సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2072వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • చివరి నిమిషం అద్భుతాలు బాబా మాత్రమే చేయగలరు!!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయినాథాయ నమః: సాయి బంధువులందరికీ నమస్కారాలు, నా పేరు విజయ. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు నాకు బాబా గురించి తెలిసింది. అప్పటినుండి నేను అడిగినవి, మనస్సులో 'ఇలా అయితే బాగుంటుంది కదా బాబా!!' అని అనుకున్నవి, ఇలా ప్రతిదీ నెరవేరుస్తున్నారు బాబా. నేను ఎవరితోనూ అంతగా కలవలేను. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నాకు అన్ని బాబానే. ఒక ఫ్రెండ్‌కి చెప్పుకున్నట్లు అన్ని బాబాతోనే చెప్పుకుంటాను. నేను పొద్దున్న నిద్రలేచినప్పటినుండి రాత్రి నిద్రపట్టే చివరి నిమిషం వర\కు 'సాయి సాయి.. బాబా బాబా' అనుకుంటూ ఉంటాను. బాబా వల్లనే నేను ఈరోజు యుఎస్ఏలో వున్నాను. నాకు ఒక బాబు(సెకెండ్ ఇయర్ అండర్ గ్రాడ్‌లో వున్నాడు), ఒక పాప(నాలుగు చదువుతుంది). నేను H1B వీసా మీద వున్నాను. నా భర్త H4 EAD మీద రెస్టారెంట్ బిజినెస్ పెట్టుకున్నారు. అంత బాగానే వుంది అనుకుంటుంటే, 2025, జూలైలో నా ఉద్యోగం కాంట్రాక్ట్ అయిపోయింది. వేరే ఉద్యోగం చూసుకుందామంటే, H1B వీసా మీద ఉన్నవాళ్ళకి ఎవరూ ఉద్యోగ అవకాశం ఇవ్వని పరిస్థితి. అందువల్ల నేను పనిచేసిన కన్సల్టెన్సీవాళ్ళు 2026, ఫిబ్రవరి 6న 'ఫిబ్రవరి 20 లోపు ఏదో ఒక ఉద్యోగం కన్ఫర్మ్ అవ్వకపోతే, H1B వీసా రద్దు చేసేస్తామని' మెయిల్ పెట్టారు. నాకు చాలా టెన్షన్ వేసింది. ఏమి చేయాలో తెలియలేదు. "బాబా! ఏదో ఒక దారి చూపించు తండ్రీ" అని వేడుకొని 'సాయి సాయి' అని ఏడుస్తుంటే, హఠాత్తుగా ఒక పాత కంపెనీ ఒక సీనియర్ మేనేజర్ గుర్తుకు వచ్చారు. ఆ మేనేజర్‌కి ఫోన్ చేస్తే, చాలా బాగా మాట్లాడారు. నేను నా పరిస్థితి చెప్తే, అర్థం చేసుకుని "టెక్నికల్ ఇంటర్వ్యూ పెట్టిస్తాను. అది విజయవంతంగా పూర్తిచేస్తే, వెంటనే ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తాను" అన్నారు.

ఫిబ్రవరి 13న ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత రెండురోజులు వారాంతం, ఆ మర్నాడు సోమవారం కూడా సెలవు వచ్చింది. అందుచేత ఫిబ్రవరి 17, మంగళవారం ఏమైనా చెప్తారేమోనని నేను ఆశగా చూసాను. కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఫిబ్రవరి 18న నా కన్సల్టెన్సీవాళ్ళు మళ్ళీ మెయిల్ చేసి, 'ఫిబ్రవరి 20లోపు ఉద్యోగ విషయం తేలకపోతే, ఫిబ్రవరి 27 చివరి తేదీ" అని తెలియజేసారు. నేను ఆ మేనేజర్‌కి ఫోన్ చేస్తే, 'తను ఎక్కడో కాన్ఫరెన్స్‌లో వున్నానని, ఫిబ్రవరి 20న తిరిగి వస్తానని, వచ్చాక ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు మెయిల్ పెడతానని' అన్నారు. ఆ విషయం కన్సల్టెన్సీవాళ్ళకి తెలియజేసి ఫిబ్రవరి 20, ఉదయం 6 గంటల నుండి నేను నా మెయిల్స్ చూస్తూనే ఉండగా కన్సల్టెన్సీ వాళ్ళమో గంటగంటకి ఫోన్ చేసి, 'ఇంకా మెయిల్ రాలేదు' అని అడగసాగారు. నాకు తెలిసిన ‌ఆ మేనేజర్‌ని అడుగుదామంటే, అన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తే అసలుకే వద్దంటారేమోనని భయపడి, "బాబా! ఏదో ఒకటి చేసి ఈ పరిస్తితి నుంచి నన్ను గట్టెక్కించండి" అని నా సాయితండ్రిని అడుగుతూ గడిపాను. ఇంకా బాబా సంకల్పమో ఏమోగానీ 12 గంటలకి నేను ఆ మేనేజర్‌కి ఫోన్ చేస్తే, 'తను తెల్లవారుజామున ఇంటికి వచ్చానని, ఆ వారంలోని పెండింగ్ పనులు చేసుకోవడంలో నిమగ్నమై నా విషయంలో సోమవారం అంటే ఫిబ్రవరి 23న మెయిల్ చేద్దామనుకున్నానని' చెప్పారు. అప్పుడు నేను నా పరిస్థితి గురించి మరోసారి గుర్తుచేసాక ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాజెక్ట్‌లో నన్ను తీసుకుంటున్నట్లు మెయిల్ చేసారు. ఈ అద్భుతం బాబా వల్లనే జరిగింది. ఎంత ప్రయత్నించినా ఒక్క సానుకూల స్పందనా రాని పరిస్థితిల్లో చివరి నిమిషం అద్భుతాలు బాబా మాత్రమే చేయగలరు. ఆ దేవదేవుడైన ఆ సాయినాథుని పూర్తిగా నమ్మి, ఆయన మీద భారమేస్తే ఇంటి పెద్దల చూసుకుంటారు దయగల తండ్రి.

ఇకపోతే, ఆ మెయిల్ వచ్చాక సోమవారం హెచ్ఆర్ వాళ్ళు తదుపరి వర్క్ మొదలుపెడతారని చెప్పారు. కానీ అది జరగలేదు. నా ప్రస్తుత కంపెనీవాళ్ళు ఫిబ్రవరి 27 చివరిరోజని, ఆలోపు జాబ్ కన్ఫర్మ్ అవ్వకపోతే వీసా రద్దు అవుతుందంటున్నారని నా పరిస్థితి గురించి ముందే చెప్పి ఉన్నప్పటికీ ఫిబ్రవరి 23, సోమవారం నుంచి ఫిబ్రవరి 26, గురువారం వరకు రోజూ ఇమెయిల్ పెట్టినా, ఫోన్ చేసినా వాళ్ళు అస్సలు స్పందించలేదు. ఆ విషయం గురించి నేను రోజూ బాబాని అడుగుతుంటే, 'నీ ఉద్యోగ సమస్య పరిష్కారమవుతుంది', 'నువ్వు శుభవార్త అందుకోబోతున్నావు', 'అతి త్వరలోనే చివరి నిముషంలో అద్భుతం నిన్ను చేరనుంది, నీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లనుంది' అని ఎటు చూసినా సానుకూల సందేశాలు అందుతుండేవి. అయినా చివరి గడువు ఫిబ్రవరి 27వ తేదీ అని గుర్తొచ్చి భయాందోళనలకు గురవుతుండేదాన్ని. గురువారం పొద్దున్న మామూలుగా కంపెనీవాళ్ళకి మెయిల్ చేసి, బాబాతో నా ఆందోళన గురించి చెప్పుకుని, "నా పరిస్థితి చక్కబెట్టమ"ని అడిగాను. 'తర్వాత మీరు నిజంగానే మీ బిడ్డలందరితో ఉన్నట్టు నాతో కూడా ఉన్నట్టైతే, నా పక్కనుండి నా పరిస్థితి గమనిస్తున్నట్టైతే నాకు నిదర్శనం ఇవ్వండని' అనుకుంటూ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో భక్తుల అనుభవాలు చదువుతున్నాను. అంతే! ఆ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. ముందు నాకు సారీ చెప్పి, "అందరూ కొత్త ప్రాజెక్ట్ పనిలో బిజీగా వుండి స్పందించలేదు. ఇప్పుడే హెచ్ఆర్‌తో చెప్పి పేపర్ వర్క్ మొదలు పెట్టిస్తాన"ని చెప్పారు. నా బాబా నాతో వున్నానని, ఆర్తితో పిలిస్తే తప్పకుండ పలుకుతానని ఋజువు చేసారు. ఎన్ని సంవత్సరాల నుండి మనకి ఆ తండ్రి తెలిసినా, పరిస్థితులను బట్టి మళ్ళీ మళ్ళీ నిదర్శనాలు అడుగుతూనే ఉంటాం. దయగల తండ్రి మాత్రం తల్లిలా ప్రేమని కురిపిస్తునే వుంటారు. ఆయన తమ బిడ్డలు ఎప్పుడు పిలిచినా పలుకుతారు. ఆ తండ్రి పలికేవరకు మనకి ఓర్పు ఉండాలి. "అలా ఓర్పుతో ఉండగలిగే శక్తి ఇవ్వండి తండ్రీ. ఎప్పటికీ నన్ను మీ పాదాల నుండి దూరం చేయకండి. నేను ఏమైనా తప్పులు చేసుంటే క్షమించండి బాబా. నాకు, నా కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉండండి. అమ్మానాన్నలని, అక్క, చెల్లి, అన్నయ్య వాళ్ళ కుటుంబాలకి, ఇంక అందరికీ ఎప్పుడూ అండగా ఉండి మా కష్టాలు దాటేలా చూడండి సాయితండ్రీ. చివరిగా మీకు అనంతకోటి వందనాలు తండ్రీ. ఏమి చెప్పినా, ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే సాయి మీకు".

ఓం సాయినాథాయ నమః

సర్వేజన సుఖినోభవంతు
లోకా సమస్త సుఖినోభవంతు.

10 comments:

  1. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  2. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.

    ReplyDelete
  3. OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI
    OMSAISRISAI JAYAJAYASAI

    ReplyDelete
  4. Omsaisrisaijayajayasai

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. Baba .. neeku tappa evariki cheppukolenu.. nuvvu matrame artham chesukogalavu.. Tanu natho gatham lo pravarthinchina vidhananiki prastutam tanatho sakhyatha ga undaleka potunna.. Tanu telisi cheatondo teliyaka chestondo.. tana behaviour, velethi chupe vidhanam valla na asthma viswasam kolpotunnanu, chala chirakuga anipistondi.. tanu ika maradu.. Ela baba.. tanu na kutumba sabhyuralaina, okate intlo untunna kani Thana tho naku matladalani ledu baba 😢

    ReplyDelete
  8. Baba nuvve dikku. Ne help chala chala avasaram baba. Daya chupandi baba. Please please help me. Naku dikku ledhu baba please help me please..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo