నం 2 గంటల కల్లా ఇంటికి వచ్చేయాలి. నువ్వే నాకు దిక్కు" అని అయన మీద భారమేసి ఆ మార్గంలోనే వెళ్ళాను. కొత్త మార్గమైనప్పటికీ బాబా దయవల్ల బస్సులు, ఆటోలకోసం ఒక్క నిమిషం కూడా వేచి చూసే పని లేకుండా, ఎక్కడా ఇబ్బందిపడకుండా మా అబ్బాయికి గుండు కొట్టించి, అమ్మవారి దర్శనం చేసుకొని మధ్యాహన్నం 2 గంటల కల్లా ఇంటికి తిరిగి వచ్చేసాను. బాబా మీద భారమేస్తే, మనకు ఎప్పుడు ఏది కావాలో ఆయన చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. నా కూతురికి ఒక బిడ్డను ప్రసాదించు బాబా".

సర్వం సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు.

శ్రీసాయి కృప

ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు ఉష. నేను చాలా ఇబ్బందులలో ఉన్నప్పుడు బాబా నాకు చాలా అండగా ఉన్నారు. ట్యూషన్ చెప్తేనే నాకు ఇంట్లో జరుగుతుందని నేను పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు మొదట ఒకేఒక్క అమ్మాయి వచ్చింది. అప్పుడు నేను, "స్వామీ! ట్యూషన్‌కి పిల్లలు బాగా వచ్చేటట్టు చూడు" అని బాబాని వేడుకున్నాను. ఆ మరుసటిరోజు నుంచే ట్యూషన్‌కి పిల్లలు ఎక్కువగా రావడం మొదలైంది. ఒకరితో మొదలై 30 మంది వరకు పిల్లలయ్యారు. ఇప్పటికీ నేను నాకు ఏ బాధ వచ్చినా బాబాని తలుచుకుంటాను. "ధన్యవాదాలు బాబా".

4 comments:

  1. Om Sai Ram please cure my husband viral fever and asma he is suffering very much.Be with him.Bless him.please bless my family 🙏🙏

    ReplyDelete
  2. Om Sai Ram please cure my husband viral fever and asma he is suffering very much.Be with him.Bless him.please bless my family 🙏🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo