సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2039వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహం
2. బాబా దయ
3. ఒక్క రాత్రిలో అనుగ్రహించిన బాబా


బాబా దయ

శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. నా పేరు అనుజ. మేము 2025, అక్టోబర్ 3న బయలుదేరి 4వ తేదీకి తిరుపతి చేరుకున్నాము. మేము చేరినప్పటినుండి అక్కడ తిరుపతిలో భారీ వర్షం కురవసాగింది. నేను చాలా భయపడి, "బాబా! మేము మా ఇంటికి తిరిగి చేరేవరకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల 3 రోజులు పడుతుందన్న వర్షం 3 గంటలలో ఆగిపోయింది. మేము తిరిగి ఇల్లు చేరేవరకు లేదు. అంతేకాదు, మేము కేవలం తిరుమల, తిరుపతి దర్శించుకొని వద్దామనుకున్నప్పటికీ బాబా దయవల్ల ఏ ప్రణాలికా లేకుండా కాణిపాకం, గుడిమల్లం, తిరుచానూరు, వకుళమాత, గోవిందరాజస్వామి ఆలయాలు ఇలా అన్నీ స్థలాలు ఎలాంటి సమస్యలు లేకుండా దర్శించి వచ్చాము. నాకున్న నెలసరి సమస్య కూడా లేకుండా చూశారు ఆ సాయితండ్రి. "చాలా చాలా దాన్యవాదాలు బాబా. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్దం కావటం లేదు. మమ్మల్ని ఎల్లప్పుడూ మీ చల్లని నీడలో వుండేట్లు చూడు తండ్రి. అలాగే అందరిని చల్లగా చూడు తండ్రి. నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు సాయి".


ఒక్క రాత్రిలో అనుగ్రహించిన బాబా

నా పేరు అపర్ణ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాబాయే నా ప్రపంచం. నా జీవితంలో బాబా చేసినవి లెక్కలేనన్ని. మంచి భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నానంటే అది బాబా దయే. ఈ బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతుంటే, అవి మమ్మల్ని బాబాకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఈ బ్లాగు ఒక దేవాలయం వంటిది. ఇక నా అనుభవానికి వస్తే, మా పాపకి 9 నెలల వయసు. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండే తనలో అన్నప్రాసన కార్యక్రమం అయ్యాక చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఎందుకలా ఉంటుందో తెలిసేది కాదు. కొంతమంది దిష్టి అంటే, దిష్టి తీశాం. అయినా ఏ మార్పూ లేదు. పాప వారం రోజులు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు నేను, "బాబా! పాప ఇదివరకటిలా ఉండాలి" అని బాబాకి చెప్పుకున్నాను. రాత్రి పడుకునేముందు అలా బాబాకి చెప్పుకున్నాను, ఉదయానికి పాప మునుపటిలా ఉంది. ఒక్క రాత్రిలో అంత మార్పు. అంతా బాబా దయ. ఆయన చాలా చాలా సహాయం చేస్తున్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

10 comments:

  1. Jai sairam maharaj ki jai

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om sri sairam 🙏🙏🙏

    ReplyDelete
  4. Om Sairam manamu manaspoorthy ga ,kalmashamu lekun da babanu adigithe manaku daari kachithanga chupisthadu sai.Manaku Baba meeda namankanmu kalagatamu mana adrushtam.Baba oka aabharanam.Enni addankulu vachina Nammakam vadalavaddu.Anni sai chusukuntaru.

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🙏

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Om Sai Ram today is my son -in-law birthday 🎂💐 please 🙏🙏 bless him with full aayush. Please 🙏🙏 bless my husband and children 🙏 with full aayush tandri.i am feeling little depression cure and be with us and bless us

    ReplyDelete
  8. Saisaisaisaiomsairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  9. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo