సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వాసుదేవ్ సదాశివ్ జోషి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

శ్రద్ధ  -  సబూరి
వాసుదేవ్ సదాశివ్ జోషి మరియు అతని స్నేహితుడు చిదంబరరావు గాడ్గిల్ సాయి దర్శనార్ధం షిరిడీ వెళ్లారు. వాళ్ళు సాఠేవాడాలో దిగారు. ఆ రోజులలో సాఠేవాడాలోనూ, గురుస్థాన్ వద్ద కూడా ఆరతి జరిగేది. వారు నిత్యమూ సాఠేవాడాలో ఆరతికి హాజరయ్యేవారు. ఒకసారి సదాశివ్ జోషికి  అక్కడ సాయి పటంలో నరసింహస్వామి దర్శనం అయ్యింది. అతడు సంతోషంతో ఆశ్చర్యపోయాడు. అలా వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమయింది. తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా ఊదీ, కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చారు. వాళ్ళు ఆ ప్రసాదం వారి గ్రామంలో పంచడానికి సరిపోదని అనుకున్నారు. బాబా వారి ఆలోచన గ్రహించి, వారికి 8 అణాలు ఇచ్చి, “ఎక్కడైనా మిఠాయికొని తీసుకుపో,  అదీ నా ప్రసాదమే!" అన్నారు. ఆయన సన్నిధిచేత పవిత్రమైన శిరిడీలోని పదార్ధమంతా ఆయన ప్రసాదమే!

మరోసారి వారిద్దరూ షిరిడీ వచ్చినప్పుడు బాబా బర్ఫీ ప్రసాదం పంచారు. అది వారికి చాలా రుచికరంగా అనిపించింది. అందువలన వారు మరికొంత కొనుక్కోవాలని అనుకున్నారు. వెంటనే బాబా, “అక్కడ మూడు బుట్టల నిండా బర్ఫీ ఉంది, అందులోనుంచి మూడు దోసిళ్ళు ప్రసాదం తీసుకోండి” అన్నారు. వారు సంతోషంతో బాబా ఊదీ, బర్ఫీ ప్రసాదం తీసుకొని ఇంటికి చేరుకున్నారు.

కొన్ని రోజుల తరువాత తన మిత్రుడు గాడ్గిల్  షిర్డీ వెళుతుంటే, జోషి తన వంతుగా 10 రూపాయలు బాబాకు దక్షిణగా సమర్పించమని మిత్రునికి ఇచ్చాడు. అంతేకాకుండా, జోషి తన ఇంట విధిగా బాబాను పూజించుకోవటం కోసం ఎలాగైనా సాయిని ఫోటో తీయమని, ఆ ఫోటోను తనకు తెచ్చిమ్మని కెమెరా ఇచ్చాడు. గాడ్గిల్ ఆ పది రూపాయలు, కెమెరా తీసుకొని ద్వారకామాయికి వెళ్లి, బాబాకు ప్రణామములు చేసి, జోషి ఇచ్చిన 10 రూ. దక్షిణ బాబాకు సమర్పించాడు. ఫోటో తీయటంకోసం బాబా అనుమతి అడగటానికి ధైర్యం చాలక చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతడు తన తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతుండగా, స్వయంగా బాబానే, “ఫోటో తీసుకో"మని చెప్పారు. అతడు సంతోషంతో ఉప్పొంగిపోయి రెండు బాబా ఫోటోలు - కూర్చున్నది ఒకటి, నిలుచున్నది ఒకటి - తీసాడు గాడ్గిల్. అప్పుడు బాబా, "ఈ ఫోటోలను లాభం కోసం ఎక్కువ ధరకు అమ్మవద్దు" అని చెప్పి ఊదీ, ప్రసాదం ఇచ్చి, తిరుగు ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఇదంతా చూసి భక్తులు ఆశ్చర్యపోతుంటే, "ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు" అని చెప్పాడు గాడ్గిల్.  అలా బాబా తమ భక్తుల కోరికలు నేరువేరుస్తారు.

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

సాయి భక్తులకు మనవి. బాబా మీకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా సాయి బంధువులతో పంచుకోవాలని అనుకుంటే మీ అనుభవాలను క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడికి లేదా వాట్సాప్ నెంబరుకి పంపించండి.
+918096343992

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo