సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2070వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి ఉంటే కానిది ఏమీ లేదు!
2. జ్యోతిర్లింగ దర్శనభాగ్యం ప్రసాదించిన బాబా

సాయి ఉంటే కానిది ఏమీ లేదు!
 
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. అందరికీ నమస్తే! నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు ఆల్టెన్‌ కంపెనీలో పనిచేశాను. దురదృష్టవశాత్తు నేను ఆ కంపెనీలో చేరి 8 నెలలు కాకముందే నా క్లయింట్‌తో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ముగిసింది. దాంతో నేను బెంచి మీద ఉండాల్సి వచ్చింది. చివరికి కంపెనీవాళ్ళు 3 నెలల నోటీసు పీరియడ్ ముగిసేలోపు వేరే ఉద్యోగం వెతుక్కోమని చెప్పారు. దాంతో నేను ఒకపక్క నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మరోపక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. కానీ నాకు హెచ్ఆర్ కాల్స్ రాలేదు. అప్పుడు నేను సాయిబాబాను ప్రార్థించడం ప్రారంభించాను. తర్వాత బాబా దయతో నాకు ఇంటర్వ్యూ కాల్స్ రావడం మొదలై 2, 3 కంపెనీలకు ఎంపికయ్యాను. కానీ ఆఫర్ లెటర్ రాలేదు. నేను బాబాతోపాటు హనుమాన్‌ని కూడా ప్రార్థించాను. ఆ 2-3 కంపెనీలు ప్రతిస్పందించాయి. నేను తుది నిర్ణయం తీసుకొనే ముందు ఏ కంపెనీని ఎంచుకోవాలని సాయిని అడిగి సాయి సూచననుసరించి 'బిగ్ 4' కంపెనీలో చేరి మంచి గుర్తింపు పొందాను. గతంలో సాయి ఆల్టెన్‌ కంపెనీ ఎంచుకోవద్దని సూచించినప్పటికీ నేను ఆ కంపెనీలో చేరి సాయి మాట వినకపోవడం వల్ల కొన్ని నెలల్లోనే ఉద్యోగం వెతుక్కోవాల్సి వచ్చింది. అది అర్థమయ్యాక నాకు సాయిపై నమ్మకం పెరిగి ఇంకెప్పుడూ సాయి వద్దని పని చేయకూడదని నిశ్చయించుకున్నాను. నన్ను క్షమించి అన్ని ఇబ్బందులలో సహాయాన్ని, బలాన్ని ఇస్తున్న సాయికి ధన్యవాదాలు.

ఇప్పుడు మా అమ్మ అనుభవాలు ఆమె మాటల్లోనే చదవండి. అందరికీ నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళై 26 సంవత్సరాలైన మాకు సొంతిల్లు లేదు. మాకు ఒక స్థలం ఉంది. దాంట్లో ఇల్లు కట్టాలని మావారు అనేవారు. కానీ ఆ స్థలంకి లోన్ రాదు, మొత్తం డబ్బులు పెట్టి కట్టే స్తోమత లేదు. అందుచేత ఫ్లాట్ తీసుకోవాలని ఉండేది. కానీ మావారికి ఫ్లాట్స్ ఇష్టముండేది కాదు. నేను సాయిని, ఇంకా దేవుళ్లందరినీ, "మాకు ఇంతవరకు సొంతిల్లు లేదు. మాకు ఒక ఇల్లు ప్రసాదించండి" అని వేడుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండగా 2024, నవంబరులో మావారు మాకున్న లారీ అమ్మేశారు. ఆ డబ్బులు వచ్చాక నేను మావారు ఆ డబ్బు దేంట్లో పెట్టుబడి పెడతారో  అని భయపడి, "సాయీ! ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. సాయి దయ చూపారు. అప్పటివరకు ప్లాట్స్ అంటే ఇష్టపడని మావారు ఒక ప్లాట్ చూడడం, అది నచ్చడం, తన దగ్గరున్న డబ్బు నుండి కొంత అడ్వాన్స్ కట్టడం జరిగిపోయాయి. 15 రోజుల్లో లోన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంక్షన్ అయి 2025, జనవరి 10వ తారీఖు కల్లా రిజిస్ట్రేషన్ కూడా అయింది. సాయి ఉంటే కానిది ఏమీ లేదు.

2025, ఫిబ్రవరి 9న మా అమ్మ చనిపోయింది. ఆ సమయంలో మావారు ఊర్లో లేరు. కొన్ని కారణాల వల్ల రాలేదు. ఆ విషయమై నేను, మా పిల్లలు, మా పుట్టింటివాళ్ళు అందరం చాలా బాధపడ్డాం. నా అన్నదమ్ములు మీ కార్యక్రమాలకు మేము రామన్నారు. నేను, "ఏమి చేయగలను సాయి?" అని సాయితో అనుకున్నాను. సరిగ్గా నాలుగు నెలల తర్వాత మే 9న మేము మా ఇంటి గృహప్రవేశం పెట్టుకున్నాము. అప్పుడు, "గృహప్రవేశానికి మా పుట్టింటి తరఫువాళ్ళు రాకపోతే ఎలా తండ్రీ? ఎటువంటి గొడవలు, ఆటంకాలు లేకుండా కార్యక్రమం సక్రమంగా జరిగేలా చేయండి" అని సాయిని ప్రార్థించాను. సాయి దయవల్ల నా అన్నదమ్ములు గృహప్రవేశానికి వచ్చారు. అసలు రామన్నవాళ్ళు రావడమే కాకుండా ఇంటి పనులు దగ్గరుండి చేయించి మొత్తం కార్యక్రమమంతా జరిపించారు. ఇది సాయి కృపాకటాక్షం. "ధన్యవాదాలు సాయి".


7 comments:

  1. Om Sai Rakshak saranam devaa

    ReplyDelete
  2. Om sai ram tandri, tandri ofce lo job ki ye problem lekunda chudandi tandri pls, meeru chepte join aina company nv echina job tandri edi, ye problem lekunda anta bagunde la chudandi tandri pls, amma nannalani Ammamma tatayalani ayur arogyalatho anni velala kshamam ga kapadandi tandri pls.

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo