ఈ భాగంలో అనుభవాలు:
- నొప్పి నుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
- సాయిబాబాకు చేసిన ప్రార్థన - నయమైన తలనొప్పి
నొప్పి నుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా
నా పేరు షర్మిల. నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ అనే ఆరోగ్యసమస్య ఉంది. లాక్‌డౌన్ సమయంలో నా ఎడమకాలి పాదం మీది ఎముక బుడిపె లాగా పైకి వచ్చింది. జూన్ 8వ తేదీ నుండి డాక్టర్లు అందరూ రోగులను చూస్తున్నారని తెలిసి మావారు ముందుగా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆ తరువాత నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. డాక్టర్ నా కాలిని పరీక్షించి చూసి, “ఇప్పుడే దీనికి ఏమీ చేయవలసిన అవసరం లేదు, బుడిపె పెద్దది అయితే ఆపరేషన్ చేయాలి” అని చెప్పారు. అంతేగాక, నా మెడకు ఎక్స్-రే తీయించారు. అప్పటినుండి మెడ భాగమంతా నొప్పి ఎక్కువ అయింది. మందులు వేసుకుంటున్నా నొప్పి తగ్గలేదు. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ నొప్పి భరించలేక రోజూ ఏడుపు వచ్చేది. తరువాత నాకు బాబా గుర్తువచ్చి, బాబాకు నమస్కారం చేసుకుని, "స్వామీ! నా మెడనొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో కొన్నిరోజులకి ఎక్స్-రే వల్ల వచ్చిన నొప్పి చాలావరకు తగ్గిపోయింది. బాబా దయవల్ల ఇప్పుడు బాగానే ఉంది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిబాబాకు చేసిన ప్రార్థన - నయమైన తలనొప్పి
సాయి పాదాలకు, సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సుచిత్ర. మన సాయితండ్రిని నాకు మరింత దగ్గర చేసింది ఈ ‘సాయి మహారాజ్ సన్నిధి’. బాబా ఇదివరకు నా జీవితంలో ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇప్పుడు చెప్పబోయే అనుభవం చిన్నదే అయినా బాబా ప్రేమను నేను పూర్తిగా అనుభూతి చెందిన అనుభవమిది. 2020, జూలై 5వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు నేను విపరీతమైన తలనొప్పితో బాధపడ్డాను. ఆ బాధలో, ‘బాబా మా ఇంట్లో కొలువై ఉన్నార’న్న సంగతి కూడా మరచిపోయాను. బాబాతో నా బాధ చెప్పుకోవాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. ప్రతిరోజూ సాయి సచ్చరిత్రలో ఒక ఆధ్యాయం చదివే అలవాటున్న నేను జూలై 9వ తేదీన ఆరోజు చదవాల్సిన అధ్యాయం చదువుతుంటే మనసులో ఒక ఆలోచన మెదిలి, బాబాకు నమస్కరించుకుని, "బాబా! నా ఈ తలనొప్పి రేపు మధ్యాహ్న ఆరతి లోపు తగ్గితే, వచ్చే గురువారం మీకు ఒక కొబ్బరికాయను సమర్పించుకుంటాను" అని బాబాకు మ్రొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన క్షణంనుంచే తలనొప్పి మెల్లమెల్లగా తగ్గుతూ తరువాతి రోజు, అంటే జూలై 10 మధ్యాహ్న ఆరతి సమయానికి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. అంతేకాదు, ఆరోజు రాత్రి నేను ఒక మందిరానికి వెళ్లినట్టు, అక్కడ మెట్టు మెట్టుకూ పూజ చేసుకుంటూ వెళ్లి పూజారి చేతికి కొబ్బరికాయ సమర్పించినట్టు స్వప్నం వచ్చింది. ప్రార్థించగానే ఎంతో కృపతో నా తలనొప్పిని పూర్తిగా తగ్గించిన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”
నేను అడగకుండానే బాబా నాకొక బహుమతి ఇస్తున్నారు, కానీ ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. అలా ఆగిపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. “బాబా! మీరు ఇవ్వబోయే బహుమతి కోసం మీరు చెప్పిన సబూరితో ఎదురుచూస్తుంటాను”. ఆ బహుమతిని బాబా నాకు ప్రసాదించగానే ఆ అనుభవాన్ని పంచుకోవటానికి మరలా మీ ముందుకు వస్తాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ReplyDeleteవిశ్వవిశ్వంభరాన నావిర్భవించు
విమల చైతన్య మీవ - యీ విధివిలాస
జగతి నీదు లీలావిలాసమ్మె సుమ్ము
సాధుజన పోష ! మృదుభాష ! సాయినాథ🙏💐🙏
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhavya sree
సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm sri sairam 🌼🌸🍇
ReplyDeleteBaba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me